Side Effects of Ajinomoto : రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్(Fast Food) సెంటర్లకు వెళ్లడం ఇప్పుడు ఫ్యాషన్. టేస్ట్ కూడా సూపర్ గా ఉండడంతో.. పిల్లలు కూడా ఆ ఫుడ్ కావాలంటూ గోల చేస్తుంటారు. కానీ.. ఆ ఫుడ్స్‌లో వినియోగించే అజినమోటో ద్వారా దీర్ఘకాలంలో కోలుకోలేని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకీ ఏంటీ అజినమోటో? ఇది ఎందుకు ప్రమాదకరం? ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి? అన్నది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అజినమోటో అనేది మోనోసోడియం గ్లుటామేట్గా పిలుచుకునే ఓ రసాయన పదార్థం. దీనిని రుచికోసం చైనీయులు వంటల్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అందుకే ఈ అజినమోటోను సాధారణ భాషలో చైనా ఉప్పు అని అంటుంటారు. దీనిని రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలోనే కాదు ఇప్పుడు చాలా మంది ఇంట్లో చేసుకునే సాంబారు, సూప్‌లు, ప్రాసెస్డ్ ఫుడ్స్, కర్రీలలో కూడా యూజ్ చేస్తున్నారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తయారుచేసే నూడుల్స్‌లో అయితే ఇది తప్పనిసరిగా ఉంటుంది. అజినమోటో వాడడం వల్ల వంటలకు మంచి రుచి, సువాసన వస్తుంది. కానీ.. తేనె పూసిన కత్తిలాగా దాని రుచివెనుక ప్రమాదకరమైన విషం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
"భయ్యా - పిజ్జా విత్ ఎక్స్ట్రా ఛీజ్" అని ఆర్డర్ వేస్తున్నారా? - అయితే ఇదర్ దేఖో జీ!
- కొంతమందికి MSG ఉన్న ఆహారాన్ని తీసుకున్న తర్వాత తలనొప్పి, చెమటలు, ఛాతీ నొప్పి వంటి లక్షణాలను అనుభవిస్తున్నట్లు ఆరోగ్య నిపుణులు పేర్కొన్నారు. దీన్ని "చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్"గా సూచిస్తారని చెబుతున్నారు.
- అజినమోటోలో సోడియం అత్యధికంగా ఉంటుంది. ఈ సోడియం అధిక వినియోగం వల్ల త్వరగా బీపీ ఎటాక్ అవుతుంది. గుండె జబ్బులు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ఇప్పటికే రక్తపోటు ఉన్నవారు లేదా గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు.. దీన్ని తింటే మరింత ప్రమాదం వాటిల్లుతుందని చెబుతున్నారు. కాబట్టి.. అజినమోటో ఉండే ఫుడ్స్‌కు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది అంటున్నారు నిపుణులు.
- అజినమోటో అధికంగా ఉండే ఆహారాలు రుచిగా ఉండడం వల్ల అతిగా తినడాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది.
- ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి, ఊబకాయానికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
- అజినమోటోను అతిగా తీసుకుంటే వచ్చే తలనొప్పి క్రమంగా మైగ్రేన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- అంతేకాదు.. అజినమోటో నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని సూచిస్తున్నారు.
- అందుకే వీలైనంతర వరకు MSG కలవని ఫుడ్స్ తీసుకోవడంపై దృష్టి పెట్టాలంటున్నారు. అందుకోసం ముందుగా మీరు తినే ఫుడ్స్‌లో మోనోసోడియం గ్లుటామేట్ లేకుండా చూసుకోవడం చాలా అవసరం.
- టమాటాలు, పర్మేసన్ చీజ్, పుట్టగొడుగులు వంటి సహజమైన ఆహార వనరుల్లోనూ గ్లుటామేట్ ఉంటుంది. కాబట్టి తినే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.
- ఈ ప్రాసెసింగ్ ఫుడ్స్‌కు బదులుగా మామూలు ఆహారాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణలు సూచిస్తున్నారు.