Egg Yellow Vitamins Benefits : రోజూ కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల అరోగ్య ప్రయోజనాలున్నాయని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే..శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుందనే కారణంతో కొంత మంది గుడ్డులోని పచ్చసొన తినకుండా.. కేవలం ఎగ్‌వైట్ మాత్రమే తింటున్నారు. మరి.. దీనివల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
విటమిన్ A :
గుడ్డు పచ్చసొనలో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. ఇది మనం ఆరోగ్యంగా ఉండటంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే రోజూ ఎగ్ తినడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందట. రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఎగ్‌వైట్‌తో పాటు పచ్చసొనను కూడా తినాలని సూచిస్తున్నారు.
బ్రేక్ ఫాస్ట్‌లో గుడ్డు తింటున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?
విటమిన్ D :
ఎగ్ పచ్చసొనలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. దీనిని "సన్‌షైన్ విటమిన్" అని కూడా పిలుస్తారు. ప్రతిరోజు కోడి గుడ్డును తినడం వల్ల ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. పచ్చసొనలో ఉండే విటమిన్ డి శరీరంలో కాల్షియంను గ్రహించడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 2018 లో 'Nutrients' జర్నల్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. రోజుకు ఒక గుడ్డు తినే వారిలో.. తినని వారి కంటే ఎముక సాంద్రత ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట. అలాగే గుడ్డులో విటమిన్ డి పుష్కలంగా ఉందని, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతుందని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ శ్రీలత (డైటీషియన్) చెబుతున్నారు.
విటమిన్ E :
కోడిగుడ్డులోని పచ్చసొనలో విటమిన్ E అధికంగా ఉంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. విటమిన్ E ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కణాలను రక్షిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడంలో, చర్మాన్ని హెల్దీగా ఉంచడంలో సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
విటమిన్ B12 :
గుడ్డు పచ్చసొనలో విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది. ఇది నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రక్తంలో ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతో తోడ్పాటును అందిస్తుంది.
విటమిన్ K :
గుడ్డు పచ్చసొనలో విటమిన్ K ఉంటుంది. అయితే, రోజూ గుడ్డు తినడం వల్ల రక్తంలో విటమిన్ కె శాతం పెరుగుతుంది. దీనివల్ల అనుకోకుండా ఎప్పుడైనా దెబ్బలు తగిలి అధిక రక్తస్రావం జరుగుతున్నప్పుడు.. విటమిన్ K రక్తం గడ్డకట్టించి బ్లడ్ పోకుండా సహాయపడతుంది. అలాగే ఎముకల ఆరోగ్యానికీ ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ B2:
విటమిన్ B2ని 'రిబోఫ్లావిన్' అని కూడా పిలుస్తారు. గుడ్డు పచ్చసొనలో ఇది అధికంగా ఉంటుంది. రోజూ ఎగ్‌ను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే కంటిలోని కణాలను దెబ్బతినకుండా రక్షించే యాంటీఆక్సిడెంట్‌గా విటమిన్ B2 పనిచేస్తుందట.
విటమిన్ B9 :
విటమిన్ B9ని 'ఫోలేట్' అని కూడా పిలుస్తారు. ఇది DNA నిర్మాణానికి అవసరం. మన కణాలలోని జన్యు సమాచారాన్ని నిల్వ చేస్తుంది. గుడ్డు పచ్చసొనలోని ఫోలేట్ DNA దెబ్బతినకుండా రక్షించడంలో కూడా సహాయపడుతుంది. అలాగే ఫోలేట్ రక్తంలో ఎర్ర రక్తకణాలను పెంచుతాయి. మన శరీరంలో విటమిన్ బి9 లోపం వల్ల రక్తహీనత సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే గుడ్డు పచ్చసొన కూడా తినాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎగ్స్ Vs పనీర్- ఏది మంచిది? ఎందులో ప్రొటీన్ ఎక్కువ!
గుడ్డు పచ్చసొన తింటే నిజంగానే ఆరోగ్యానికి ముప్పు? - రీసెర్చ్‌లో ఆసక్తిర విషయం!