ETV Bharat / health

ఇవి తింటే మీ వయసు సెంచరీ కొట్టడం పక్కా! - 60 ఏళ్లు దాటినవాళ్లు పాటించాల్సిన ఆహార నియమాలివే! - which food is good for old people

Food habits in Old age : వయసులో ఉన్నప్పుడు రాళ్లను తిన్నా అరిగించుకునే కెపాసిటీ ఉంటుంది. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మందగిస్తుంది. దీంతో తరచుగా అజీర్తీ, గ్యాస్ ట్రబుల్, పొట్ట ఉబ్బరం, పుల్లటి తేన్పులు వస్తుంటాయి. అయితే వయసుకు తగ్గట్టుగా రోజువారీ ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. వయసు పైబడినవారు రోజూ ఏం తినాలి? ఎలా తినాలి? వృద్ధాప్యంలో ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Food habits in Old age
which food is good for old people (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 1:58 PM IST

Food habits in Old age : వయసులో ఉన్నప్పుడు తిండి విషయంలో పెద్దగా చింత ఉండదు. ఏం తిన్నా.. ఎలా తిన్నా.. కాలం గడిచిపోతుంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతీదాన్ని వెనుకాముందు చూసుకోవాల్సి వస్తుంది. మునపటిలా అరగించుకునే శక్తి తగ్గిపోతుంది. వయసుతోపాటు జీవ క్రియలు మందగిస్తాయి. జీర్ణశక్తి, ఆకలి తగ్గుతుంది. ఒక వైపు షుగర్​, బీపీ, క్యాన్సర్​ లాంటి పీడించే వ్యాధులు.. మరోవైపు వాటిని అదుపులో ఉంచుకునేందుకు వాడే మందులు మూలంగా కడుపులో సమస్యలు పెరుగుతుంటాయి. ఇలాంటి నేపథ్యంలో రోజూవారీ ఆహారం విషయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 60ఏళ్ల తర్వాత ఆహార నియమాలు చక్కగా ఉంటే.. అవే అద్భుతమైన ఔషధాలుగా పనిచేస్తాయని చెబుతారు పోషకాహార నిపుణులు.

కొందరు వృద్ధులు ఆరోగ్యంగానే ఉంటున్నా.. లోపల శారీరక మార్పులు మాత్రం జరుగుతుంటాయని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్​ అంజలీ దేవి వివరించారు. దీనిని గుర్తుంచుకుని శారీరక స్థితిని బట్టి ఆహారాన్ని మార్చుకోవాలని సూచించారు. సమయానికి ఆహారం తీసుకోవాలని.. వయసుకు, శక్తికి తగ్గ వ్యాయామం చేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే వృద్ధులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎలా తినాలి? ఇలాంటి ప్రశ్నలకు డాక్టర్​ అంజలీ దేవి చెబుతున్న సమాధానాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.

వృద్ధులు తినాల్సినవి

  • ఆకు కూరలు
  • కూరగాయలు
  • దుంపలు
  • గింజ ధాన్యాలు
  • మాంసకృత్తులు
  • ఐరన్,​ కాల్షియం ఉండే ఆహారం
  • బీ కాంప్లెక్స్​, విటమిన్ డీ ఉండే పండ్లు
  • పాలు, పాల పదార్థాలు
  • పీచు లభించే పండ్లు, కూరగాయలు
  • ముడి, దంపుడు బియ్యం
  • విటమిన్ డీ సప్లమెంట్స్​(డాక్టర్ సలహా మేరకు)
  • రాగులు
  • చేపలు
  • నీళ్లు ఎక్కువగా తాగాలి

వృద్ధులు తినకూడనివి..

  • ఉప్పు
  • చక్కెర
  • స్వీట్లు
  • డీప్​ ఫ్రై చేసిన వంటకాలు
  • ఫాస్ట్​ఫుడ్​
  • కర్రీపాయింట్లలో కూరలు
  • నెయ్యి
  • పొద్దుతిరుగుడు నూనె

60ఏళ్లు దాటిన చాలా మంది ఏం తిన్నా సహించడం లేదని.. తినే తిండికి రుచీపచీ ఉండట్లేదని వాపోతుంటారు. ఇంట్లో వాళ్లు ఎంత బాగా వండినా కూడా ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి కారణం.. నాలుకపైన ఉండే రుచిమొగ్గలు తగ్గిపోవడం.. ఉన్నవి కూడా సరిగ్గా రుచిని గ్రహించకపోవడం వల్ల చప్పిడిగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇక వాసన విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహార నియమాలను సవరించుకోవాలని సూచిస్తున్నారు. బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు. ఆహారాన్ని కొద్ది మోతాదులో ఎక్కువ సార్లు తినడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటిని అనుసరిస్తే జీవితపు ఆఖరి మజిలీని ఆనందంగా, ఆరోగ్యంగా గడిపేయొచ్చని అంటున్నారు.

దగ్గు తీవ్రంగా వేధిస్తోందా? - ఇలా చేస్తే వెంటనే తగ్గిపోతుంది! - how to reduce cough naturally

అలర్ట్​: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? - థైరాయిడ్​ కావొచ్చు - వెంటనే చెక్ చేసుకోండి! - Symptoms Of Thyroid

అలర్ట్ : ఇలా చేయకపోతే - వక్షోజాలు సాగిపోయే అవకాశం ఎక్కువట! - Sagging Breasts Causes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.