ETV Bharat / health

శరీరం చెమట కంపు కొడుతోందా? - వాడాల్సింది సెంటు కాదు..! - Causes Bad Body Smell

Reasons For Body Smell : ఒంటి నుంచి వచ్చే చెమట కంపుతో చాలా ఇబ్బంది పడుతుంటారు. దీంతో.. సెంటు, డియోడరెంట్స్​ వాడుతుంటారు. కానీ.. అది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. మరి శాశ్వత పరిష్కారం ఏంటో మీకు తెలుసా??

Body Smell
Reasons For Body Smell (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 3, 2024, 11:13 AM IST

What Causes Bad Body Smell : శరీరం నుంచి చెమట దుర్వాసన రావడానికి.. మనం తినే కొన్ని ఆహార పదార్థాలు కూడా కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఆ ఫుడ్‌ ఐటమ్స్‌ తక్కువగా తీసుకుంటే.. మంచి ఫలితం కనిపిస్తుందని అంటున్నారు. మరి.. అవేంటి? అన్నది ఈస్టోరీలో చూద్దాం.

క్యాబేజీ, గోబీ :
క్యాబేజీ, గోబీలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి జీర్ణం అయినప్పుడు హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును విడుదల చేస్తాయట. ఈ వాయువు దుర్వాసన వస్తుంది. ఇది శ్వాస ద్వారా బయటకు వచ్చినప్పుడు నోటి దుర్వాసనకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరం నుంచి కూడా బ్యాడ్‌స్మెల్‌ వస్తుంది.

మీ శరీరం నుంచి ఈ రకమైన దుర్వాసన వస్తోందా? - అయితే, మీకు డయాబెటిస్ ఖాయం!

వెల్లుల్లి :
వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా శరీరం నుంచి బ్యాడ్‌ స్మెల్ వస్తుంది. అలాగే వెల్లుల్లి నోటి దుర్వాసకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. 2019లో "Journal of Breath Research" అనే జర్నల్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వెల్లుల్లి తినడం వల్ల శరీరం నుంచి వచ్చే దుర్వాసన పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో నెదర్లాండ్‌లోని వాగెనింగెన్ యూనివర్సిటీ & రీసెర్చ్‌కు చెందిన 'డాక్టర్ జోహన్ పీటర్ వాన్ ట్రిజ్ప్' పాల్గొన్నారు.

మసాలాలు :
కొంతమందికి స్పైసీగా తినడం అంటే చాలా ఇష్టం! ఇలా తినే వారు ఆహార పదార్థాలలో ఎక్కువగా మసాలాలను యాడ్‌ చేసుకుంటారు. అయితే, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల శరీరం నుంచి దుర్వాసన పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మసాలా దినుసులు శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. దీనివల్ల చెమట ఎక్కువగా పట్టి బ్యాడ్‌ స్మెల్‌ వస్తుందట. ఇది నోటి దుర్వాసనకు కూడా కారణమవుతుంది. కాబట్టి, శరీర దుర్వాసనతో బాధపడేవారు మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు.

నాన్‌వెజ్‌ :
కొంతమంది రోజూ నాన్‌వెజ్ లేకుండా భోజనం చేయలేరు! చికెన్‌, మటన్‌, ఫిష్‌ వంటిది ఏదో ఒకటి ప్లేట్‌లో తప్పకుండా ఉండాల్సిందే. ఇలా మాంసం ఎక్కువగా తినడం వల్ల నోటి నుంచే కాకుండా శరీరం నుంచి దుర్వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

శరీరం నుంచి దుర్వాసన రాకుండా ఇలా చేయండి :

  • ప్రతిరోజూ రెండుసార్లు స్నానం చేయండి.
  • స్నానం చేసే ముందు బకెట్‌ నీళ్లలో కొద్దిగా టమాటా రసాన్ని వేసుకోండి. ఇలా చేయడం వల్ల బ్యాడ్‌స్మెల్‌ కొంత వరకు తగ్గుతంది.
  • అలాగే అండర్‌ ఆర్మ్స్ ప్రాంతంలో దుర్వాసన ఎక్కువగా వస్తుంటే.. ఒక కప్పు నీటిలో రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
  • ఒక కాటన్‌ వస్త్రంలో యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను నానబెట్టి శరీరానికి రాసుకుంటే.. దుర్వాసన తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చిగుళ్ల నుంచి రక్తం, నోటి దుర్వాసన, పంటినొప్పి - కేవలం జామ ఆకులతో ఇలా చేస్తే ఆల్ క్లియర్!

దంతాలు దెబ్బతిన్న తర్వాత బాధపడితే నో యూజ్ - బ్రష్‌ చేయడం ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.