ETV Bharat / health

ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే సేఫ్​! - Precautions to Pregnant Women

author img

By ETV Bharat Health Team

Published : Aug 20, 2024, 11:23 AM IST

Updated : Aug 20, 2024, 4:09 PM IST

Pregnancy: అమ్మ అవుతున్నామని తెలియగానే చాలా మంది అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఇక కొద్దిమంది అయితే డెలివరీ అయ్యే వరకు ప్రయాణాలు కూడా చేయరు. అయితే గర్భిణులు ప్రయాణాలు చేయవచ్చని.. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Travelling During pregnancy
Travelling During pregnancy (ETV Bharat)

Precautions to be taken by Pregnant Women: గర్భం ధరించామని తెలియగానే కొంతమంది తమ పనులు తాము చేసుకోవడానికి కూడా వెనకాడుతుంటారు. మరికొద్దిమందైతే అత్యవసర పరిస్థితుల్లో తప్ప డెలివరీ అయ్యే దాకా ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటారు. ఎందుకంటే కడుపులోని బిడ్డకు ఏదైనా అసౌకర్యం కలుగుతుందేమో అని జాగ్రత్తపడుతుంటారు. అయితే ప్రెగ్నెన్సీ అనేది సమస్య కాదని, ఈ క్రమంలో శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఎవరికి వారు అన్ని పనులు చేసుకోవచ్చని, తద్వారా మరింత చురుగ్గా ఉండగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా.. గర్భంతో ఉన్నప్పుడు ప్రయాణాలు కూడా చేయచ్చని.. అయితే అందుకు ముందుగా డాక్టర్‌ సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇక దీంతో పాటు ప్రయాణం చేయాలనుకునే గర్భిణులు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించడం మంచిదని సూచిస్తున్నారు.

మన శరీరంలో ప్రొజెస్టరాన్‌ హార్మోన్‌ గర్భాశయానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ప్రెగ్నెన్సీ సమయంలో(National Institute of Health రిపోర్ట్​) గర్భాశయ ముఖద్వారాన్ని బిగుతుగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఫలితంగా మెట్లెక్కడం, చిన్నపాటి వ్యాయామాలు, ప్రయాణాలు.. వంటివి చేయడం వల్ల లోపల బిడ్డకు ఎటువంటి ఇబ్బందీ కలగదని చెబుతున్నారు నిపుణులు. అయితే గర్భిణుల్లో ఒక్కొక్కరి ఆరోగ్య పరిస్థితి ఒక్కోలా ఉంటుంది. కొందరు యాక్టివ్​గా ఉంటే.. మరికొందరు ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా కాబోయే అమ్మలు మాత్రం ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని ప్రముఖ యూరోగైనకాలజిస్ట్​ డాక్టర్​ ప్రణతీ రెడ్డి చెబుతున్నారు.

గర్భిణులు తినే ఆహారం పుట్టే పిల్లలకు ప్రమాదమా? - ఏం తింటే చిన్నారులు ఆరోగ్యంగా పుడతారో తెలుసా?

గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే:

  • గర్భం ధరించిన వారిలో వాంతులు, వికారం.. వంటి లక్షణాలు నెలల పాటు కొనసాగుతాయని.. అందుకే ప్రయాణాల్లో ఇలాంటి సమస్యలు లేకుండా ఉండాలంటే సులభంగా జీర్ణమయ్యే పోషకాహారాన్ని తక్కువ మొత్తంలో తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్​ ప్రణతీ రెడ్డి సూచిస్తున్నారు.
  • ప్రెగ్నెన్సీ రిపోర్టులు, డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్స్‌, మందులు.. వంటివన్నీ ఎప్పుడూ బ్యాగ్‌లో ఉంచుకోవాలని.. తద్వారా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే అక్కడికి దగ్గర్లోని ఆస్పత్రిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవచ్చని వివరిస్తున్నారు.
  • వాటర్​ బాటిల్​ను కూడా వెంట ఉంచుకోవడమూ మంచిదని.. అలాగే మధ్యమధ్యలో వీలుంటే కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పడిపోకుండా ఉంటాయంటున్నారు. ఇక ఫ్రూట్​ జ్యూస్​లు తాగాలనుకున్నవారు ఇంటి నుంచే తయారుచేసి తీసుకెళ్లడం మంచిదంటున్నారు.
  • ప్రయాణాల్లో బిగుతైన దుస్తులు కాకుండా వదులుగా, సౌకర్యవంతంగా ఉండే వస్త్రాలు ధరించడం మంచిదని నిపుణులు అంటున్నారు. తద్వారా కూర్చున్నా ఇబ్బందిగా అనిపించదని.. అలాగే చెప్పుల విషయంలోనూ ఫ్లాట్స్‌ని ఎంచుకుంటే కంఫర్టబుల్‌గా నడవడానికి వీలవుతుందని సూచిస్తున్నారు.

ప్రెగ్నెన్సీ టైమ్​లో ఈ ఆహారం తింటున్నారా? - మీ బిడ్డ హెల్త్ డేంజర్​లో పడ్డట్టే!

  • టాయిలెట్స్‌కి వెళ్లే వారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని.. ఆయా వాష్‌రూమ్స్‌ డోర్స్‌, నాబ్స్‌ని తాకినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవడానికి వీలుగా ఓ మినీ హ్యాండ్‌వాష్‌ బాటిల్‌ను ఉంచుకోవడం మంచిదంటున్నారు. అలాగే మధ్యమధ్యలో చేతులు శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
  • కవలలు, ట్రిప్లెట్స్‌కు జన్మనివ్వబోయే తల్లులు.. విమానాల్లో ప్రయాణించకపోవడమే మంచిదంటున్నారు. అలాగే ప్రెగ్నెన్సీ వచ్చి 35 వారాలు దాటిన వారు కూడా ఫ్లైట్​ జర్నీకి నో చెప్పడమే మంచిదట! ఎందుకంటే ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రి-మెచ్యూర్‌ డెలివరీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. ఒకవేళ అత్యవసరం అయి వెళ్లాలనుకుంటే డాక్టర్​ను తప్పనిసరిగా అడగాలని అంటున్నారు.
  • కారులో వెళ్లే వారు సీట్ బెల్ట్ పెట్టుకోవడం, మధ్యమధ్యలో ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్రదేశంలో వాహనాన్ని ఆపి కాసేపు రిలాక్సవడం, అటూ ఇటూ తిరగడం వల్ల ప్రయాణ అలసటను దూరం చేసుకోవచ్చని.. తద్వారా జాగ్రత్తగా ఉండొచ్చని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్‌ - గర్భిణులు పానీపూరి తింటే ఏమవుతుంది?

"మాతృ వందన" పథకానికి అప్లై చేశారా..? ఉచితంగా రూ.5వేలు ఆర్థిక సాయం!

Last Updated : Aug 20, 2024, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.