ETV Bharat / health

చిన్నారులకు సాక్సులు, షూలు వేస్తున్నారా? చెప్పుల్లేకుండా నడిపిస్తే ఎన్నో లాభాలట! - BAREFOOT WALKING BENEFITS FOR KIDS

-చిన్నారులకు చెప్పులు వేయకుండా నడిపిస్తే ఎన్న ప్రయోజనాలు -పచ్చటి గడ్డిపై నడవడం వల్ల మెరుగైన కంటి చూపు, సుఖ నిద్ర

Barefoot Walking Benefits for Children
Barefoot Walking Benefits for Children (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Nov 14, 2024, 3:25 PM IST

Barefoot Walking Benefits for Children: చిన్నపిల్లల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. వారిని చెప్పుల్లేకుండా కాలు బయటపెట్టనివ్వరు. పాదాలకు మట్టి అంటి లేలేత పాదాలు కందిపోతాయని.. సాక్సులు, షూలు తొడిగేస్తుంటారు. అయితే ఈ అతి జాగ్రత్త అన్ని సందర్భాల్లో పనికి రాదని చెబుతున్నారు నిపుణులు. చిన్నారులు చెప్పుల్లేకుండా ఒట్టి కాళ్లతో నేలపై, పచ్చటి గడ్డిపై నడవడం వల్ల ఆరోగ్యపరంగా, మానసికంగా అనేక ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. మరి, ఇంకెందుకు ఆలస్యం అవేంటో మనమూ తెలుసుకుందాం రండి.

మెదడు చురుగ్గా పనిచేస్తుందట!
చిన్న వయసులో చెప్పులతో తిరిగిన పిల్లలతో పోల్చితే చెప్పుల్లేకుండా నేలపై తిరిగిన చిన్నారుల్లో అనేక మెరుగైన ఫలితాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఇలా చెప్పులు లేకుండా నడవడం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తున్నట్లు The Benefits of Barefoot Walking for Children అనే అధ్యయనంలో వెల్లడైంది. Journal of Pediatric Health Careలో ప్రచురితమైన ఈ పరిశోధనలో University of California, Los Angeles డాక్టర్ Emily J. Rovelto పాల్గొన్నారు. ఇందుకు మెదడుతో అనుసంధానమై ఉన్న ప్రెజర్‌ పాయింట్స్‌పై ఒత్తిడి పడడమే కారణమని చెబుతున్నారు. దీనివల్ల మెదడులోని నాడులు ఉత్తేజితమై.. తద్వారా వారిలో జ్ఞాపకశక్తి, ఆలోచనా సామర్థ్యం వంటివి మెరుగుపడతాయని వివరించారు. అందుకే చెప్పుల్లేకుండా పిల్లల్ని వివిధ ఉపరితలాలపై నడిపించాలని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఇదే కాకుండా రోజూ కాసేపు పచ్చటి గడ్డిలో ఆడించడం, చెప్పుల్లేకుండా తిప్పడం వంటివి చేస్తే శరీరంలో ఎండార్ఫిన్లు విడుదలవుతాయని అంటున్నారు. హ్యాపీ హార్మోన్లుగా పిలిచే వీటి వల్ల మనసులోని టెన్షన్లన్నీ మాయమై.. మానసిక ప్రశాంతత సొంతమవుతుందని వెల్లడించారు.

కంటి చూపు మెరుగు!
ప్రస్తుతం చాలామంది పిల్లలకు చిన్న వయసులోనే కళ్లద్దాలు వస్తున్నాయి. ఇందుకు గ్యాడ్జెట్లు ఒక కారణమైతే, సరైన పోషకాహారం తీసుకోకపోవడం మరో కారణం అని నిపుణులు చెబుతున్నారు. అయితే పిల్లలకు నడక వచ్చినప్పట్నుంచే వారిని చెప్పుల్లేకుండా నేలపై, పచ్చటి గడ్డిపై నడిపించడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుందని అంటున్నారు. కంటికి అనుసంధానమైన నాడులకు సంబంధించిన ప్రెస్సింగ్‌ పాయింట్స్‌ పాదాల్లో ఉంటాయని.. ఇవి నేలపై నడవడం వల్ల వాటిపై ఒత్తిడి పడుతుందదని వివరించారు. ఫలితంగా కళ్లకు సరైన రక్తప్రసరణ జరిగి కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని వెల్లడించారు. ఇక పచ్చటి గడ్డిని చూడడం వల్ల కంటిలోని కండరాలు విశ్రాంతి తీసుకుంటాయని చెబుతున్నారు. పెద్దైన తర్వాత ఈ అలవాటును ఇలాగే కొనసాగించడం వల్ల ఇతర కంటి సంబంధిత సమస్యల్లేకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు.

పిల్లలు సుఖంగా నిద్రపోతారు!
చిన్న పిల్లలు సమయానికి నిద్రపోకుండా తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. స్కూల్‌ ఉన్న రోజు, సెలవు రోజుల్లో వేర్వేరు సమయాల్లో నిద్రపోతుంటారు. ఇలా నిద్రపోవడం వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని చెబుుతన్నారు. మెదడు ఎదుగుదల పైనా దీని ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యల్లేకుండా.. రోజూ ఒకే రకమైన నిద్ర సమయాల్ని వారికి అలవాటు చేయాలంటే.. పిల్లలను కాసేపు చెప్పుల్లేకుండా నేలపై, పచ్చటి గడ్డిపై నడిపించాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల శరీరంలోని హార్మోన్లు సమతులమై.. సుఖంగా నిద్ర పట్టడంతో పాటు ఇతర అనారోగ్యాల బారిన పడకుండా కూడా జాగ్రత్తపడొచ్చని పేర్కొన్నారు.

చిన్నారుల్లో నెగెటివిటీ దూరం!
నెగెటివ్ ఆలోచనలు పెద్దవారిలోనే కాకుండా.. చిన్న పిల్లల్లోనూ వస్తుంటాయి. పెద్దయ్యే క్రమంలో అవి వారిని మరింత నెగెటివిటీలోకి మారుస్తుంటాయి. వాటిని కట్టిపెట్టి చిన్నతనం నుంచే వారిలో సానుకూల దృక్పథం నింపాలంటే.. రోజూ కాసేపు ఒట్టి కాళ్లతో నేలపై నడిపించాలని సూచిస్తున్నారు. ఫలితంగా భూమిలోని పాజిటివ్‌ ఎలక్ట్రాన్లు శరీరంలోకి ప్రవేశించి.. ఇదే సమయంలో శరీరంలోని నెగెటివ్‌ ఎలక్ట్రాన్లను భూమి గ్రహిస్తుందని వివరించారు. ఫలితంగా ప్రతి విషయంలోనూ సానుకూలంగా ఆలోచించే శక్తి వారిలో పెరిగి.. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

స్వీట్స్ చూడగానే ఆగలేకపోతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ముందు పెట్టినా తినరు! క్రేవింగ్స్ ఈజీగా తగ్గిపోతాయట

షుగర్​ ట్రీట్​మెంట్​లో కొత్త మార్పులు? ఏ మందులు వాడాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.