ETV Bharat / health

ఈ డ్రింక్స్‌తో - సమ్మర్​లో ఈజీగా బరువు తగ్గొచ్చు! - Weight Loss Drinks - WEIGHT LOSS DRINKS

Weight Loss Drinks : సమ్మర్​లో ఎండ వేడి తీవ్రంగా ఉంటుంది. అందుకే.. జనం రకరకాల డ్రింక్స్​తో చిల్ అవుతుంటారు. అయితే.. రోజూ ఉదయాన్నే కొన్ని డ్రింక్స్‌ తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు, బాడీని హైడ్రేట్‌గా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఆ డ్రింక్స్‌ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Weight Loss Drinks
Weight Loss Drinks
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 3, 2024, 11:08 AM IST

Weight Loss Drinks In Summer : బరువు తగ్గాలనుకునే వారు తక్కువ క్యాలరీలున్న ఆహారం తీసుకోవాలి. కాబట్టి.. సమ్మర్​లో వీలైనంతగా మజ్జిగ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఇందులో ప్రొటీన్‌ అధికంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది. అలాగే మజ్జిగలో పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెమట ద్వారా కోల్పోయిన ఖనిజాలను శరీరానికి అందిస్తాయని నిపుణులంటున్నారు. అంతేకాదు.. వాటర్ కంటెంట్ పొట్టలో ఎక్కువగా ఉన్నప్పుడు.. తిండి ఎక్కువగా తినే అవకాశం ఉండదు. ఈ విధంగా కూడా బరువు తగ్గే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు.

అధిక బరువుతో బీపీ వేధిస్తోందా? - వెయిట్ లాస్ సర్జరీతో చెక్ పెట్టొచ్చా?!

నిమ్మరసం :
వేసవి కాలంలో నిమ్మరసం తాగడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. ఇందులో ఉండే పెక్టిన్‌ అనే ఫైబర్‌.. కొవ్వును కరిగిస్తుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా నిమ్మరసంలో ఉండే ఎలక్ట్రోలైట్లు బాడీని డీహైడ్రేట్‌ కాకుండా చూస్తాయని అంటున్నారు.

జీలకర్ర వాటర్‌ :
బరువు తగ్గాలనుకునే వారు రాత్రి ఒక గ్లాసులో టేబుల్ స్పూన్‌ జీలకర్ర వేసుకుని.. ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. జీలకర్రలో ఉండే కెటోన్స్‌ అనే సమ్మేళనాలు కొవ్వును కరిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ డ్రింక్ వల్ల ఆహారం కూడా సులభంగా జీర్ణమవుతుందట. ఇంకా జీలకర్ర నీళ్లు శరీరాన్ని హైడ్రేట్‌గా ఉండేలా చేస్తాయని అంటున్నారు.

దోసకాయ నీరు : దోసకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహర పదార్థం. వేసవి కాలంలో వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారు డైలీ దోసకాయ వాటర్‌ తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో ఉండే పోషకాలు శరీరాన్ని హ్రైడ్రేట్‌గా ఉండేలా చేస్తాయని అంటున్నారు.

కొబ్బరి నీళ్లు : సమ్మర్‌లో చాలా మంది వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నీళ్లు తాగుతారు. అయితే.. రోజూ వీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. 2018లో "Journal of the American College of Nutrition" అనే జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. 12 వారాల పాటు రోజుకు 2 కప్పుల కొబ్బరి నీళ్లు తాగిన వారు, కేవలం నీరు తాగిన వ్యక్తుల కంటే ఎక్కువ బరువు తగ్గినట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో దిల్లీ ఎయిమ్స్​కు చెందిన డాక్టర్ కుమార్, రాజేష్ పాల్గొన్నారు. కొబ్బరి నీళ్ల వల్ల కొవ్వు కరిగిపోతుందని వీరు చెప్పారు.

బార్లీ వాటర్‌ :
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి బార్లీ వాటర్‌ ఒక మంచి డ్రింక్ గా నిపుణులు చెబుతున్నారు. రోజూ ఈ బార్లీ నీళ్లను తాగడం వల్ల ఆకలి ఎక్కువగా కాకుండా ఉంటుంది. అలాగే జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా ఒక కప్పు బార్లీ గింజలకు నాలుగు కప్పుల వాటర్‌ వేసి ఒక 30 నిమిషాలు ఉడికించాలి. బార్లీ వాటర్ చల్లారిన తర్వాత నిమ్మరసం వేసుకుని తాగాలని సూచిస్తున్నారు. రోజూ ఈ నీళ్లను తాగడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయట.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఈజీగా బరువు తగ్గాలా? ఉదయం పూట ఈ టిప్స్​ పాటిస్తే అంతా సెట్​!

బ్రేక్​ఫాస్ట్​లో ఇవి తింటే - వారం రోజుల్లో రెండు కేజీల బరువు తగ్గడం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.