ETV Bharat / health

సన్నగా ఉన్నామని ఫీలైపోతున్నారా? - ఆయుర్వేద నిపుణులు ఈ పథ్యాహారం సూచిస్తున్నారు! - Ayurveda Tips for Weight Gain

Ayurveda Tips for Weight Gain : చాలా మంది బరువు పెరుగుతున్నామని బాధపడుతుంటే.. కొందరు మాత్రం తాము బరువు పెరగట్లేదని దిగులు చెందుతుంటారు. మీరు కూడా ఈ లిస్టులో ఉన్నారా? అయితే.. ఆయుర్వేద పథ్యాహారం తీసుకుంటే సింపుల్​గా బరువు పెరగొచ్చని అంటున్నారు నిపుణులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Weight Gain Diet
Weight Gain Diet (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 7, 2024, 2:08 PM IST

Updated : Sep 14, 2024, 11:10 AM IST

Ayurveda Tips for Weight Gain : ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గించుకునేందుకు ఉదయాన్నే కాళ్లకు బూట్లు తగిలించుకునే వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే.. తాము మరీ సన్నగా ఉన్నామనీ, బరువు పెరగాలని కోరుకునేవారు కూడా ఉన్నారు. వయసుకు తగ్గ బరువు ఉండడం చాలా అవసరం. ఈ విషయాన్ని డాక్టర్లు గుర్తు చేస్తూనే ఉంటారు. కానీ వివిధ కారణాల వల్ల చాలా మంది సరైన బరువు ఉండరు.

అయితే.. ఎలాగైనా బరువు పెరగాలనే ఉద్దేశ్యంతో అధిక కొవ్వు పదార్థాలున్న ఆహారం తింటే.. మరో విధమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి.. లేనిపోని సమస్యలు తెచ్చుకోకుండా అవసరమున్నంత మేరకే బరువు పెరగాలంటే ఆయుర్వేద పథ్యాహారం చాలా మంచిదని చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్​ గాయత్రీ దేవీ. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

బరువు పెరిగేందుకు పథ్యాహారం:

కావాల్సిన పదార్థాలు:

  • విధారి చూర్ణం - 1 కప్పు
  • గోధుమ పిండి 1 కప్పు
  • బార్లీ పిండి - 1 కప్పు
  • పాలు - 1 కప్పు
  • చక్కెర - 3 కప్పులు
  • నెయ్యి - రెండు టేబుల్​ స్పూన్లు

మీ పిల్లలు బరువు పెరగట్లేదా? - ఈ ఫుడ్స్ తినకపోవడమే కారణం!

తయారీ విధానం:

  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి పాలు పోసుకోవాలి.
  • ఆ తర్వాత పాలల్లో పంచదార వేసి కరిగించుకోవాలి..
  • ఈ లోపు మరో గిన్నె తీసుకుని అందులోకి గోధుమ పిండి, బార్లీ పిండి, విధారి చూర్ణం వేసుకుని కలుపుకోవాలి.
  • పంచదార కరిగిన తర్వాత అందులోకి నెయ్యి వేసుకుని కలుపుకోవాలి.
  • ఆ తర్వాత గోధుమపిండి, బార్లీ పిండి, విధారి చూర్ణం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత పాన్​కు అంటుకోకుండా సపరేట్​ అయినప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసి వేరే ప్లేట్​ తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • అంతే ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు పథ్యాహారం రెడీ.

ఎలా తీసుకోవాలంటే: ఈ పథ్యాహారాన్ని రోజులో ఒకసారి.. కమలాపండు పరిమాణంలో తీసుకోవాలని చెబుతున్నారు.

ప్రయోజనాలు:

పాలు: పాలల్లో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. పాలు ఉపయోగించడం వల్ల శరీరంలో రక్తం శాతం పెరుగుతుందని.. ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుందని డాక్టర్​ గాయత్రీ దేవీ అంటున్నారు.

బార్లీ పిండి: ఇది కూడా ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

విధారి చూర్ణం: ఆయుర్వేద మూలిక విధారి.. ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

రోజూ అరటిపండు తింటే బరువు పెరుగుతారా? తగ్గుతారా?

Health Benefits Of Honey : 'తేనె'తో ఎన్నో లాభాలు.. చిన్న పిల్లలు, షుగర్ ఉన్నవాళ్లు తీసుకోవచ్చా?

Last Updated : Sep 14, 2024, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.