ETV Bharat / health

మాట్లాడుతూ వాకింగ్ చేస్తున్నారా? ఎన్ని నష్టాలో తెలుసా? ఇలా చేస్తే మంచిది​! - Walking Mistakes To Avoid

Walking Mistakes To Avoid : ఉదయం పూట లేదంటే సాయంత్రం పూట స్నేహితులతో కలిసి అలా వాకింగ్​కు వెళ్లి వస్తుంటారు. ఆరోగ్యంగా ఉండటానికి, బరువు తగ్గడానికి చాలామంది వాకింగ్​ చేస్తూ ఉంటారు. అయితే ఇలా వాకింగ్​కు వెళ్లినప్పుడు చేసే కొన్ని తప్పులు మీకు లాభం కలిగించకపోగా, నష్టం కలిగిస్తాయని అంటున్నారు నిపుణులు. వాకింగ్​ చేసేటప్పుడు చెయ్యకూడని తప్పులు ఏంటో? ఏం చేస్తే మంచిదో ఇక్కడ తెలుసుకుందాం.

Dos And Donts In Walking
Dos And Donts In Walking
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 25, 2024, 10:01 AM IST

Walking Mistakes To Avoid : ఫిట్​గా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, బరువు తగ్గడానికి- ఇలా రకరకాల కారణాలతో చాలామంది వాకింగ్​ చేస్తుంటారు. వాకింగ్​ చెయ్యడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలుసు. అయితే వాకింగ్​ చేసేటప్పుడు చేసే కొన్ని తప్పుల వల్ల ఫలితాలు తారుమారు అవుతాయని అంటున్నారు నిపుణులు. అందుకే ఎలా వాకింగ్​ చెయ్యాలని, ఎలా వాకింగ్​ చెయ్యకూడదని చెబుతున్నారు ఇక్కడ తెలుసుకోండి.

మాట్లాడుతూ వాకింగ్​ చెయ్యకూడదు
చాలామంది వాకింగ్​ చేసేటప్పుడు స్నేహితులతోనో, ఇతరులతోనో అలా మాట్లాడుకుంటూ వాకింగ్​ చేస్తుంటారు. నిజానికి ఇలా మాట్లాడుతూ వాకింగ్​ చెయ్యడం వల్ల నష్టం కలుగుతుందని అంటున్నారు ప్రముఖ యోగ థెరపిస్ట్​ అంకత. మాట్లాడుతూ నడవడం అలవాటు అయితే వాకింగ్​ చెయ్యడం తక్కువ, మాట్లాడటం ఎక్కువ అవుతుందని అంటున్నారు. దీంతో వాకింగ్​ వల్ల కలిగే ప్రయోజనాలు కలగవని అంటున్నారు.

వీకెండ్‎లో ఎక్కువ వాకింగ్​ చెయ్యొద్దు
వీకెండ్​ సెలవు రోజున చాలామంది వాకింగ్​ కాస్త ఎక్కువ సేపు చేస్తుంటారు. అంటే ఎక్కువ దూరం వాకింగ్​ చేస్తుంటారు. అయితే వీకెండ్‎లో వాకింగ్​ ఎక్కువ చేయడం వల్ల శరీరం ఎక్కువ అలసిపోతుందని, దానికి తగినట్లు విశ్రాంతి ఇవ్వకపోతే శరీరానికి నష్టం తప్పదని నిపుణులు అంటున్నారు. అందుకే వీకెండ్‎లో ఎక్కువ వాకింగ్​ చేయకపోవడం ఉత్తమం అని సూచిస్తున్నారు.

ఒకే స్పీడు వద్దు
వాకింగ్​ అంటే చాలామంది ఒకటే స్పీడ్​ను మెయింటెయిన్‌​ చెయ్యాలని అనుకుంటూ ఉంటారు. నిజానికి ఇది శరీరానికి మంచిది కాదు. వాకింగ్‎లో మూడు నిమిషాలు స్పీడ్‎గా చేస్తే, మూడు నిమిషాలు నెమ్మదిగా చేయాలని అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల శరీరంలో మెటబాలిక్​ యాక్టివిటీ ఎక్కువ అవుతుందని వివరిస్తున్నారు.

కాళ్లు మాత్రమే కాదు, చేతులకూ పని చెప్పండి
చాలామంది వాకింగ్​ అనేది కాళ్లు చేసే పని అని అనుకుంటూ ఉంటారు. వాకింగ్​ అనేది కాళ్లతో పాటు చేతులకు సంబంధించిన పని. వాకింగ్​ చేస్తున్నప్పుడు చేతులను కిందకు వదలకుండా, చేతులను రిథమిక్​గా కదపాలి. ఇలా చేస్తే గుండెకు రక్తం సరఫరా ఎక్కువగా అవుతుంది. అలాగే చేతులను 90డిగ్రీలకు వంచి వాకింగ్​ చెయ్యాలి. ఇలా చేస్తే ఎక్కువ క్యాలరీలు ఖర్చు అవుతాయి.

పొట్ట తగ్గడానికి ఇలా చేయండి
చాలామంది ఎన్నిరోజులుగా వాకింగ్​ చేస్తున్నా పొట్ట మాత్రం తగ్గడం లేదని ఫిర్యాదు చేస్తుంటారు. అలాంటి వారు పొట్ట కండరాలను కాస్త లోపలికి లాగి వాకింగ్​ చేయడం వల్ల లాభం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పొట్ట కండరాలను మరీ గట్టిగా లాగకూడదని సలహా ఇస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డైలీ వాకింగ్​ చేస్తున్నారా? ఈ టైమ్​లో చేస్తే ఎక్కువ బెనిఫిట్స్​!

ఎప్పుడైనా ఇలా నడిచారా? ఓసారి ట్రై చేయండి, సూపర్​ బెనిఫిట్స్​ పక్కా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.