Vitamin b12 Deficiency Problems : పోషకాహారం అంటే పిండి పదార్థాలు, కొవ్వులను సమపాళ్లలో తీసుకోవడమే అని చాలా మంది అనుకుంటారు. కానీ, వీటితో పాటు విటమిన్లు, ఖనిజ లవణాల వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. సూక్ష్మ పోషక పదార్థాలు సరిగ్గా అందకపోతే బి12 వంటి విటమిన్ లోపాలు వస్తాయని అంటున్నారు. ఇవాళ మనలో చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కానీ.. ఎక్కువ మంది దీనిని గుర్తించలేకపోతున్నారు. అయితే.. బి12 విటమని లోపం దీర్ఘకాలం కొనసాగితే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో..
మన శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో విటమిన్ B12 కీలక పాత్ర పోషిస్తుంది. దీనిని 'కోబాలమిన్' అని కూడా పిలుస్తారు. ఇది కేంద్రనాడీ వ్యవస్థ మెరుగ్గా పని చేయడంలో సహాయపడుతుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా ఇది శరీరంలో చేరుతుంది. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఈ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో సహాయం చేసే.. ఈ విటమిన్ ఎక్కువగా మంసాహారంలో లభిస్తుంది. విటమిన్ బి12 లోపంతో బాధపడే వారిలో శాకాహరాలు ఎక్కువగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
అలర్ట్ : అతి చలిగా అనిపిస్తోందా? - ఈ సమస్యే కావొచ్చట!
విటమిన్ బి12 లోపం వల్ల కలిగే ఇబ్బందులు..
- అరికాళ్లలో మంట
- కాళ్లు, చేతులు తిమ్మిర్లు రావడం
- నోటి పూత
- అలసట
- రక్తంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం
- రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోయి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
- ఆకలి తగ్గడం
- వికారంగా ఉండటం
- వాంతులు కావడం
- మైకము కమ్మినట్లు అనిపించడం
- జీర్ణ సంబంధిత సమస్యలు వెంటాడటం
- చిగుళ్లు, నాలుక వాపు రావడం. దీనివల్ల నిరంతరంగా నొప్పి ఉంటుంది.
- ఎర్ర రక్తకణాల ఉత్పత్తి సరిగ్గా లేకపోతే రక్తహీనత సమస్య వస్తుంది.
- ఈ విటమిన్ లోపించినవారిలో కళ్లు, శారీరం కొంచెం పసుపు రంగులో ఉంటాయి.
- కామెర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ B12 ఉండే ఆహార పదార్థాలు..
- మాంసం
- చేపలు
- చికెన్
- పాలు
- గుడ్లు
శాకాహారుల కోసం..
- మాంసాహారంలోనే బి12 ఎక్కువగా ఉందని శాఖాహారాలు బాధపడాల్సిన పనిలేదు. వారికి కూడా ఈ విటమిన్ పుష్కలంగా పొందే అవకాశం ఉంది.
- పాలకూరలో విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ లోపంతో బాధపడేవారు దీన్ని తరచూ ఆహారంలో తీసుకోవాలి.
- ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు తరచూ పాలకూర తీసుకుంటే రక్తహీనత తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
- బీట్‌రూట్‌లో ఐరన్, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి12 వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు శరీరానికి బలాన్నిస్తుందట.
- శాకాహారులు విటమిన్ బి12 లోపాన్ని అధిగమించడానికి రోజూ రెండు కప్పుల పాలను తాగాలి. దీనివల్ల ప్రొటీన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటివి కూడా అందుతాయి.
- చీజ్, పెరుగులో కూడా ప్రొటీన్, విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
పురుషుల్లో మొటిమల సమస్య - ఇలా చెక్ పెట్టండి!
బరువు తగ్గడానికి వాకింగ్ చేస్తున్నారా? ఇలా చేస్తే మీ శ్రమ అంతా వృథా!