ETV Bharat / health

వెరికోస్ వీన్స్ : ఈ జాబ్స్ చేసే వారిలో ఎక్కువగా వస్తాయి! - మరి, మీరూ ఈ లిస్టులో ఉన్నారా? - Varicose Veins Causes

These Professions To Cause Varicose Veins : చాలా మందిలో శరీరంలో కొన్ని చోట్ల నరాలు ఉబ్బినట్లు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా కాళ్లలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సిరలు ఉబ్బడం వల్లనే ఇలా కనిపిస్తాయి. ఈ ఉబ్బిన సిరలనే "వెరికోస్ వీన్స్" అంటారు. అయితే.. ఈ సమస్య కొన్ని రకాల జాబ్స్ చేసే వారికి ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు!

VARICOSE VEINS CAUSES
Varicose Veins (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 25, 2024, 10:35 AM IST

These Professions Most Likely To Cause Varicose Veins : సాధారణంగా వయసు పైబడే కొద్దీ సిరల ఆరోగ్యం నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంది. అందుకే వృద్ధుల్లో వెరికోస్ వీన్స్ సమస్య ఎక్కువగా కనిపించడాన్ని మీరు గమనించవచ్చు. అయితే, వృద్ధాప్యంలో మాత్రమే కాదు.. వయసుతో సంబంధం లేకుండా ఎవరిలోనైనా ఈ వెరికోస్ వీన్స్(Veins) ప్రాబ్లమ్ తలెత్తొచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కొన్ని రకాల వృత్తులు, పనులు, జాబ్స్ చేసే వారిలో ఈ సమస్య తలెత్తే అవకాశం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఇంతకీ, వెరికోస్ వీన్స్ ఎవరికి వచ్చే రిస్క్ ఎక్కువ? ఇవి ఎందుకు ఏర్పడతాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నర్సులు, కటింగ్ షాప్స్​లో పనిచేసే వారు, ఉపాధ్యాయులు, ట్రాఫిక్ కానిస్టేబుళ్లు, సెక్యూరిటీ గార్డులు.. ఇలా ఎక్కువ సమయం నిలబడి పనిచేస్తుండే వారిలో వెరికోస్ వీన్స్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే.. ఎక్కువసేపు నిలబడడం వల్ల కాళ్లలో రక్తం నిలిచిపోతుంది. ఫలితంగా రక్తనాళాలు ఉబ్బి, మెలికలు తిరుగుతాయని చెబుతున్నారు. అయితే, ఈ వెరికోస్ వీన్స్ సాధారణంగా కాళ్లలోని సిరలను ఎక్కువగా ప్రభావితం చేస్తాయంటున్నారు. ఎందుకంటే.. నిలబడి నడవడం వల్ల ఈ సిరల్లో ఒత్తిడి పెరుగుతుందంటున్నారు.

2018లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ నర్సింగ్'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. నర్సులు, ఇతర ఆరోగ్య సంరక్షణ నిపుణులు వారి పనిలో ఎక్కువ సమయం నిలబడి ఉండటం వలన వెరికోస్ వీన్స్ వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువ అని కనుగొన్నారు.

అంతేకాదు.. సిరల ఉబ్బు మహిళల్లో కూడా ఎక్కువగా కనబడుతుందంటున్నారు హైదరాబాద్​లో కేర్ హాస్పిటల్స్​కు చెందిన వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ పి.సి.గుప్తా. ముఖ్యంగా.. గర్భిణుల్లో హార్మోన్లలో మార్పుల మూలంగా సిరల కవాటాలు వదులై రక్తం కిందికి జారిపోతూ నాళాల ఉబ్బుకు దారితీయొచ్చని చెబుతున్నారు. కొందరిలో జన్యుపరంగా.. వంశపారంపర్యంగానూ ఈ సమస్య కనబడుతుంటుంది. వయసు మీద పడటంతోనూ దీని ముప్పు పెరగొచ్చంటున్నారు. అదేవిధంగా.. డీప్‌ వీన్‌ థ్రాంబోసిస్‌, ఆర్టిరియో వీనస్‌ మాల్‌ఫార్మేషన్స్‌, ఏవీ ఫిస్టులా వంటి ఇతరత్రా సమస్యలు కూడా సిరల ఉబ్బుకు దారితీయొచ్చంటున్నారు.

హై బీపీతో బాధపడుతున్నారా? ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండి!

అయితే, కొన్నిసార్లు ఈ అనారోగ్య సిరలు మరింత తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి రక్తం గడ్డకట్టే అవకాశాలను కూడా పెంచుతుందంటున్నారు. అంతేకాదు.. ఇది కొన్నిసార్లు ప్రమాదకరంగా మారొచ్చంటున్నారు. కాబట్టి, శరీరంలో ఎక్కడైనా రక్తనాళాల ఉబ్బు(వెరికోస్ వీన్స్)ను గమనించినట్లయితే వెంటనే సంబంధిత వైద్యుడిని సంప్రదించి తగిన ట్రీట్​మెంట్ తీసుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే?

  • అనారోగ్య సిరలు అభివృద్ధి చెందకుండా ఉండటానికి ప్రధాన మార్గాలలో ఒకటి.. రక్తం ప్రవహించేలా ప్రతి 30 నిమిషాలకు విరామం తీసుకోవాలి.
  • ముఖ్యంగా ఎక్కువసేపు కూచొనే ఉద్యోగాలు చేసేవారు గంటకోసారైనా లేచి నాలుగడుగులు వేస్తుండాలి.
  • హైహీల్స్, బిగుతుగా ఉండే లోదుస్తులకు దూరంగా ఉండాలి.
  • కూర్చోవడం లేదా నిలబడి ఉండే పొజిషన్​ను క్రమం తప్పకుండా మార్చుతుండాలి. పీచు, ఉప్పు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.
  • రోజూ తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. అంటే.. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
  • నడక, పరుగు, సైకిల్‌ తొక్కటం, ఈత వంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయంటున్నారు డాక్టర్ గుప్తా.
  • ముఖ్యంగా బరువును అదుపులో ఉంచుకునేలా చూసుకోవాలి.
  • కూచున్నప్పుడు కాళ్లు కాస్త ఎత్తు మీద పెట్టుకోవటం, పడుకునేప్పుడు కాళ్ల కింద ఎత్తు పెంచుకోవటం కూడా మేలు చేస్తుందంటున్నారు.
  • ఇలాంటి జాగ్రత్తలతో వెరికోస్ వీన్స్​ సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ పి.సి.గుప్తా సూచిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఐదు పనులు చేస్తే అంతా సెట్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.