Usage Tips For Menstrual Pads : పీరియడ్స్ మహిళలను ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఇక సమ్మర్లో అయితే.. ఉక్కపోత కారణంగా ప్రాబ్లమ్స్ మరింత పెరుగుతుంటాయి. ముఖ్యంగా.. జననేంద్రియాల వద్ద మంట, ఇతర ఇన్ఫెక్షన్స్ వంటివి ఇబ్బందిపెడుతుంటాయి. అయితే.. ఇందుకు చెమట ఒక్కటే కారణం కాదు.. నెలసరి టైమ్(Periods)లో వాడే శ్యానిటరీ ప్యాడ్స్ కూడా ఓ కారణమంటున్నారు నిపుణులు. జాగ్రత్తగా లేకపోతే వెజైనల్ ఇన్ఫెక్షన్లకు, ఇతర తీవ్ర అనారోగ్యాలకు దారితీయొచ్చని హెచ్చరిస్తున్నారు. అలా జరగకూడదంటే శ్యానిటరీ ప్యాడ్స్ వాడే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అలాంటి ప్యాడ్స్‌కు దూరంగా ఉండాలి : ఈ రోజుల్లో దాదాపుగా అందరూ మార్కెట్లో లభించే ప్యాడ్స్ వాడుతున్నారు. రక్తస్రావం వల్ల వెలువడే దుర్వాసన బయటకు రాకుండా ఉంటుందని సువాసన వెదజల్లే శ్యానిటరీ ప్యాడ్స్, ట్యాంపన్స్ యూజ్ చేస్తుంటారు. అయితే.. ఇలాంటివి ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. వీటి తయారీలో రసాయనాల వాడకం ఎక్కువ ఉంటుందని, పైగా క్వాలిటీ కూడా అంతంతమాత్రమే ఉంటుందని అంటున్నారు. ఫలితంగా.. ఈ ప్యాడ్స్ వాడడం వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు. కాబట్టి.. వీటికి బదులుగా మంచి నాణ్యతతో కూడా పర్యావరణహిత ప్యాడ్స్‌ని ఎంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
ఒకే ప్యాడ్ ఎక్కువసేపు వాడకూడదు : కొంతమంది బ్లీడింగ్ తక్కువగా ఉందనో, బద్ధకించో, ప్యాడ్ నిండలేదనో.. ఇలా పలు కారణాల వల్ల ఒకే ప్యాడ్‌ను గంటల తరబడి యూజ్ చేస్తుంటారు. ఇది కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్లకు మరో కారణంగా చెప్పుకోచ్చంటున్నారు నిపుణులు. అందుకే రక్తస్రావంతో పనిలేకుండా కనీసం నాలుగైదు గంటలకోసారి ప్యాడ్‌ని మార్చుకోవడం బెటర్ అంటున్నారు. అలాకాకుండా.. డే అంతా ఒకే ప్యాడ్ వాడితే మాత్రం ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర దుష్ప్రభావాలూ ఎదుర్కోక తప్పదంటున్నారు నిపుణులు.
2019లో 'అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. 4 నుంచి 8 గంటల కంటే ఎక్కువసేపు ప్యాడ్‌లను వాడే మహిళలకు వైజెనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం 2 రెట్లు ఎక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాకు చెందిన ప్రముఖ ప్రసూతి వైద్య నిపుణుడు డాక్టర్ జాన్ స్మిత్ పాల్గొన్నారు. ఎక్కువసేపు ఒకే ప్యాడ్ ఉపయోగించడం వల్ల వైజెనల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉందని ఆయన పేర్కొన్నారు.
వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం : వెజైనల్ ఇన్ఫెక్షన్స్ తలెత్తకుండా ఉండాలంటే పీరియడ్స్ టైమ్‌లో వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ప్యాడ్ మార్చుకున్న ప్రతిసారీ జననేంద్రియాలను శుభ్రం చేసుకోవడం మంచిదంటున్నారు. అలా చేయడం ద్వారా.. అక్కడి బ్యాక్టీరియా ఎప్పటికప్పుడు తొలగిపోయి ఇన్ఫెక్షన్లకు దారితీయకుండా జాగ్రత్తపడొచ్చని సూచిస్తున్నారు. ఆ తర్వాత చేతుల్నీ శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దంటున్నారు.
పీరియడ్స్ నొప్పి భరించలేకున్నారా? ఈ ఫుడ్స్‌తో రిలీఫ్ పొందండి!
డాక్టర్‌ని ఎప్పుడు సంప్రదించాలంటే..?
- సాధారణంగా దురద, మంట, వైట్ డిశ్చార్జి.. వంటివి అప్పుడప్పుడూ కామన్. కానీ, అలాకాకుండా తరచూ ఈ సమస్యలొస్తున్నాయంటే మాత్రం అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు.
- ముఖ్యంగా.. దుర్వాసనతో కూడిన డిశ్చార్జి, పసుపు-ఆకుపచ్చ వంటి రంగుల్లో డిశ్చార్జి కావడం.. వంటివి సీరియస్‌గా తీసుకోవాలంటున్నారు.
- అలాగే, పీరియడ్స్ అప్పుడు శుభ్రత పాటించినా వెజైనా దగ్గర మంట, దురద.. వంటివి పదే పదే వేధిస్తున్నా.. వెజైనల్ ఇన్ఫెక్షన్‌గా భావించి డాక్టర్‌ని సంప్రదించడం మంచిది అంటున్నారు.
ఇవి గుర్తుంచుకోవాలి :
- ప్రస్తుతం మార్కెట్లో పీరియడ్స్ టైమ్స్ ఉపయోగించేందుకు వీలుగా ఉండే ప్రత్యేకమైన ‘పిరియడ్ ప్యాంటీస్’ లభిస్తున్నాయి. వాటిని ఈ సమయంలో ఉపయోగించచ్చు.
- మిగతా రోజుల్లో నార్మల్ లోదుస్తులు ఉపయోగించడం వల్ల మంచి వ్యక్తిగత పరిశుభ్రత కొనసాగించవచ్చంటున్నారు నిపుణులు.
- అదేవిధంగా.. మెన్‌స్ట్రువల్ కప్స్ వల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. అయితే, వాటిని సరైన విధానంలో ఉపయోగించడం, నిర్ణీత వ్యవధుల్లో శుభ్రం చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పీరియడ్స్ నొప్పుల కోసం మందులా? - వద్దే వద్దు - ఇలా చేస్తే ఫుల్ రిలీఫ్!