ETV Bharat / health

చికెన్ అంటే చాలా ఇష్టమా? ఆరోగ్యంగా ఉండాలంటే ఆ ఒక్క పార్ట్​ అస్సలు తినకండి!! - Which Chicken Part Is Not To Eat - WHICH CHICKEN PART IS NOT TO EAT

Unhealthy Part Of Chicken : చికెన్ అంటే చాలా ఇష్టమా? సండే మండేలతో పనిలేకుండా ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ తెచ్చుకుని తింటారా? లిమిట్​లో తింటే ఇది ఆరోగ్యానికి మంచిదే. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే చికెన్​లో ఓ భాగాన్ని అస్సలు తినొద్దట! అదేంటంటే?

Unhealthy Part Of Chicken
Unhealthy Part Of Chicken (Source : Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 26, 2024, 6:43 AM IST

Unhealthy Part Of Chicken : టేస్టీగా, యమ్మీగా ఉండి హెల్తీ ఫుడ్ అని చాలా మంది భావించే ఆహార పదార్థాల్లో చికెన్ టాప్​లో ఉంటుంది. చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకూ చికెన్​ను చాలా చాలా ఇష్టపడుతుంటారు. చికెన్ ఆరోగ్యకరమైన మాంసమే అయినప్పటికీ దీంట్లోని ఓ భాగం శరీరానికి హాని కలిగిస్తుందట. అది కూరకు రుచిని అందించినప్పటికీ ఆరోగ్యం విషయంలో కొన్ని ప్రతికూల ఫలితాలను అందిస్తుందట. అవును మీరు అనుకుంటుంది నిజమే మేం చెబుతున్నది చికెస్ స్కిన్ గురించే.

ఇంతకీ చికెన్ స్కిన్​లో ఏముంటుంది?
కోడి చర్మంలో హానికరమైన కొవ్వులు టన్నుల కొద్దీ ఉంటాయి. అలాగే దీంట్లో పోషక విలువలేమీ ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే కోడి శరీరంలో అస్సలు ఉపయెగం లేని భాగం ఏదైనా ఉందా అంటే అది దాని చర్మం. ఇంకో విషయం ఏంటంటే కోడి చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించేందుకు ఫాం వాళ్లు లేదా దుకాణాదారులు కోడి తోలుపై కెమికల్స్ చల్లుతారు.

చికెన్ స్కిన్ తింటే ఏమవుతుంది?
చికెన్ స్కిన్ తినడం వల్ల శరీరంలో అనారోగ్యకరమైన కొవ్వులు పేరుకుపోయి బరువు పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే రక్తపోటు, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని చికెన్ స్కిన్ వినియోగం పెంచుతుంది. USDA చేసిన అధ్యయనం ప్రకారం, చర్మం తీసివేసి వండిన ఒక కప్పు చికెన్‌లో 231 కేలరీలు ఉంటాయి, అదే కప్పులో చర్మంతో కలిపి వండిన చికెన్​లో 276 కేలరీలు ఉంటాయి. అంటే చర్మం ప్రతి ఔన్స్‌లో, ప్రతి కప్పులో 3 గ్రాముల సంతృప్త కొవ్వును కలిగి ఉంటుంది.

అయితే చికెన్ స్కిన్ అస్సలు తినకూడదా!
వాస్తవానికి చికెస్ స్కిన్ అంటే కొందరికి చాలా ఇష్టం. ఇది కూర రుచిని రెట్టింపు చేస్తుందని, తప్పకుండా స్కిన్​తోనే వండుకుని తింటుంటారు. అలాంటి వారు అస్సలు బాధపడకండి. కోడి తోలు తినకూడదు అంటే పూర్తిగా మానేయాలని కాదు. ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి రెండు మూడు సార్లు కడిగి వండుకోవచ్చు. కానీ చికెన్ స్కిన్​ను ఎక్కువగా తినకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకుని తినండి. అతిగా తినడం వల్ల మీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం కష్టం అవుతుంది తర్వాత మీ ఇష్టం.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

పండ్ల తొక్కలను పాడేస్తున్నారా? సూపర్​ టీని మిస్​ అయినట్లే!- రుచితో పాటు పోషకాలెన్నో! - Fruit Peel Tea

"ఆరోగ్యానికి 10 వేల అడుగులు" - ఈ కాన్సెప్ట్​ నిజంగా మంచిదేనా? - రీసెర్చ్​లో ఆసక్తికర విషయాలు! - Walking 10k Steps Per Day Benefits

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.