ETV Bharat / health

సూపర్​ ఐడియా - కిచెన్​ గోడలపై నూనె మరకలా? - ఈ టిప్స్​ పాటిస్తే నిమిషాల్లో మాయం! - Tips to Remove Oil Stains on Walls - TIPS TO REMOVE OIL STAINS ON WALLS

Tips to Remove Oil Stains: వంట చేయడం కంటే కిచెన్​ గట్టు, వంటింటి గోడలను శుభ్రం చేసుకోవడం చాలా కష్టం. కారణం.. వీటిపై జిడ్డు పేరుకుపోయి ఒక పట్టాన వదలవు. అయితే ఈ టిప్స్​ పాటిస్తే ఈజీగా మరకలు తొలగించవచ్చని నిపుణులు అంటున్నారు.

Tips to Remove Oil Stains on Walls
Tips to Remove Oil Stains on Walls (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 8, 2024, 6:08 PM IST

Tips to Remove Oil Stains on Walls: వంట చేసే క్రమంలో గోడలపై మరకలు పడటం కామన్​. ముఖ్యంగా వేపుళ్లు, ఇతర కూరల పోపు వేసేటప్పుడు నూనె చిట్లి గోడలపై పడుతుంటుంది. ఇక ఈ మరకలు ఓ పట్టాన వదలవు. క్లీన్​ చేయడానికి కాస్తా శ్రమించాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు నిపుణులు. ఈ టిప్స్​ ద్వారా మరకలను ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు. అవేంటో మీరూ తెలుసుకోండి..

బేకింగ్​ సోడా: గోడపై ఉన్న నూనె మరకలను ఈజీగా తొలగించడానికి బేకింగ్ సోడా బెస్ట్ హోం రెమెడీ అని నిపుణులు అంటున్నారు. ఇందు కోసం ఒక స్పూన్​ బేకింగ్ సోడాను తీసుకుని కొద్దిగా నీరు కలిపి పేస్ట్​లా ప్రిపేర్​ చేసుకోవాలి. తర్వాత మరక ఉన్న ప్లేస్​ అప్లై చేసి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత శుభ్రమైన వస్త్రం నీటిలో ముంచి ఆ ప్రదేశంలో తుడిస్తే సరి. ఆరిన తర్వాత కొంచెం నూనె మరక కూడా ఉండదంటున్నారు.​

2020లో జర్నల్ ఆఫ్ క్లీనింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. గోడలపై వివిధ రకాల నూనె మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా ప్రభావవంతంగా ఉందని, గోడలకు ఎటువంటి నష్టం కలిగించదని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దిల్లీలోని భారతీయ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ లోని డా. అమృత మిశ్రా పాల్గొన్నారు.

మీ కిచెన్​లో పొగ ఎక్కువగా వస్తుందా? - ఈ టిప్స్ పాటించారంటే ఆ సమస్య ఉండదు - పైగా గ్యాస్ ఆదా!

లిక్విడ్‌ డిష్‌ వాషర్‌: గోడ నుంచి మొండి నూనె మరకలను వదలగొట్టడానికి లిక్విడ్​ డిష్​ వాషర్​ పర్ఫెక్ట్​ అని నిపుణులు అంటున్నారు. అందుకోసం లిక్విడ్‌ డిష్‌వాషర్‌ను గోడలపై బాటిల్‌తో స్ప్రే చేసి గంటపాటు వదిలేయాలి. ఆ తర్వాత వేడినీటితో కడిగి మెత్తని క్లాత్‌తో శుభ్రం చేస్తే సరి.. గోడలపై మరకలు కనిపించవంటున్నారు.

వెనిగర్​: వంటలో ఉపయోగించే వెనిగర్.. గోడలపై నూనె మరకలను తొలగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని.. కేవలం నిమిషాల్లో చెడు వాసన, గ్రీజు వంటి మొండి మరకలను వదలిస్తుందని అంటున్నారు. అందుకోసం వెనిగర్‌, నీళ్లు సమాన పరిమాణంలో తీసుకుని మిక్స్​ చేసుకోవాలి. దీనిలో స్పాంజ్‌/ వస్త్రం ముంచి ఆ మరకపై అప్లై చేసి.. 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత శుభ్రమైన తడి వస్త్రంతో తుడిస్తే సరి..

హెయిర్​ డ్రైయ్యర్​: నూనె మరకలు ఎక్కువగా ఉంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఏంటంటే.. గోడపై ఒక పేపరు ఉంచి దానిపై ఐరన్‌బాక్స్‌ లేదా హెయిర్‌ డ్రైయ్యర్‌ను ఉపయోగించి వేడి చేయాలి. ఇలా చేయడం వల్ల పేరుకుపోయిన నూనె మొత్తం బయటకు వచ్చేస్తుందని.. శుభ్రం చేయడం తేలికవుతుందని అంటున్నారు.

ఈ టిప్స్​ పాటిస్తే - స్టెయిన్​లెస్​ స్టీల్​ గృహోపకరణాలకు మెరుపు గ్యారంటీ!

మీ కిచెన్ సింక్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందా? - ఈ టిప్స్​ ట్రై చేస్తే స్మెల్​ పరార్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.