ETV Bharat / health

వాంతులు, మైకంతో బాధపడుతున్నారా- ఈ సింపుల్​ టిప్స్​తో సమస్యలకు చెక్! - Relieve From Vomiting And Vertigo

Tips To Relieve From Vomiting And Vertigo : వాంతులు, కళ్లు తిరగడం లేదా మైకం సమస్యతో బాధపడుతున్నారా? మరేం ఫర్వాలేదు. ఈ కింద తెలిపిన సింపుల్​ హెం టిప్స్​తో ఈ సమస్యలకు చెక్​ పెట్టండి.

Tips To Relieve From Vomiting And Vertigo

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 6:16 PM IST

Tips To Relieve From Vomiting And Vertigo : కళ్లు తిరగడం అనేది చాలా మందిని ఇబ్బంది పెట్టే అంశం. ఈ పరిస్థితి సాధారణం నుంచి తీవ్రమైన స్థాయి వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువసేపు నిలబడలేకపోవడం, మీ చుట్టుపక్కల వస్తువులు తిరుగుతున్నట్లు అనిపించటం జరుగుతుంది. అయితే రక్తపోటు, డిహైడ్రేషన్​ లేదా ఏవైనా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల ఇలా జరిగే అవకాశం ఉంది. మరోవైపు తల తిరిగినప్పుడు కూడా మైకం వస్తుంది. ఇది ఎక్కువగా స్పిన్నింగ్​ సెన్సేషన్​ ద్వారా, పరోక్సిస్మల్​ పొజిషనల్​ వెర్టిగో, వెస్టిబ్యులర్​ న్యూరిటిస్​ లేదా మెనియర్స్​ వంటి జబ్బుల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటన్నింటితో పాటు వాంతుల నుంచి కూడా ఉపశమనం పొందేందుకు ఈ కింది టిప్స్​ను అనుసరించండి.

మీ శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోండి
డీహైడ్రేషన్​ వల్ల కళ్లు తిరిగిన భావన కలుగుతుంది. దీనినే వైద్య పరిభాషలో వెర్టిగో అని కూడా అంటారు. అయితే దీనిని ప్రేరేపించే కారణాలలో శరీరాన్ని హైడ్రేటెడ్​గా ఉంచుకోకపోవడం కూడా ఒకటి. కొన్నిసార్లు ఈ సమస్య రక్తపోటుకు కూడా దారితీస్తుంది. అందుకే మీ బాడీని ఎప్పుడూ హైడ్రేటెడ్​గా ఉంచుకోండి. ఇందుకోసం నీళ్లు, ధ్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోండి.

ఆహారంలో అల్లం చేర్చుకోండి
అల్లంలో ఉండే ఔషధ గుణాలు తలనొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. కొందరు నేరుగా అల్లం తినలేరు కాబట్టి, అల్లం టీ చేసుకుని తాగడం లేదా అల్లంతో చేసిన ధ్రవపానీయాలను తీసుకోవడం లాంటివి చేయండి.

శ్వాసకు సంబంధించిన వ్యాయామాలను సాధన చేయండి
నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకోవడం ద్వారా మీరు ప్రశాంతమైన అనుభూతిని పొందుతారు. ఇది కళ్లు తిరిగే పరిస్థితులను తగ్గిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. కళ్లు తిరగకుండా ఉండేందుకు శ్వాస సంబంధిత వ్యాయామాలను మీ దినచర్యలో భాగం చేసుకోండి.

వాంతులు కలిగించే పరిస్థితులకు దూరంగా ఉండండి
వాంతులు రావడానికి కారణమయ్యే వాటిని గుర్తించి (ఉదాహరణకు కొన్ని ఆహారాలు, పనులు) వంటి వాటికి దూరంగా ఉండండి. వాటిని నివారించడం ద్వారా మీరు వాంతుల సమస్య బారిన పడకుండా ఉంటారు.

విటమిన్​ సప్లిమెంట్లను తీసుకోండి
కొన్నిసార్లు శరీరానికి సరిపడే విటమిన్లు అందకపోవడం వల్ల కూడా మైకం వస్తుంది. కాబట్టి మీ శరీరానికి అవసరమైన విటమిన్లను అందించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పోషకాల లోపం వల్ల కూడా మీరు ఇలాంటి సమస్యలకు గురవుతారు. అలాంటి సమయాల్లో ఐరన్​, విటమిన్​ బీ12 లేదా మెగ్నీషియం వంటి సప్లిమెంట్లను తీసుకోవడం ఉత్తమం.

హైడ్రోథెరపీ

ఒకరోజు వెచ్చని నీటితో మరో రోజు చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది. తద్వారా కళ్లు తిరిగే భావనను తగ్గించడానికి ఈ ప్రక్రియ సహాయపడుతుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ జట్టు తెల్లబడుతోందా? సమస్యకు ఈజీగా చెక్​ పెట్టండిలా!

విటమిన్​ 'డి' తక్కువైతే ఇన్ని సమస్యలా! సొల్యూషన్ ఏంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.