ETV Bharat / health

తొడల భాగంలో కొవ్వు పేరుకుపోయిందా ? ఈ టిప్స్​ పాటిస్తే కొన్ని రోజుల్లోనే పక్కా రిజల్ట్​! - Tips To Loose Thigh Fat - TIPS TO LOOSE THIGH FAT

Tips To Lose Thigh Fat : చాలా మందిలో శరీరం అంతా ఒక ఆకృతిలో ఉంటే.. థైస్ మాత్రం చాలా లావుగా కనిపిస్తాయి. ఇక బిగుతు దుస్తులు ధరించినప్పుడు ఈ సమస్య మరింత పెద్దదవుతుంది. నలుగురిలోకి వెళ్లాలంటే కూడా ఇబ్బంది పడతారు. అలాంటి వారు ఈ టిప్స్​ పాటిస్తే కొన్ని రోజుల్లోనే తొడలు నాజూగ్గా మారతాయని నిపుణులు అంటున్నారు.

Thigh Fat Losing Tips
Tips To Loose Thigh Fat (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 13, 2024, 2:58 PM IST

Tips To Lose Thigh Fat : అందరి శరీరాకృతులు ఒకేలా ఉండవు. కొందరు సన్నగా, నాజూగ్గా ఉంటే.. మరికొందరు లావుగా ఉంటారు. ఇంకొందరికైతే శరీరమంతా సన్నగా ఉంటుంది.. కానీ తొడలు మాత్రం కాస్త లావుగా ఉంటాయి. ఇక జీన్స్ లాంటి టైట్​ ఫిట్టింగ్​ దుస్తులు వేసుకోవడం వల్ల ఇవి మరింత లావుగా కనిపిస్తాయి. ఫలితంగా చాలా మంది అసౌకర్యానికి గురవుతుంటారు. నలుగురిలోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలా తోడలు లావుగా కనిపించడానికి కారణం కొవ్వులే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే తొడల భాగంలో పేరుకుపోయిన కొవ్వు కరగాలంటే ఈ చిట్కాలు పాటించాలంటున్నారు. ఇవి పాటిస్తే కొన్ని రోజుల్లే మార్పు గమనించవచ్చని అంటున్నారు. ఆ టిప్స్​ ఏంటంటే..

  • తొడలు లావుగా ఉన్న వారు రోజూ సైక్లింగ్‌ చేయడం వల్ల ఆ భాగంలో కొవ్వు కరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దగ్గరగా ఉండే ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే బైక్‌ను ఉపయోగించకుండా సైకిల్‌పై వెళ్లమని సలహా ఇస్తున్నారు.
  • మనం రోజూ తగినంత నీరు తాగకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. అయితే, దీనివల్ల జీవక్రియ మందగిస్తుంది. ఫలితంగా బాడీలో కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, డైలీ రెండు మూడు లీటర్ల నీళ్లు తాగాలని సూచిస్తున్నారు.
  • ఇళ్లు, ఆఫీసుల్లో పై అంతస్తులకు వెళ్లడానికి లిఫ్ట్‌ ఎక్కడానికి బదులు మెట్లు ఎక్కామని సలహా ఇస్తున్నారు. ఇలా మెట్లను ఎక్కడం వల్ల తొడల కండరాలపై ఒత్తిడి పడి కొవ్వు కరుగుతుందట.

రోజుకొకటి తప్పనిసరి- పండ్లు తింటూ ఈజీగా బరువు తగ్గండిలా! - Weight Loss Tips

  • రోజూ పోషకాలు ఎక్కువగా ఉండి.. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. దీనివల్ల శరీర బరువు తగ్గడంతోపాటు.. తొడల భాగంలో ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
  • తొడ భాగంలో అధిక కొవ్వు కలిగిన వారు.. గోడ కుర్చీ వేసినట్లుగా కూర్చొని బరువులెత్తడం (స్క్వాట్స్) వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా డైలీ చేస్తే కొన్ని రోజుల్లోనే కొవ్వు కరిగిపోతుందని నిపుణులు పేర్కొన్నారు.
  • అలాగే రోజూ వాకింగ్‌, జాగింగ్‌ చేయడం వల్ల తొడల భాగంలో కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చంటున్నారు. అయితే, ఉదయాన్నే ఈ రకమైనటువంటి వ్యాయామాలు చేయడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.
  • తొడల భాగంలోని ఫ్యాట్‌ను కరిగించుకోవడానికి ఉపకరించే పరికరం.. లెగ్ ఎక్స్‌టెన్షన్ మెషీన్. ఈ మెషీన్‌పైన కూర్చుని కాళ్లను నెమ్మదిగా ముందుకు చాపుతూ తిరిగి వెనక్కి తీసుకోవాలి. ఇలా డైలీ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. త్వరగా కొవ్వు తగ్గాలని వేగంగా చేస్తే తొడల భాగంలో ఉండే కండరాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. కాబట్టి నెమ్మదిగా, జాగ్రత్తగా ఈ వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • వీలైతే రోజూ ఫ్రెండ్స్‌తో కలిసి కాసేపు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ వంటి ఆటలు ఆడితే కూడా తొడల భాగంలో కొవ్వు కరుగుతుందంటున్నారు.
  • స్విమ్మింగ్‌ చేయడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించుకోవచ్చు. అలాగే రోజూ ఈత కొట్టడం వల్ల తొడల భాగంలో కొవ్వు కరుగుతుంది. 2001లో 'జర్నల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్' రీసెర్చ్ ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. 12 వారాల పాటు వారానికి మూడు సార్లు ఈత కొట్టడం వల్ల తొడల భాగంలో కొవ్వు కరిగిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని టెక్సాస్ A&M విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసే 'డాక్టర్ జాకిసిక్' పాల్గొన్నారు. అధిక బరువున్న మహిళలు ఈత కొట్టడం వల్ల తొడల భాగంలో ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

వెన్నునొప్పి ఇబ్బంది పెడుతోందా? ఇంట్లోనే చేసుకునే ఈ 5 ఎక్సర్‌సైజ్‌లతో బిగ్​ రిలీఫ్! - Exercises For Back And Spinal Cord

మీరు ఈ పొజిషన్​లోనే పడుకుంటున్నారా? లేకపోతే బోలెడు లాభాలు మిస్​ అయినట్లే! - Which Position is Good for Sleep

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.