Tips To Girls Shave Their Face : అందంగా కనిపించడానికి అమ్మాయిలు ఎన్నో రకాల క్రీమ్స్, కాస్మెటిక్ ఉత్పత్తులను డైలీ ట్రై చేస్తుంటారు. అలాగే బ్యూటీ పార్లర్స్‌కు కూడా వెళ్తుంటారు. అయితే.. కొంత మంది ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఇంట్లోనే షేవ్ చేస్తుంటారు. అయితే.. షేవింగ్ చేసే క్రమంలో మనం తెలియక చేసే పొరపాట్ల వల్ల.. వెంట్రుకలు మరింత చిక్కగా వస్తుంటాయి. కాబట్టి, షేవింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
డ్రై షేవ్ చేయకూడదు!
ముఖం మీద షేవింగ్ చేసేటప్పుడు స్కిన్ పొడిబారకుండా చూసుకోవాలి. ఫేస్‌వాష్ చేసుకున్న తర్వాత.. అలోవెరా జెల్‌ను అప్లై చేసిన తర్వాత మంచి ఫేషియల్ రేజర్‌తో సున్నితంగా షేవ్ చేయాలని చెబుతున్నారు.
పింపుల్స్ సమస్యతో బాధపడే వారు :
కొంతమంది అమ్మాయిలు మొటిమలతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు ఫేషియల్ రేజర్ ఉపయోగించకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. వీటివల్ల పింపుల్స్ మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. చర్మం కూడా ఎర్రగా మారుతుందని అంటున్నారు. 1998లో "అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ జర్నల్" లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మొటిమలు ఉన్న వ్యక్తులు రేజర్‌తో షేవ్ చేసుకున్న తర్వాత, వారి చర్మం ఎర్రగా, వాపుగా, దురదగా మారినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీకి చెందిన డాక్టర్ ZD డ్రేలోస్ పాల్గొన్నారు. మొటిమలతో బాధపడేవారు రేజర్‌తో షేవ్ చేసుకోవడం వల్ల చర్మం ఎర్రగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
పెళ్లి తర్వాత మొటిమలు వస్తున్నాయా? - ఇలా ఈజీగా తగ్గించుకోండి!
వ్యతిరేక దిశలో వద్దు :
ఫేషియల్ రేజర్‌ని ఉపయోగిస్తున్నప్పుడు దాన్ని సున్నితంగా పట్టుకోవాలి. అలాగే ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో షేవ్ చేయకూడదు. ఎందుకంటే.. వ్యతిరేక దిశలో షేవ్ చేయడం వల్ల ముఖంపై గీతలు పడే అవకాశం ఉంది.
ముఖాన్ని టచ్ చేయకూడదు :
ఫేషియల్ రేజర్‌తో షేవ్ చేసుకున్న తర్వాత ముఖాన్ని చేతితో తాకకూడదు! ఫేస్‌పైన మాయిశ్చరైజర్ రాసి వదిలేయాలి. ముఖాన్ని తరచూ టచ్ చేయడం వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఉందని నిపుణులంటున్నారు.
మేకప్ వద్దు!
ఫేషియల్ రేజర్ ఉపయోగించిన తర్వాత కనీసం 6 నుంచి 8 గంటల పాటు.. ఎలాంటి మేకప్‌లను ట్రై చేయకూడదని.. ఆ తర్వాత సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
తలలో పేలు చిరాకు పెడుతున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే ఆ సమస్యే ఉండదు!
వానాకాలంలో దుస్తులు సరిగా ఆరక వాసన వస్తున్నాయా? - ఈ టిప్స్ పాటిస్తే ఫ్రెష్ అండ్ సువాసన పక్కా!