ETV Bharat / health

పెదవులు జీవం కోల్పోయాయా? - ఈ టిప్స్‌ పాటిస్తే సూపర్ లిప్స్ మీ సొంతం! - Tips for Natural Pink Lips

Tips To Brighten Lips : మీ పెదాలు జీవం కోల్పోయి రంగు మారాయా? రోజూ లిప్‌స్టిక్‌ ఉపయోగించి కవర్‌ చేస్తున్నారా? అయితే, ఈ కథనం మీ కోసమే! డైలీ కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల పెదాలు ఎర్రగా, మృదువుగా కళకళలాడుతాయని నిపుణులు చెబుతున్నారు.

Brighten Lips
Tips To Brighten Lips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 27, 2024, 1:19 PM IST

Tips To Brighten Lips : పెదాలు ఎర్రగా అందంగా కనిపిస్తేనే.. ముఖం మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. గులాబీ రేకుల్లాంటి పెదాలు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే.. వివిధ కారణాల వల్ల చాలా మంది అమ్మాయిల పెదవులు పాలిపోతుంటాయి. నల్లగా మారుతుంటాయి. ఇలా పెదవులు జీవం కోల్పోయిన వారు మానసికంగా దిగులు పడుతుంటారు. పెదవులు ఎర్రగా మారడానికి వివిధ రకాల క్రీమ్స్‌, జెల్స్ ఉపయోగిస్తారు. అయితే, డైలీ కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల కొద్ది రోజుల్లోనే ఎర్రటి, మృదువైన పెదాలను సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్‌ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి.

ఈ టిప్స్‌తో ఎర్రటి పెదాలు మీ సొంతం!

నిమ్మరసం, తేనె :
ఒక చిన్నె గిన్నెలో నిమ్మరసం, తేనెను సమానంగా తీసుకుని బాగా మిక్స్ చేయండి. తర్వాత పెదాలపై అప్లై చేసుకుని 15 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల పెదాలపై ఉన్న నలుపు తగ్గిపోయి, మృదువుగా మారతాయి.

దోసకాయ ముక్కలు :
దోసకాయలో ఉండే కొన్ని రకాల గుణాలు పెదాల నలుపు రంగును, అలాగే పిగ్మెంటేషన్‌ సమస్యను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజూ దోసకాయ ముక్కలను సన్నగా కట్‌ చేసుకుని పెదాలపై 10-15 నిమిషాలు పెట్టుకోవాలి. ఇలా చేస్తే పెదాలు ఎర్రగా మారతాయి.

కనుబొమల వెంట్రుకలు రాలిపోతున్నాయా? - ఈ సమస్య నుంచి ఇలా బయటపడండి! - How To Prevent Eyebrow Hair Loss

గులాబీ రేకుల పేస్ట్‌ :
కొన్ని తాజా గులాబీ రేకులను తీసుకుని మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసుకుని తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా డైలీ చేయడం వల్ల పైదాలపై ఉన్న నలుపు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్‌ ఆయిల్‌, చక్కెర :
ఒక చిన్న గిన్నెలో కొద్దిగా ఆలివ్‌ ఆయిల్‌ను తీసుకుని అందులో చక్కెర కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పెదాలపై మసాజ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పెదాలు మృదువుగా మారి మెరుస్తాయి.

అలోవేరా జెల్‌ :
పెదాలు నల్లగా ఉన్న వారు ఫ్రెష్‌ కలబంద జెల్‌ను తరచుగా అప్లై చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇలా డైలీ చేయడం వల్ల పెదాలు పొడి బారకుండా ఉండటంతో పాటు, ఎర్రగా మారతాయని నిపుణులు చెబుతున్నారు. 2019లో 'కాస్మెటిక్ డెర్మటాలజీ' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రోజుకు రెండు సార్లు పెదాలకు అలోవేరా జెల్‌ను అప్లై చేసుకోవడం వల్ల పెదాల రంగు ఎర్రగా మారిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్‌ డేవిడ్ యాంగ్' పాల్గొన్నారు. అలవేరా జెల్‌ను లిప్స్‌కు అప్లై చేసుకోవడం వల్ల అవి మృదువుగా, ఎర్రగా మారతాయని ఆయన పేర్కొన్నారు.

  • బీట్‌రూట్‌ రసాన్ని పెదాలపై అప్లై చేసుకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.
  • ఒక చిటికెడి పసుపులో కొన్ని పాలను కలిపి.. పెదాలకు మసాజ్‌ చేసుకోవడం వల్ల పెదాలు ఎర్రగా మారుతాయి.
  • అలాగే పెదాలకు కొబ్బరి నూనెను రాసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది.
  • చాలా మంది గ్రీన్‌ టీ బ్యాగ్‌లను వాడిన తర్వాత పాడేస్తుంటారు. అయితే, ఈ బ్యాగులను పెదాలపై అద్దుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుందట. గ్రీన్‌ టీలోని యాంటీఆక్సిడెంట్లు పెదాల నలుపు రంగును తగ్గిస్తాయని నిపుణులంటున్నారు.
  • వీటితో పాటు రోజూ ఎక్కువగా వాటర్‌ తాగడం, తాజా పండ్లు, కూరగాయలను తినడం వల్ల పెదాలు ఎర్రగా, ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నెయిల్‌ పాలిష్‌ వాడుతున్నారా? - ఈ ముప్పు తప్పదు! - Side Effects Of Nail Polish

టూత్​పేస్ట్​తో ఇలా చేస్తే - టానింగ్ పోయి మీ పాదాలు కోమలంగా తయారవుతాయి! - Process at Home

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.