ETV Bharat / health

డాక్టర్​ వద్దకు వెళ్లే ముందు ఈ తప్పులు చేయకండి - మొత్తం తేడా కొట్టేస్తుంది! - TIPS BEFORE MEDICAL CHECK UP - TIPS BEFORE MEDICAL CHECK UP

Tips Before Medical Check Up : అనారోగ్యంతో డాక్టర్‌ అపాయింట్​ మెంట్ తీసుకున్నారా? లేదా మీ వాళ్లను తీసుకెళ్తున్నారా? అయితే.. ఈ స్టోరీ మీకోసమే. డాక్టర్​ వద్దకు వెళ్లే ముందు కొన్ని తప్పులు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. మరి.. అవి ఏంటి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.

Tips Before Medical Check Up
Tips Before Medical Check Up
author img

By ETV Bharat Telangana Team

Published : Apr 1, 2024, 1:50 PM IST

Tips Before Medical Check Up : మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల.. నేడు చిన్న వయసులోనే చాలా మందిలో రక్తపోటు సమస్య కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మీరు గనక బీపీ పరీక్ష చేయించుకునేందుకు డాక్టర్​ వద్దకు వెళ్లాలని అనుకుంటే.. కనీసం గంట ముందు కాఫీ లేదా కెఫీన్‌ ఉండే డ్రింక్స్‌ ఏవీ తాగకూడదని నిపుణులంటున్నారు. ఎందుకంటే.. కెఫిన్‌ కు రక్తపోటు పెంచే స్వభావం ఉంటుందట. అదేవిధంగా.. బీపీ టెస్ట్ చేసుకునే ముందు బీడీ, సిగరెట్‌ వంటి పొగాకు ఉత్పత్తులకు సైతం దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

బ్లడ్‌ టెస్ట్‌ :
మీరు బ్లడ్‌ టేస్ట్‌ చేయించుకునే ముందు ఎక్కువగా కొవ్వు ఉండే ఆహార పదార్థాలను తినకూడదు. దీనివల్ల రిజల్ట్‌లో తేడాలు వస్తాయట. 2015లో ప్రచురించిన 'అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్' నివేదిక ప్రకారం.. మెడికల్ టెస్ట్ చేసుకోవడానికి ముందు ఎక్కువగా కొవ్వు ఉండే ఆహార పదార్థాలను తిన్న వ్యక్తులలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు సగటున 200 mg/dL పెరిగాయని పరిశోధకులు కనుగొన్నారు.

పోహా vs రైస్​- ఆరోగ్యానికి ఏది బెటర్​? - poha or rice which is better

కొలెస్ట్రాల్ టెస్ట్‌ :
కొలెస్ట్రాల్‌ టెస్ట్‌ చేసుకోవాలని అనుకుంటే.. కనీసం 24 గంటల ముందు వరకు మద్యం సేవించకూడదట. అలాగే స్వీట్లు కూడా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల ట్రైగ్లిజరైడ్‌ స్థాయిలు మారిపోయే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు.

స్కిన్‌ టెస్ట్‌ :
తామర, అలర్జీ వంటి ఏదైనా ఇతర చర్మ సంబంధిత సమస్యలతో డాక్టర్‌ను కలవాలని అనుకుంటే.. గోర్లకు నెయిల్‌ పాలిష్‌ వేసుకోకండి. ఎందుకంటే వారు చర్మాన్ని పరిశీలించడంతో పాటు గోళ్లు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా ? అనే విషయాన్ని కూడా గమనిస్తారు. కాబట్టి, చర్మవైద్యుడిని కలిసే ముందు నెయిల్‌ పాలిష్‌కు దూరంగా ఉండండి. అలాగే మేకప్‌ కూడా వేసుకోకండి.

కొలనోస్కోపీ పరీక్ష :
పెద్దపేగు క్యాన్సర్లను గుర్తించే కొలనోస్కోపీ పరీక్ష చేసుకునే రెండు రోజుల ముందు నుంచి సులభంగా జీర్ణమయ్యే అహారం తీసుకోవడం తప్పనిసరి. మీకు ఏ ఆహారం తీసుకోవాలనే విషయంలో సందేహం ఉంటే ముందుగానే నిపుణుల సలహా తీసుకొని.. ఆ తర్వాత పరీక్షకు వెళ్తే బాగుంటుంది.

మెమోగ్రామ్ :
రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించడానికి చేసే మెమోగ్రామ్‌ పరీక్ష (స్క్రీనింగ్‌) చేయించుకునేందుకు వెళ్లాలని అనుకుంటే.. చెమట, దుర్వాసనను నియంత్రించడానికి ఉపయోగించే బాడీ స్ప్రేలను ఉపయోగించకపోవడం మంచిదట. ఎందుకంటే వీటిలో అల్యూమినియం ఉంటుంది కాబట్టి.. వీటిని అప్లై చేసుకోవడం వల్ల ఫలితాల్లో తేడాలు వచ్చే అవకాశం ఉంటుందట.

Note : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వేడి పాలు తాగాలా - చల్లార్చినవి తీసుకోవాలా? - Benefits Of Cold Milk

అలర్ట్​ : ఒంట్లో మెగ్నీషియం తగ్గితే ప్రాణాలకే ముప్పు! - ఈ లక్షణాలుంటే డాక్టర్​ను కలవాల్సిందే! - Magnesium Deficiency Warning Signs

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.