ETV Bharat / health

ప్రెగ్నెన్సీ టైమ్​లో ఈ ఆహారం తింటున్నారా? - మీ బిడ్డ హెల్త్ డేంజర్​లో పడ్డట్టే! - Pregnant Avoid These Foods

Pregnant Avoid These Foods : గర్భిణులు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. తల్లీబిడ్డ ఆరోగ్యం ఇబ్బందుల్లో పడొచ్చు. ఇందులో మరీ ముఖ్యంగా అస్సలు తీసుకోకూడని పదార్థాలు కొన్ని ఉన్నాయి. అవి తింటే తీవ్ర దుష్పరిణామాలు తప్పవని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Pregnant Avoid These Foods
Pregnant Avoid These Foods
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 11, 2024, 11:24 AM IST

Pregnants Should Avoid These Foods : ఆరోగ్యం విషయంలో గర్భిణులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. తల్లికి, కడుపులోని బిడ్డకు హాని కలిగే అవకాశం ఉంటుంది. తినే ఆహారం విషయంలో ఈ జాగ్రత్త మరింత అవసరం. ఏది పడితే అది తినకూడదు, బయటి తినుబండారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. కానీ.. గర్భంతో ఉన్నప్పుడు మహిళలకు ఆహార కోరికలు పెరుగుతాయి. రకరకాల తిండిని టేస్ట్ చేయాలని అనిపిస్తుంది. ఈ క్రమంలో చాలా మంది గర్భిణులు(Pregnants) అల్ట్రాప్రాసెస్డ్, ఫాస్ట్​ఫుడ్స్​ తింటుంటారు. ఈ ఫుడ్స్ పై ఇటీవల జరిపిన ఓ పరిశోధనలో.. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎన్విరాన్‌మెంటల్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. గర్భిణులు చీజ్‌బర్గర్‌ లేదా ప్యాక్ చేసిన పేస్ట్రీలు వంటి అల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్స్​ తినడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీరు తినే చిప్స్​, పేస్ట్రీల ప్యాకేజింగ్​కి ఉపయోగించే కవర్లు ప్లాస్టిక్​లతో సంబంధం ఉన్న రసాయనాలతో తయారవుతాయి. ముఖ్యంగా వీటిలో థాలెట్స్ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఈ థాలెట్స్.. మీరు తినే ప్యాకెజ్డ్ ఫుడ్స్, బర్గర్లు, పిజ్జా వంటి ఆహారంలోకి రిలీజ్ అవుతుంది. ఈ రసాయనం కడుపులోపలి పిండంపై ప్రభావం చూపిస్తుందట. గర్భిణులు వీటిని తింటే ఈ రసాయనాలు ప్లాసెంటా ద్వారా పిండం రక్తప్రవాహంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల ఈ ప్రాసెస్డ్, జంక్ ఫుడ్ అస్సలే తినొద్దని సూచిస్తున్నారు.

Sex During Pregnancy : గర్భంతో ఉన్నప్పుడు సెక్స్​ చేయవచ్చా? వైద్యులు ఏం చెబుతున్నారు?

గర్భిణులు థాలేట్స్​కు గురికావడం వల్ల.. తక్కువ బరువుతో పిల్లలు పుట్టడం, ముందస్తు జననం, ఆటిజం, ADHD వంటి మానసిక రోగాలు పిల్లలను చుట్టు ముడతాయని అధ్యయనం హెచ్చరించింది. అమెరికాలో ఓ పరిశోధన సంస్థ న్యూరోకాగ్నిటివ్ డెవలప్‌మెంట్ లెర్నింగ్ ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ (క్యాండిల్) పేరుతో 2006 నుంచి 2011 మధ్య.. 1,031 మంది గర్భిణులపై పరిశోధన జరిపింది. ఈ రీసెర్చ్​లో మూడు నుంచి ఆరు నెలల మధ్య గర్భిణుల మూత్రాన్ని సేకరించి పరీక్షించి థాలేట్ స్థాయిలు కనుగొన్నారు. ఫాస్ట్ ఫుడ్ తిన్న గర్భిణులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నట్టు చెప్పారు. ముఖ్యంగా.. పాస్ట్‌ఫుడ్‌లో అధికంగా ఉండే కేలరీల వల్ల గర్భిణులు అధిక బరువు పెరగడానికి కారణమవుతాయని పరిశోధకులు తెలిపారు. అధిక బరువు పెరగడం వల్ల అమ్మాయిల్లో గర్భధారణ సమస్యలతోపాటు.. గర్భం ధరంచిన వారికి ప్రసవ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

కాబట్టి.. గర్భిణులు వీలైనంత వరకు అల్ట్రాప్రాసెస్డ్, ఫాస్ట్​పుడ్​కు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా.. అధిక కొవ్వులు, చక్కెర పదార్థాలను కూడా తినకపోవడం మంచిది అంటున్నారు. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలు, లీన్ ప్రొటీన్లు ఉండే మంచి పోషకాహారం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు.

పెయిన్​లెస్​ డెలివరీ సేఫేనా? డాక్టర్లు ఏం అంటున్నారు?

Pregnant Woman Bath Per Day : గర్భిణీలు ఎక్కువసార్లు స్నానం చేస్తే ఇబ్బందా? మెట్లు ఎక్కకూడదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.