ETV Bharat / health

మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే - ఈ ఆహారపదార్థాల జోలికి అస్సలు వెళ్లకండి! - Teeth Damaging Foods - TEETH DAMAGING FOODS

These Foods to Damage Teeth : మీ దంతాలు తళతళా మెరిసిపోతూ.. ఆరోగ్యంగా, స్ట్రాంగ్​ ఉండాలంటే రెండు పూటలా బ్రష్ చేసుకోవడం మాత్రమే సరిపోదు. ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Avoid These Foods for Strong Teeth
These Foods to Damage Teeth (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 11, 2024, 11:27 AM IST

Avoid These Foods for Strong Teeth : మనలో చాలా మంది ముఖం, జుట్టు ఆరోగ్యం మీద పెట్టిన శ్రద్ధ.. నోటి ఆరోగ్యం మీద పెట్టరు. ఏదైనా దంత సమస్యలు, చిగుళ్లలో నొప్పి, నోటి దుర్వాసన వంటి సమస్యలు తలెత్తితే గానీ దాని ప్రాధాన్యమేంటో అర్థం కాదు. కాబట్టి, దంత సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే.. మనం తినే కొన్ని ఆహారాలు పళ్లను(Teeth) తీవ్రంగా దెబ్బతీస్తాయట. అందుకే.. మీ పళ్లు ఆరోగ్యంగా, స్ట్రాంగ్​గా ఉండాలంటే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇంతకీ, పళ్లను దెబ్బతీసే ఆ ఫుడ్స్ ఏంటో స్టోరీలో తెలుసుకుందాం.

పాప్ కార్న్ : మనలో చాలా మందికి థియేటర్​కు వెళ్లినప్పుడు లేదా షాపింగ్ కోసం బయటకు వెళ్లినప్పుడు పాప్​కార్న్ తినే అలవాటు ఉంటుంది. ఇక పిల్లలకైతే వీటిని ఎంతో ఇష్టంగా తింటుంటారు. కానీ, ఇది దంతాలను దెబ్బతీస్తుందని మీకు తెలుసా? అవునండీ.. మీరు వింటుంది నిజమే! పాప్​కార్న్​లో ఉండే హార్డ్ ఫైబర్ దంతాలపై ఉండే ఎనామిల్​ను దెబ్బతీస్తుందట. కాబట్టి, దంత సంరక్షణ కోసం పాప్​కార్న్​ తినకపోవడం మంచిదంటున్నారు నిపుణులు.

బ్లాక్ కాఫీ : మీ పళ్లు ఆరోగ్యంగా, ధృడంగా ఉండాలంటే కాఫీ, టీలను తగ్గించుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా బ్లాక్ కాఫీలో టానిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా దీన్ని తీసుకోవడం వల్ల దంతాలపై మరకలు ఏర్పడడమే కాకుండా ఎనామిల్ దెబ్బతింటుందంటున్నారు.

2016లో 'జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్​'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. బ్లాక్ కాఫీ దంతాల ఎనామిల్‌ను క్షీణింపజేస్తుందని, దంతాలకు హాని కలిగించే బ్యాక్టీరియా పెరుగుదలకు దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో స్పెయిన్​లోని యూనివర్సిటీ ఆఫ్ సెవిల్లేకు చెందిన డెంటాలజిస్ట్ డాక్టర్ రాఫెల్ కామినోస్-రామోస్ పాల్గొన్నారు. బ్లాక్ కాఫీ ఎక్కువగా తాగడం వల్ల అందులోని టానిన్ కంటెంట్ దంతాలను దెబ్బతీస్తుందని ఆయన పేర్కొన్నారు.

గ్రీన్ టీ : ఈరోజుల్లో చాలా మంది ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ, దాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దంత సమస్యలు రావొచ్చంటున్నారు. కాబట్టి.. మీ దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే తక్కువ టానిన్ కంటెంట్ ఉన్న టీ లను ఎంచుకోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

రోజుకు ఎన్నిసార్లు బ్రష్‌ చేయాలి? ఎంతసేపు చేసుకోవాలి?

సోడా, కార్బొనేటెడ్ డ్రింక్స్ : ఇవి కూడా నోటి ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. సోడాలో సిట్రిక్, ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటాయి. ఫలితంగా వీటిని తీసుకోవడం వల్ల ఆమ్ల స్థాయి పెరిగి దంత సమస్యలు వస్తాయంటున్నారు. ఇక స్పోర్ట్స్ డ్రింక్స్ తాగడం వల్ల.. వాటిలో ఉండే చక్కెర దంతాల మీద పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఫలితంగా దంతక్షయం వంటి పంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట.

సిట్రస్ ఫ్రూట్స్ : దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సిట్రస్ పండ్లను ఎక్కువగా తీసుకోవద్దు. ఎందుకంటే.. వాటిలో ఉండే యాసిడ్ దంతాలపై ఆమ్ల ప్రభావాన్ని చూపి ఎనామిల్ దెబ్బతీసే ఛాన్స్ ఉందంటున్నారు నిపుణులు. ఫలితంగా దంత సమస్యలు రావొచ్చంటున్నారు.

అధిక చక్కెర ఆహారాలు : కుకీలు, కేకులు, క్యాండీలు, చాక్లెట్స్ వంటి అధిక చక్కెర ఉండే ఆహారాలు దంతాలకు హాని చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిలో ఉండే చక్కెర పళ్ల మీద పేరుకుపోయి బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతుంది. ఇది దంతాల మీద ఫలకం ఏర్పడటానికి, దంత క్షయానికి దారితీస్తుందని చెబుతున్నారు.

పొగాకు : ధూమపానం, గుట్కాలు నమలడం, మద్యం ఎక్కువగా తాగడం వల్ల నోటి పూత, నోటి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి.. నోరు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అలవాట్లకు వీలైనంత దూరంగా ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బ్రష్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్‌ చేస్తున్నారా? - మీ దంతాల పని అయిపోయినట్టే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.