ETV Bharat / health

బయట తింటున్నారా? - ఈ ఫుడ్​కు కచ్చితంగా నో చెప్పండి! - Health Risk Foods

Avoid These Foods When Eating Outside : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. కానీ, ఈరోజుల్లో పలు కారణాలతో చాలా మంది ఔట్​సైడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. దాంతో యంగ్ ఏజ్​లోనే వివిధ ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అలాకాకుండా ఉండాలంటే బయట ఈ ఫుడ్స్ అస్సలు తినకూడదంటున్నారు నిపుణులు! అవేంటో ఇప్పుడు చూద్దాం..

Avoid These Foods When Eating Outside
Avoid These Foods When Eating Outside
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 23, 2024, 2:35 PM IST

బయట రెస్టారెంట్​లకు వెళ్లినప్పుడు చాలా మంది ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్.. సలాడ్స్​. ఇందులో రకరకాలు ఉంటాయి. ఒక హెల్త్ కథనం ప్రకారం.. ప్రముఖ రెస్టారెంట్ సర్వ్ చేసిన చికెన్ సలాడ్​లో సుమారు 1,300 కేలరీలు, 84 గ్రాముల కొవ్వు ఉన్నట్లు వెల్లడైంది. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు కాబ్ లేదా చికెన్ సలాడ్ తినకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు.

ఫాస్ట్ ఫుడ్ : ఈ రోజుల్లో ఎక్కువ మంది బయటకు వెళ్లినప్పుడు తినేది ఫాస్ట్​ ఫుడ్. అయితే.. ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. హాంబర్గర్, ఫ్రైస్, సోడాలో మొత్తం 1,100 కేలరీలు, 50 గ్రాముల కొవ్వు ఉంటాయట. కాబట్టి వీలైనంత వరకు దీనిని తినకపోవడం బెటర్.

డైట్ సోడా : దీనిలో కేలరీలు తక్కువగా ఉన్నప్పటికీ, రసాయనాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. అమెరికన్ జెరియాట్రిక్స్ సొసైటీ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువగా డైట్ సోడా తాగే వ్యక్తులు 9 సంవత్సరాల కాలంలో సోడా తాగని వారి కంటే 3 రెట్లు ఎక్కువ బెల్లి ఫ్యాట్ కలిగి ఉన్నట్లు వెల్లడైంది.

స్పెషల్ బ్రేక్​ఫాస్ట్​ ఐటమ్స్ : కొందరు వ్యక్తులు బేకన్, సాసేజ్‌లు, పాన్‌కేక్‌లతో కూడిన అల్పాహారాన్ని ఇష్టపడతారు. అయితే ఇవి కూడా ఆరోగ్యానికి అంత మంచివి కావంటున్నారు నిపుణులు. వీటికి బదులుగా పండ్లు, కూరగాయలను తినడం మంచిది అంటున్నారు నిపుణులు.

కొన్ని నాన్​వెజ్ ఐటమ్స్ : హాట్ డాగ్, రెడీ టూ కుక్ మీట్, ఫ్రోజ్ చేసిన నగ్గెట్స్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. అలాగే సోడియం ఎక్కువ. వీటిని ఎక్కువగా తీసుకుంటే క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. కాబట్టి బయటకు వెళ్లినప్పుడు వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది.

"భయ్యా - పిజ్జా విత్ ఎక్స్​ట్రా ఛీజ్" అని ఆర్డర్ వేస్తున్నారా? - అయితే ఇదర్ దేఖో జీ!

చీజ్ ఫ్రైస్ : ఈ రుచికరమైన ఫుడ్​ ఐటమ్​లో సోడియం భారీ మొత్తంలో ఉంటుంది. ఇది తింటే రోజువారీ మొత్తాన్ని మించిపోతుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం.. చాలా ఉప్పగా ఉండే ఆహారాన్ని తిన్న 30 నిమిషాల తర్వాత రక్తనాళాల పనితీరు దెబ్బతింటుంది.

లెమన్ వాటర్ : నిజానికి నిమ్మకాయ నీళ్లు చాలా మంచివి. కానీ.. రెస్టారెంట్​లో ఆర్డర్ చేయొద్దు. "జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ హెల్త్‌"లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. దాదాపు 70% నిమ్మకాయలు బ్యాక్టీరియాతో కలుషితమై ఉంటాయట.

పిజ్జాలు, బర్గర్లు : వీటిలో సోడియం, శాచురేటెడ్ కొవ్వులు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి. వీటివల్ల కూడా చాలా రకాల ఆరోగ్య సమస్యలు రావచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఇంట్లోనే బర్గర్లు, పీజ్జాలు చేసుకుని తింటే చాలా మంచిదంటున్నారు.

క్రీమ్ సూప్ : భోజనానికి ముందు సూప్ తినడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీకు సంపూర్ణమైన అనుభూతిని కలిగిస్తుంది. అలాగే మీరు తక్కువగా తినేలా చేస్తుంది. అయితే, ఇది క్రీము సూప్‌లతో తీసుకోకూడదనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే క్రీముతో కూడిన సూప్ 500 క్యాలరీల వరకు కలిగి ఉన్నందున పూర్తి భోజనంగా మారుతుంది.

ఏ పండులో ఎంత షుగర్ ఉంటుంది? - మీకు తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.