ETV Bharat / health

Alert : మీ బాడీలో ఈ లక్షణాలు ఉన్నాయా? - ఆ వ్యాధితో బాధపడుతున్నట్టే! - మెద‌డువాపు వ్యాధి కారణాలు

Encephalitis Symptoms: మెద‌డువాపు.. దోమ‌ల వ‌ల్ల వ‌చ్చే ప్రాణాంత‌క‌మైన వ్యాధి. దీన్ని ఇంగ్లీష్‌లో ఎన్‌సెఫ‌లైటిస్(Encephalitis ) అని పిలుస్తారు. ఈ వ్యాధి కార‌ణంగా మెద‌డులోని నాడీ కణాల్లో వాపు ఏర్ప‌డి వాటి ప‌నితీరులో అవ‌రోధాలు ఏర్ప‌డ‌తాయి. మరి ఈ మెదడువాపు లక్షణాలు..? ఎలా నిర్ధారించాలి..? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Encephalitis Symptoms
Encephalitis Symptoms
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2024, 5:28 PM IST

Encephalitis Symptoms : మెదడు వాపు వ్యాధి అనేది పలు కారణాల వల్ల వస్తుంది. బ్రెయిన్​లోని నాడీ కణాలలో వాపు ఏర్పడి, వాటి పని తీరులో అవరోధాలు ఏర్పడటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి తీవ్రతను బట్టి.. స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక మెదడు వాపు వ్యాధిగా విభజిస్తారు. స్వల్పకాలిక మెదడు వాపు తీవ్రత ఎక్కువగా ఉంటుంది.

ఈ వ్యాధి చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మరణాల సంఖ్య కూడా పిల్లల్లోనే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల.. మెదడు వాపు వ్యాధి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండటం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. మరి మెదడు వాపు వ్యాధికి గల కారణాలేంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? ఎలా నిర్ధారిస్తారు? వంటి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

వ్యాధి కార‌ణాలు: సాధారణంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. బాక్టీరియా కూడా మెదడువాపునకు కారణమవుతుంది. ముఖ్యంగా.. జ‌ప‌నీస్ ఎన్‌సెఫ‌లైటిస్ (JE) వైర‌స్‌, హెర్పెస్ సింప్లెక్స్ వైర‌స్ (HSV), మీజిల్స్ వైర‌స్‌, రాబిస్ వైర‌స్‌, ఇన్‌ఫ్లూయెంజా వైర‌స్‌ వ‌ల్ల మెద‌డువాపు వ్యాధి ఎక్కువగా వ‌స్తుంది. అయితే.. ఈ వైర‌స్‌లు డెంగ్యూ దోమ‌ల ద్వారా వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా బ్యాక్టీరియా, పార‌సైట్స్ కూడా మెద‌డువాపు వ్యాధిని క‌లిగించ‌వ‌చ్చు. విష‌ప‌దార్థాలు, ఆటో ఇమ్యూనిటీకి సంబంధించిన వ్యాధుల వల్ల, అరుదుగా వాడే ప‌లు వ్యాక్సిన్ల వ‌ల్ల కూడా మెద‌డువాపు వ్యాధి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.

పచ్చి ఉల్లిపాయ తింటున్నారా - ఏమవుతుందో తెలుసా?

వ్యాధి లక్షణాలు: ఈ వైరస్ మెదడులో ప్రవేశించిన ప్రతి వ్యక్తికీ మెదడువాపు వ్యాధి రాదు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారే ఎక్కువగా ప్రభావితమవుతారు. ఈ వ్యాధి లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి. అవి తేలికపాటి, తీవ్రమైన లక్షణాలు. తేలికపాటి లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి.

తేలికపాటి లక్షణాలు:

  • తలనొప్పి
  • జ్వరం
  • కండరాల నొప్పులు
  • కీళ్లలో నొప్పి
  • బలహీనత
  • అలసట

బాదం ఎక్కువగా తింటున్నారా? - నిపుణులు హెచ్చరిస్తున్నారు!

తీవ్రమైన లక్షణాలు:

  • మూర్ఛ
  • చలనం కోల్పోవడం
  • పాక్షిక లేదా పూర్తి పక్షవాతం
  • అపస్మారక స్థితి
  • వినికిడి కష్టం
  • కండరాల బలహీనత

పిల్లలో లక్షణాలు:

  • వికారం
  • వాంతులు
  • ఆకలి లేకపోవడం
  • చిరాకు

పాలు తాగకపోతే కాల్షియం ప్రాబ్లమ్ - ఇలా భర్తీ చేసుకోండి!

ఎలా నిర్ధారిస్తారు? ఈ వ్యాధిని నిర్ధారించడానికి బ్ల‌డ్ టెస్టుతో పాటు యాంటీబాడీ టెస్ట్‌, పీసీఆర్ టెస్ట్‌, వెన్ను నీరు ప‌రీక్ష‌ నిర్వహిస్తారు. ఇంకా.. EEG, MRI స్కాన్‌ల ద్వారా కూడా మెద‌డు ప‌నితీరును ప‌రిశీలిస్తారు. ఈ పరీక్షల ద్వారా మెద‌డువాపు తీవ్ర‌త‌ను అంచ‌నా వేస్తారు. మెద‌డు వాపు వ్యాధి ల‌క్ష‌ణాలు ఉన్న వ్య‌క్తుల్లో వీలైనంత త్వ‌ర‌గా వ్యాధి నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు జ‌రిపి, చికిత్స అందించ‌డం చాలా అవ‌స‌రం. వ్యాధి తీవ్ర‌త‌, వ్యాధి నిర్ధార‌ణ‌, ఎంత తొంద‌ర‌గా చికిత్స అందించామనే స‌మ‌యాన్ని బ‌ట్టే రిక‌వ‌రీ రేటు ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మెదడువాపు వ్యాధిని సకాలంలో గుర్తించకపోతే మరణం కూడా సంభవించే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

అలర్ట్ - ఈ లక్షణాలు మీ పాదాలపై కనిపిస్తే.. షుగర్‌ ఎక్కువగా ఉన్నట్టే!

మెదడు మొద్దుబారితే ప్రమాదం - ఇలా చేస్తే ఫుల్ యాక్టివ్​ అయిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.