Health Care Tips in Summer : కొంతమంది ఎండలో బయటకు వెళ్లి రాగానే ఉక్కపోత భరించలేక చల్లని నీటితో స్నానం చేస్తుంటారు. అయితే, అలా చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం వాటిల్లవచ్చని కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
ఏమవుతుంది?
మనం ఎండలో తిరిగినంత సేపు బాడీ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. దీనికితోడు బాడీ చెమట పట్టి ఉండటంతో చిరాగ్గా ఉంటుంది. వెంటనే ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు చల్లని నీటితో స్నానం చేయాలని అనిపిస్తుంది. అప్పుడే రిలాక్స్‌గా అనిపిస్తుంది. కాబట్టి, అందుకే చాలా మంది బయటకు వెళ్లి రాగానే స్నానం చేస్తారు.
అయితే.. మండుటెండలో బయటకు వెళ్లొచ్చాక చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ప్రమాదకర పరిస్థితుల్ తలెత్తే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ ఎక్కువగా టెంపరేచర్ మీద ఉన్న బాడీపై ఒక్కసారిగా చల్లటి నీళ్లు పోయడంతో.. ఉన్నట్టుండి హృదయ స్పందన రేటు మారిపోతుంది. ఫలితంగా రక్తపోటు పెరిగే ఛాన్స్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ పరిస్థితి వల్ల కొన్నిసార్లు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. బీపీ ఎక్కువగా పెరిగిపోతే.. బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే.. ఎండలో బయటకు వెళ్లి వచ్చాక వెంటనే స్నానం చేయొద్దని సూచిస్తున్నారు. బాడీ టెంపరేచర్‌ను రూమ్ టెంపరేచర్‌కు అనుగుణంగా తీసుకొచ్చిన తర్వాతనే స్నానం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అది కూడా చల్లటి నీళ్లు కాకుండా నార్మల్ నీళ్లతో చేయాలని సూచిస్తున్నారు. దీంతోపాటు.. ఎండకు తిరిగొచ్చాక ఫ్రిజ్‌లోని కూల్ వాటర్ కూడా తాగొద్దని చెబుతున్నారు.
హీట్ స్ట్రోక్ - ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!
2016లో 'European Heart Journal'లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఎండలో బయటకు వెళ్లొచ్చాక చల్లని నీటితో స్నానం చేయడం వల్ల రక్తపోటు గణనీయంగా పెరుగుతుందని కనుగొన్నారు. జర్మనీలోని డ్యూస్‌బర్గ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం ఈ రీసెర్చ్ నిర్వహించింది. ఈ పరిశోధనలో పాల్గొన్న ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మార్కస్ మోట్జ్.. ఎండలో తిరిగి వచ్చాక చన్నీళ్లతో స్నానం చేయడం వల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరిగే అవకాశం ఉందని, అది గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలకు దారితీసే ప్రమాదాన్ని పెంచుతుందని ఆయన పేర్కొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బాబోయ్ ఎండలు! నీరు తగినంత తాగుతున్నారా? డీహైడ్రేషన్‌ను గుర్తించడమెలా? - Symptoms Of Dehydration