ETV Bharat / health

వేసవిలో షుగర్, బీపీ పేషెంట్స్ బీ కేర్​ఫుల్​- ఆస్పత్రిలో చేరే రిస్క్​ డబుల్! - Summer Effect On Patients - SUMMER EFFECT ON PATIENTS

Summer Effect On BP And Diabetes Patients : అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల్లో షుగర్, బీపీ, ఒబెసిటీతో బాధపడేవారు ఆస్పత్రిలో చేరే ప్రమాదం రెట్టింపు అవుతుందని ఓ అధ్యయనం తెలిపింది. అధిక ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొంది.

Summer Effect On BP And Diabetes Patients
Summer Effect On BP And Diabetes Patients (Source : Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 22, 2024, 4:03 PM IST

Summer Effect On BP And Diabetes Patients : అధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజుల్లో షుగర్, బీపీ, స్థూలకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నవారికి సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజులతో పోలిస్తే ఆస్పత్రిలో చేరే ప్రమాదం రెట్టింపు అవుతుందని స్పానిష్ అధ్యయనంలో తేలింది. స్పెయిన్​లో ఒక దశాబ్దానికి పైగా వేసవిలో అధిక ఉష్ణోగ్రతల సమయంలో ఆస్పత్రిలో చేరిన రోగుల డేటాను విశ్లేషించి ఈ అధ్యయనం పలు విషయాలను వెల్లడించింది. అధిక ఉష్ణోగ్రతలు షుగర్, బీపీ, ఒబెసిటీతో బాధపడేవారిని ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని పేర్కొంది.

"ఊబకాయం ఉన్నవారు అధిక ఉష్ణోగ్రతల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అధిక స్థాయి వాయు కాలుష్యం మధుమేహం సహా పలు వ్యాధిగ్రస్థులను ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. వేడిగా ఉండే రోజుల్లో గాయాల కారణంగా పురుషులు ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఎక్కువగా ఉంది. కాగా, మహిళలు అంటు వ్యాధులు, హార్మోన్లు, జీవక్రియ, శ్వాసకోశ, మూత్ర సంబంధిత వ్యాధుల వల్ల ఎక్కువగా ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు పెరిగిన రోజుల్లో శరీరంలో ఎక్కువ రక్తం ప్రవహిస్తుంది. దీంతో చెమట పెరుగుతుంది. అలాగే సాధారణ రోజులతో పోలిస్తే ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు షుగర్, బీపీ, ఒబెసిటీ వ్యాధిగ్రస్తులు కాస్త ఇబ్బందులు పడతారు" ఆని బార్సిలోనా ఇన్​స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్​కు చెందిన పరిశోధకుడు హిచమ్ అచె బాక్ పేర్కొన్నారు.

రోగుల డేటా విశ్లేషణ
స్పెయిన్​లోని 48 ప్రావిన్సులు, తూర్పు స్పెయిన్​లోని ద్వీపసమూహంలోని ఆస్పత్రుల్లో 2006- 2019 మధ్య చికిత్స పొందిన 11.2 మిలియన్లకు పైగా (కోటి పన్నెండు లక్షలు) రోగుల డేటాను పరిశోధకుల బృందం విశ్లేషించింది. వేసవి (జూన్- సెప్టెంబరు)లో ప్రజలు ఆస్పత్రుల్లో చేరడానికి గల కారణాలపై అంచనా వేసింది. అధిక ఉష్ణోగ్రతలు వీరి ఆరోగ్యంపై ఏ మేర ప్రభావం చూపాయో అంచనా వేసింది. అలాగే వాయు కాలుష్య స్థాయిలతో పాటు రోజువారీ సగటు ఉష్ణోగ్రతలను పరిగణనలోకి తీసుకుంది.

అధ్యయనం ప్రకారం
అధిక ఉష్ణోగ్రతల వల్ల ఏడాదిలోపు చిన్నారులు, 85 ఏళ్లు మించినవారు ఎక్కువ హాని ఎదుర్కొంటారు. అధిక ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా కిడ్నీల వైఫల్యం, మూత్రపిండాల్లో రాళ్లు, మూత్ర నాళాల ఇన్‌ఫెక్షన్‌ తో బాధపడేవారు ఆస్పత్రిలో చేరే ప్రమాదం ఎక్కువ ఉంది.

డయాబెటిస్ పేషెంట్లు ఏ టైమ్​లో వ్యాయామం చేస్తే మంచిది? - Diabetes Patients Exercise Time

షుగర్​ పేషెంట్లు బెండకాయ తింటే మంచిదేనా? వైద్యులు ఏం చెబుతున్నారంటే! - Ladies Finger For Diabetes

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.