Stop Drinking Tea And Coffee Benefits : కాఫీ లేదా టీ తాగనిదే చాలామందికి రోజు మొదలు కాదు. పని ఒత్తిడి తగ్గించుకోవడానికి.. బద్ధకాన్ని వదిలించుకోవడానికి..తలనొప్పి నుంచి ఉపశమనం పొందడానికి..ఇలా వివిధ కారణాలతో రోజూ కాఫీ, టీలను తాగుతుంటారు. మరి.. ఒక నెల రోజుల పాటు కాఫీ, టీలను పూర్తిగా తాగడం మానేయడం వల్ల మన శరీరంలో ఏం జరుగుతుంది? ఎలాంటి మార్పులు వస్తాయి? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.
చక్కెర స్థాయిలు అదుపులో :
ఒక 30 రోజుల పాటు కాఫీ, టీలను పూర్తిగా తాగడం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులంటున్నారు. కాఫీ, టీలలో ఉండే చక్కెర మన శరీరంలో షుగర్ లెవెల్స్‌ను పెంచుతుందని చెబుతున్నారు. కాబట్టి.. షుగర్ ఉన్న వారు కాఫీ, టీలకు దూరంగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.
మంచి నిద్ర వస్తుంది :
నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ఒక నెల రోజుల పాటు కాఫీ, టీలను తాగడం మానేస్తే మంచి ఫలితం ఉంటుందట. వీటికి దూరంగా ఉండటం వల్ల ఎక్కువ సేపు హాయిగా నిద్రపోవచ్చని, అలాగే తొందరగా పడుకోవచ్చని ఆరోగ్య నిపుణులంటున్నారు.
పరిశోధన వివరాలు :
2015 లో "ప్లోస్ వన్" జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం, నాలుగు వారాల పాటు టీ, కాఫీ తాగనివారు ఎక్కువగా సేపు నిద్ర పోయినట్లు, అలాగే తొందరగా పడుకున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో 'వాషింగ్టన్ విశ్వవిద్యాలయం'లో గ్లోబల్ హెల్త్ ప్రొఫెసర్‌గా పని చేసే డాక్టర్ డేవిడ్ స్పీగెల్ పాల్గొన్నారు. ఒక నెల రోజుల పాటు కాఫీ, టీలకు దూరంగా ఉన్నవారు ఎక్కువగా నిద్రపోయినట్లు, అలాగే తొందరగా పడుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
రక్తపోటు అదుపులో :
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక నెల రోజుల పాటు కాఫీ, టీలను తాగకపోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట. ఇవి రక్తపోటును పెంచుతాయని చెబుతున్నారు. కాబట్టి, హైబీపీతో బాధపడేవారు ఇలా చేయడం మంచిదని సూచిస్తున్నారు.
వెయిట్ లాస్ అవుతారు :
నెల రోజుల పాటు కాఫీ, టీ తాగని వారు కొద్దిగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులంటున్నారు. వీటిలో ఉండే చక్కెర బరువు పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు కాఫీ, టీలను తక్కువగా తీసుకోండి.
దంతాలు ఆరోగ్యంగా :
30 రోజుల పాటు కాఫీ, టీలను తాగని వారిలో దంతాలు శుభ్రంగా, తెల్లగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులంటున్నారు. కాఫీ, టీలలో ఉండే కొద్ది ఆమ్ల స్వభావం వల్ల దంతాలు రంగు మారుతాయట. అలాగే కొన్ని దంత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉందని ఆరోగ్య నిపుణులంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
వేసవిలో చెమట ఇబ్బంది పెడుతోందా ? - అయితే రోజూ ఇలా చేయండి! - Summer Hydration Tips
'వాటర్ వెయిట్' సమస్య ఉంటే ఏమవుతుంది? దీన్ని తగ్గించడం ఎలా? - water retention in body symptoms