ETV Bharat / health

సమ్మర్​లోనూ మీ స్కిన్‌ మెరిసిపోవాలా ? ఈ సింపుల్​ టిప్స్‌ పాటిస్తే సరి! - Skin Care Tips In Summer Season

Skin Care Tips In Summer Season : సమ్మర్​లో చర్మ ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే వేసవిలో చెమట పట్టడం, ట్యాన్ అయిపోవడం, ర్యాషెస్ రావడం ఇలా చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. మరి ఈ సమస్యకు పరిష్కారంగా కొన్ని టిప్స్​ పాటించమని సలహా ఇస్తున్నారు నిపుణులు. ఈ టిప్స్​ ఫాలో అవ్వడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తూ ఉంటుందని అంటున్నారు.

Skin Care Tips In Summer Season
Skin Care Tips In Summer Season
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 17, 2024, 7:07 PM IST

Updated : Mar 17, 2024, 7:41 PM IST

Skin Care Tips In Summer Season : ఎండలు మండిపోతున్నాయి. మే నెల రాకముందే భానుడి భగభగలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే ఎండలు మండుతున్న వేళ ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ఆరోగ్యం విషయంలోనే కాదని.. అందం విషయంలో కూడా జాగ్రత్తలు అవసరమే అంటున్నారు. సమ్మర్‌లో ఎండ వేడి నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం అంటున్నారు. లేకపోతే చర్మం ఎర్రగా రంగు మారడం, ట్యాన్​ అవడం, మంట పుట్టడం, దద్దుర్లు రావడం, చర్మం పొడి బారడం వంటి సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా చర్మం సున్నితంగా ఉండే వారు ఈ వేసవిలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లినప్పుడు ఈ టిప్స్‌ ఫాలో అవ్వమని సలహాలు ఇస్తున్నారు. ఆ టిప్స్​ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సన్‌స్క్రీన్ లోషన్​: ఎండాకాలంలో చర్మాన్ని సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాల నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. కాబట్టి, రోజూ బయటకు వెళ్లేటప్పుడు చర్మానికి కచ్చితంగా సన్‌స్క్రీన్‌ను అప్లై చేయాలంటున్నారు. అయితే, సన్‌స్క్రీన్‌లో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (SPF ) 30 ఉండేది ఎంపిక చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ప్రతి రెండు గంటలకు ఒకసారి ఎండవేడి నుంచి స్కిన్‌ను కాపాడటానికి దీనిని అప్లై చేసుకోవాలి. దీనిని మీ మెడ, చేతులకు కూడా రాయాలి. అలాగే శరీరం చెమట పట్టిన తర్వాత, స్విమ్మింగ్‌ చేసిన తర్వాత శుభ్రం చేసుకుని మళ్లీ సన్‌స్క్రీన్‌ను అప్లై చేసుకోవాలి.

సున్నితమైన క్లెన్సర్ ఉపయోగించండి : వేసవి కాలంలో మన చర్మానికి పట్టే చెమట వల్ల ఎన్ని సార్లు ముఖం కడుక్కున్నా కూడా మురికిగా తయారవుతుంది. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం సున్నితమైన క్లెన్సర్‌ను ఉపయోగించి ఫేస్​ వాష్​ చేసుకోవాలి. దీనివల్ల చర్మంపైన ఉన్న జిడ్డు, బ్యాక్టీరియా అంతా తొలగిపోతుంది. అలాగే క్లెన్సర్‌ను అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారకుండా హైడ్రేటెడ్‌గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

వాటర్‌ బేస్‌డ్ సీరమ్‌ను యూజ్‌ చేయండి : వేసవిలో ఎండవేడి కారణంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు చర్మం పొడిబారి దురదగా అనిపించవచ్చు. అందుకే చర్మానికి తేమ అందడం కోసం రోజూ వాటర్‌ బేస్‌డ్ సీరమ్‌ను యూజ్‌ చేయండి. దీనివల్ల స్కిన్‌ లోతు నుంచి హైడ్రేట్‌గా ఉంటుంది. అలాగే మరుసటి రోజూ స్కిన్‌ అందంగా కనిపిస్తుందని నిపుణులంటున్నారు. అంతేకాకుండా నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. వేసవిలో చెమట ఎక్కువ పడుతుంది దీంతో ఎక్కువ నీళ్లు ఒంట్లో నుంచి వెళ్లిపోతాయి. కాబట్టి ప్రతి రోజూ ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల హైడ్రేట్‌గా ఉండొచ్చు.

డైలీ మాయిశ్చరైజ్ అప్లై చేయండి : వేసవి కాలంలో చర్మం మృదువుగా ఉండటానికి రోజూ మాయిశ్చరైజర్‌ను అప్లై చేయాలి. దీనివల్ల స్కిన్‌ పొడి బారకుండా ఉంటుంది. అలాగే మాయిశ్చరైజర్‌ను వాడటం వల్ల ఎండవేడి నుంచి స్కిన్‌ చల్లబడి ఉపశమనం పొందుతామని నిపుణులంటున్నారు. మార్కెట్లో చాలా రకాల మాయిశ్చరైజర్‌ క్రీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. మీ చర్మాన్ని బట్టి మంచిది ఎంచుకోండి.

ఎక్స్ఫోలియేషన్ : సమ్మర్‌లో చెమట వల్ల ముఖంపై మేకప్‌, పౌడర్‌ వంటి కాస్మెటిక్స్‌ ఉత్పత్తులు పేరుకు పోతాయి. ఇవి చర్మం లోతుకు చొచ్చుకు పోయి అందవిహీనంగా కనిపించేలా చేస్తాయి. అందుకే స్కిన్‌ అందంగా కనిపించడానికి ఎక్స్ఫోలియేషన్ చేయాలి. దీనివల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు కొత్త ఎక్స్‌ఫోలియేటర్‌ని అప్లై చేసుకునే ముందు ఒకసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోండి.

మీ ఫేస్ మిలమిల మెరిసిపోవాలా? - అయితే నైట్​టైమ్ ఇలా చేయాల్సిందే!

ఈ చర్మ సమస్యలను త్వరగా గుర్తించండి - లేదంటే ప్రాణాలకే ప్రమాదం!

ఫేస్​ మాస్క్​లు మంచివేనా? - నిపుణులు ఏమంటున్నారో తెలుసా?

Last Updated : Mar 17, 2024, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.