ETV Bharat / health

హెచ్చరిక : గర్భసంచి తొలగిస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? - మీకు తెలుసా? - Side Effects of Uterus Removing - SIDE EFFECTS OF UTERUS REMOVING

Uterus Removing: కడుపులో చిన్నపాటి సమస్య వచ్చినా.. గర్భసంచి తొలగించాల్సిందే అని చెప్తుంటారు కొందరు వైద్యులు. వారు చెప్పిందే నిజమని నమ్మే అమాయకులు.. ఆపరేషన్ చేయించుకుంటారు. కానీ.. చిన్న వయసులోనే గర్భసంచి తీసేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో మీకు తెలుసా? తప్పకుండా ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.

Uterus Removal Problems
Side Effects of Uterus Removing (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 17, 2024, 12:01 PM IST

Side Effects of Uterus Removing: గర్భసంచి తొలగించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైంది. కొందరు వైద్యులు డబ్బు కోసం భయపెట్టి ఆపరేషన్లు చేస్తుండగా.. మరికొందరు అమాయకంగా తీయించుకుంటున్నారు. ఇంకొందరైతే.. పిల్లలు పుట్టిన తర్వాత గర్భసంచితో పని ఏమీ ఉండదని, అది తొలగిస్తేనే ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని భావిస్తుంటారు. కానీ.. గర్భాశయం తొలగిస్తే భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గర్భసంచి, అండాశయాలు, అండవాహికలు.. ఈ మూడూ కలిసి పునరుత్పత్తి వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయి. మహిళలకు కీలకమైన ఈస్ట్రోజన్‌ సహా ఇక్కడ ఉత్పత్తి అయ్యే పలు రకాల హార్మోన్లు శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగేలా చేస్తాయి. మెదడు, గుండె పనితీరుతో పాటు, ఎముక గట్టితనం, పోషకాల శోషణ(Absorbtion), రక్తపోటు నియంత్రణ, జీవక్రియల క్రమబద్ధీకరణ వంటి పనులను ఈ హార్మోన్లు చేస్తాయి. ఈ కారణంగానే 50 ఏళ్లలోపు పురుషులతో పోలిస్తే.. మహిళల్లో బీపీ, షుగర్‌ బాధితులు తక్కువగా ఉంటారు. ఇలాంటి గర్భసంచి తొలగిస్తే.. ఆరోగ్యం ఎన్నో విధాలుగా దెబ్బ తింటుందని చెబుతున్నారు.

రక్తం గడ్డ కడుతుంది : గర్భాశయ శస్త్రచికిత్స సమయంలో చాలా మందికి అధిక రక్తస్రావం జరుగుతుంది. ఈ పరిస్థితి రక్తహీనతకు కారణమవుతుంది. కొంతమంది రోగులలో ఈ రకమైన శస్త్రచికిత్స రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుందట. ఈ రక్తం గడ్డకట్టడం మొదలైతే కాళ్లు, ఊపిరితిత్తుల వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు.

క్యాన్సర్​: లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచిని తొలగించడం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు అంటున్నారు. ఈ క్యాన్సర్ కణాలు శరీరం అంతటా ఊహించని విధంగా వ్యాప్తి చెందుతాయని.. తద్వారా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని అంటున్నారు.

ఈ ఆహారాలు కలిపి తింటున్నారా? - ఆరోగ్యాన్ని చేజేతులా ప్రమాదంలో పడేసుకున్నట్టే! - Avoid These Food Combinations

శ్వాసకోస సమస్యలు: శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియా ఇస్తారు. ఇది కొంతమంది మహిళల్లో శ్వాస సమస్యలు, గుండె సమస్యలను కలిగిస్తుందని.. ముఖ్యంగా ఆస్తమా ఉన్న స్త్రీలలో, 50 ఏళ్లు దాటిన వారిలో ఈ సమస్యలు అధికమవుతాయని అంటున్నారు.

ఇన్ఫెక్షన్​: సర్జరీ సమయంలో శరీరంలోని అంతర్గత అవయవాలకు ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వెంటనే అనేక ఆరోగ్య ప్రభావాలను కలిగిస్తుందని చెబుతున్నారు. అలాగే శరీరం నుంచి గర్భాశయాన్ని తొలగించేటప్పుడు, సమీపంలోని అవయవాలకు గాయం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని.. గాయం స్వభావాన్ని బట్టి అది నయం కావడానికి చాలానే సమయం పట్టవచ్చంటున్నారు.

ఎముక పటుత్వం : గర్భసంచి తొలగించిన తర్వాత ఎముకల్లో కాల్షియం నిల్వలు చేరక పెళుసుబారిపోతాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈస్ట్రోజెన్ ఎముక ఆరోగ్యానికి ముఖ్యమైనదని.. మెనోపాజ్ సమయంలో, ఈస్ట్రోజెన్ స్థాయిలు సహజంగా తగ్గుతాయి. గర్భసంచి తొలగిస్తే ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది ఎముకల పటుత్వం కోల్పోవడానికి దారితీస్తుందని అంటున్నారు.

గుండె సమస్యలు: ఈస్ట్రోజెన్ రక్త నాళాలను రక్షించడంలో, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అది తగ్గిపోవడం వల్ల.. గుండెపోటు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుందని అంటున్నారు.

'డబుల్ చిన్​'తో ఇబ్బందిపడుతున్నారా? - ఇలా సింపుల్​గా​ మాయం చేయండి!! - Double Chin Reduce Exercises

2018లో హార్ట్​ జర్నల్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. హిస్టెరెక్టమీ చేయించుకున్న మహిళల్లో హార్ట్​ ఫెయిల్యూర్​ అయ్యే ప్రమాదం 49% ఎక్కువగా ఉందని.. ఈ ప్రమాదం మెనోపాజ్​కు ముందే గర్భసంచి తీయించుకున్న మహిళలలో ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇంగ్లాండ్​లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా, జాన్ రాడ్‌క్లిఫ్ ఆసుపత్రిలో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ జోనాథన్ షెల్టన్ పాల్గొన్నారు. చిన్న వయసులో గర్భాశయం తొలగించుకున్న మహిళలు హార్ట్​ ఫెయిల్యూర్​తో మరణించే ప్రమాదం 42% ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.

గర్భసంచిని తొలగించిన తర్వాత.. 33 శాతం స్త్రీలలో అండాశయాల పనితీరు కూడా తగ్గినట్లు పలు పరిశోధనలో తేలిందని నిపుణులు అంటున్నారు. కొంతమంది స్త్రీలు గర్భాశయ శస్త్ర చికిత్స తర్వాత సెక్స్​ సమయంలో నొప్పిని అనుభవిస్తారని.. ఇది పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుందని చెబుతున్నారు. అందుకే.. అనవసరంగా గర్భసంచిని తొలగించుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎండలోకి వెళ్లొచ్చి చన్నీళ్ల స్నానం చేస్తున్నారా? - ఏకంగా ప్రాణాలకే ప్రమాదం! - ఎందుకో తెలుసా? - Summer Health Care Tips

బీ అలర్ట్​: భోజనానికి ముందు, తర్వాత చాయ్​ తాగుతున్నారా? - ICMR Instruction to Avoid Tea

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.