Side Effects Of Sunscreen Lotion : వేసవి కాలం మొదలవగానే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుని తాపం నుంచి మనల్ని మనం చాలా రకాలుగా కాపాడుకునే అవసరం ఉంది. వాస్తవానికి సూర్యకిరణాలు మనకు ఎంత ప్రయోజనాలు కలిగిస్తాయో ఎండలు ఎక్కువైతే అంత హాని చేస్తాయట. ముఖ్యంగా ఎండ వేడికి చాలా మందికి చర్మ సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. చెమటతో దద్దుర్లు రావడం, నల్లగా కాంతిహీనంగా మారిపోవడం లాంటివి జరుగుతుంటాయి.
వీటి నుంచి తప్పించుకునేందుకు ప్రస్తుతం చాలా మంది చేస్తున్న పని, బయటకు వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవడం. మామూలు వాళ్లు ఏమో గానీ సౌందర్య ప్రియులైతే ఇంట్లో కూడా సన్ స్క్రీన్ క్రీమ్ రాసుకుంటున్నారు. ఈ క్రీములు చర్మాన్ని హానికరమైన సూర్మరశ్మి నుంచి కాపాడతాయి నిజమే కానీ వీటివల్ల చర్మానికి ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువంటే మీరు నమ్ముతారా? ఇవి తెలుసుకున్నాక నమ్మక తప్పదేమో! సన్ స్క్రీన్ లోషన్ను తరచుగా రాసుకోవడం వల్ల మీ చర్మానికి ఎలాంటి హాని కలుగుతుందంటే?
1. అలర్జీ
సన్ స్క్రీన్ లోషన్లలో హానికరమైన విషయం ఏంటంటే? వీటిలో చర్మానికి అలెర్జీని కలిగించే రసాయనాలు ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం వీటిలో ఉండే ఆక్సీబెంజోన్, ఆక్టోక్రిలిన్, సిన్నమేట్స్, బెంజోఫెనోన్స్ చర్మాన్ని చికాకుకు గురి చేసి మంట కలిగిస్తాయి. దీన్ని ఫొటో అలర్జీ లేదా ఫొటో కాంటాక్ట్ డెర్మటైటిస్ అని కూడా అంటారు.
2. కంటి సమస్యలు
చాలా మందికి సన్ స్క్రీన్ లోషన్లు రాసుకున్న వెంటనే కళ్లు మండుతుంటాయి. ఏదో కుట్టినట్టుగా అనిపిస్తూ కళ్లలో నీరు కారుతుంటాయి. ఇది సాధారణమే అనుకుని తీసిపాడేయద్దు. ఇది నెమ్మదిగా మీ కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
3. మొటిమలు
సూర్మరశ్మి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మీరు రాసుకునే క్రీములు మీ మొహంపై మొటిమలను పెంచుతాయని మీకు తెలుసా? ఎప్పుడూ గమనించి ఉండరు కదా! అవును వీటిలో ఉండే ఆక్సీబెంజోన్, ఆక్టోక్రిలిన్, సిన్నమేట్స్, బెంజోఫెనోన్స్ మొటిమల సమస్యను పెంచుతాయట. కాబట్టి జిడ్డు చర్మం, మొటిమలు కలిగి ఉన్నవారు సన్ స్క్రీన్ లోషన్లను రాసుకోకపోవడమే మంచిదని నిపుణుల సలహా.
4. వయసుకు మించి!
సన్ స్క్రీన్ లోషన్లను రెగ్యులర్ గా వాడే వారి చర్మ మందంగా తయారవుతుంది. అలాగే చర్మంలోని నీటి శాతం, స్థితి స్తాపకత తగ్గిపోయి సాగిపోయినట్లు కనిపిస్తుంది. దీని వల్ల మీరు వయసుకు మించి ముదురిపోయినట్లు కనిపిస్తారు.
5. క్యాన్సర్
చాలా రకాల సౌందర్య క్రీముల్లో ఉండే బెంజోఫెనోన్-3, ఆక్సీబెంజోన్ అనే రసాయనాలు మీ శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతాయి. ఇది క్షీర గ్రంథి అభివృద్ధికి కారణముతుంది. శరీరంలోని ముఖ్యమైన హార్మోన్లపై హానికరమైన ప్రభావం చూపుతుంది. ఈ రసాయనాలు కలిగి ఉండే సన్ స్క్రీన్ క్రీములను తరచుగా వాడటం వల్ల రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
6. కుదుళ్లలో చీము
సన్ స్క్రీన్ లోషన్ల వల్ల కలిగే ఇంకో దుష్ప్రభావం ఏంటంటే? వీటి రసాయనాలు చర్మం లోతుల్లోకి వెళ్తే వెంట్రుకలు ఉన్న చోట మంట, చికాకు కలుగుతాయి. అలాగే ఈ లోషన్ తెరుచుకుని ఉన్న వెంట్రుకల కుదుళ్లలోకి వెళ్ళి వాటిని దెబ్బతీస్తుంది. ఫలితంగా కుదుళ్లలో చీము కారుతుంటుంది.
అర్థరాత్రి మేలుకుంటున్నారా? మళ్లీ నిద్రపట్టడం లేదా? ఈ '7' టిప్స్ పాటించి చూడండి!
అశ్వగంధతో మగవారికి ఇన్ని ప్రయోజనాలా! ఈ 10 తెలిస్తే ఇప్పుడే స్టార్ట్ చేస్తారు!!