ETV Bharat / health

అలర్ట్ : మీరు తరచుగా హెయిర్​కు హెన్నా యూజ్ చేస్తున్నారా? - అయితే, ఈ సమస్యలు తప్పవు! - Mehendi Side Effects on Hair - MEHENDI SIDE EFFECTS ON HAIR

Mehendi Side Effects : ప్రస్తుత రోజుల్లో చాలా మంది చిన్న ఏజ్​లోనే తెల్లజుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో దానిని కవర్ చేసేందుకు హెన్నా యూజ్ చేస్తుంటారు. ఇక, మీరు కూడా అలాగే హెయిర్​కు మెహందీ అప్లై చేస్తున్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

HENNA
Mehendi Side Effects
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 12:06 PM IST

Updated : Apr 2, 2024, 12:16 PM IST

Side Effects of Mehendi Using on Hair : సాధారణంగా వయసు పైబడే కొద్దీ జుట్టు నెరవడం, తెల్లగా మారడం సహజం. కానీ, ఈరోజుల్లో మారిన జీవనశైలి కారణంగా చాలా మందిలో చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. దీంతో దానిని కవర్ చేయడానికి జుట్టుకు రంగు వేస్తుంటారు కొందరు. ఇందుకోసం మెహందీ, డైలను యూజ్ చేస్తుంటారు. సాధారణంగా మెహందీని 'హెన్నా' అని కూడా పిలుస్తారు. ఇదిలా ఉంటే.. మీరు కూడా జుట్టుకు(Hair) హెన్నా యూజ్ చేస్తున్నారా? అయితే, ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. జుట్టుకు మెహందీని అప్లై చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ, ప్రత్యేకించి దానిని తరచుగా యూజ్ చేయడం, ఎక్కువ సేపు ఉంచడం వల్ల అది కొన్నిసార్లు హానికరంగా మారవచ్చని సూచిస్తున్నారు నిపుణులు. ఇంతకీ, జుట్టుకు హెన్నా యూజ్ చేయడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అలెర్జీ ప్రతిచర్యలు : మీరు జుట్టుకు మెహందీని అప్లై చేయడం వల్ల కొందరిలో అలెర్జీ ప్రతిచర్యలకు దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఈ కారణంగా దురద, ఎరుపు, వాపు, నెత్తిమీద లేదా చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. ఇది తీవ్రమైన సందర్భాల్లో కాంటాక్ట్ డెర్మటైటిస్‌కు దారితీయవచ్చంటున్నాు నిపుణులు. కాబట్టి, మీరు హెన్నాను యూజ్ చేసే ముందు అలాంటి సమస్యలకు గురికాకుండా ఉండాలంటే ప్యాచ్ టెస్ట్ చేయించుకోవడం మంచిదని చెబుతున్నారు.

పొడి, పెళుసు జుట్టు : మీరు హెన్నాను తరచుగా ఉపయోగించినట్లయితే లేదా ఎక్కువ కాలం ఉంచినట్లయితే అది జుట్టు పొడిగా మారడానికి లేదా పెళుసుదనానికి దారితీయవచ్చంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. మెహెందీలోని డై మాలిక్యూల్స్ హెయిర్ షాఫ్ట్‌లోని కెరాటిన్‌కు కట్టుబడి సహజ నూనెలు, తేమను సమర్థవంతంగా తొలగిస్తాయి. ఫలితంగా జుట్టు గరుకుగా, గడ్డిలాగా, విరిగిపోయే అవకాశం ఉంటుందంటున్నారు. కాబట్టి, హెన్నాను యూజ్ చేసేటప్పుడు డీప్ కండిషనింగ్ లేదా ఆయిల్ ట్రీట్‌మెంట్‌లతో అనుసరించడం చాలా అవసరమంటున్నారు నిపుణులు.

2012లో 'ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. హెన్నా తరచుగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిగా మారవచ్చని కనుగొన్నారు. ఈ పరిశోధనలో పాల్గొన్న నైజీరియాలోని 'లాగోస్ యూనివర్సిటీ టీచింగ్ హాస్పిటల్‌' చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్. మోనికా మిస్తా హెన్నా తరచుగా యూజ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పొడిగా, పెళుసుగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు.

రంగుపై ప్రభావం : మీరు తరచుగా హెన్నా యూజ్ చేయడం జుట్టు సహజ రంగుపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఎందుకంటే మెహందీకి రంగు మార్చే గుణం ఉంటుంది. దీని కారణంగా మీ జుట్టు రంగు కోల్పోయి పాడైపోయే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, మీరు హెన్నా యూజ్ చేసే ముందు ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

30 ఏళ్లకే తెల్ల జుట్టు రావడానికి కారణాలివే - వెంటనే ఇలా చేయండి! - Premature Gray Hair Causes

స్కాల్ప్ ఇరిటేషన్ : కొంతమందిలో మెహందీని జుట్టుకు అప్లై చేసిన తర్వాత నెత్తిమీద చికాకు లేదా అసౌకర్యాన్ని కలిగించవచ్చంటున్నారు నిపుణులు. ఇది నెత్తిమీద దురద, మంట లేదా ఎరుపుగా కనిపించవచ్చని చెబుతున్నారు. కాబట్టి, ఈ సమస్య తలెత్తకుండా ఉండాలంటే మెహెందీని ఎక్కువసేపు అలాగే ఉంచకుండా చూసుకోవాలి. అలాగే.. అప్లై చేసిన తర్వాత పూర్తిగా కడుక్కోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు.

జుట్టు ఆకృతి మారుతుంది : హెయిర్​కు మెహందీని ఉపయోగించడం వల్ల కాలక్రమేణా జుట్టు ఆకృతిలో మార్పులు కూడా సంభవించవచ్చంటున్నారు నిపుణులు. కొందరిలో హెన్నా సాధారణ ఉపయోగంతో వారి జుట్టు ముతకగా లేదా గరుకుగా మారడాన్ని మీరు గమనించవచ్చంటున్నారు. వెంట్రుకలపై మెహెందీ ఎండబెట్టడం లేదా వెంట్రుక షాఫ్ట్‌లో రంగుల అణువులు పేరుకుపోవడం కారణంగా జుట్టు ఆకృతిలో మార్పులు రావొచ్చంటున్నారు. కాబట్టి.. జుట్టు ఆకృతిని సంరక్షించడానికి, డీప్ కండిషనింగ్, మాయిశ్చరైజింగ్ వంటివి ఫాలో అవ్వడం చాలా అవసరమనే విషయాన్ని గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

గంజిని వేస్ట్​గా పారబోస్తున్నారా? మీ జుట్టుకు ఇలా వాడి చూడండి- హెయిర్​ సేఫ్​! - Hair Growth With Rice Water

Last Updated : Apr 2, 2024, 12:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.