Hair Perfumes Can Cause Health Risks : కొందరు పార్టీలకు వెళ్తే.. ఇంకొందరు ఫంక్షన్లకు వెళ్తే.. మరికొందరు ఇంటి నుంచి అడుగు బయట పెడితే.. హెయిర్ ఫెర్ఫ్యూమ్స్‌ని తెగ వాడేస్తుంటారు. నలుగురిలో తామే స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలవాలని ఆరాటపడుతుంటారు. మీక్కూడా ఇలాంటి హెయిర్ ప్రొడక్ట్స్ వాడే అలవాటు ఉందా? అయితే.. మీరు అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. వాటిని యూజ్ చేయడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచికాదని, ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పరిమళాలు వెదజల్లే హెయిర్ పెర్ఫ్యూమ్స్ ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ అందించినప్పటికీ.. ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావంటున్నారు నిపుణులు. వీటిల్లో ఇథైల్ ఆల్కహాల్, భారీ సింథటిక్ సువాసనలతోపాటు పలు రసాయనాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. వీటి వల్ల స్కాల్ఫ్ డ్యామేజ్ అవుతుందని చెబుతున్నారు. పొడిబారినట్లుగా మారుతుందంటున్నారు.
దీంతోపాటు అవి జుట్టు(Hair) ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. హెయిర్ పెర్ఫ్యూమ్స్లో ఉండే ఆల్కహాల్ జుట్టులోని సహజ నూనెలను దెబ్బతీసి.. వెంట్రుకలను పొడిగా, పెళుసుగా మారుస్తాయంటున్నారు. దాంతో జుట్టు చివర్లు ఎక్కువగా చిట్లిపోయి.. నిర్జీవంగా మారిపోతాయని చెబుతున్నారు. అలాగే.. జుట్టు రాలే సమస్య పెరుగుతుందని అంటున్నారు. కాబట్టి.. సాధ్యమైనంత వరకూ హెయిర్ పెర్ఫ్యూమ్స్కు దూరంగా ఉండడం మంచిదంటున్నారు. అందుకు బదులుగా కొన్ని సహజసిద్ధమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు.
మీ బ్యూటీ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేసుకుంటున్నారా? - ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ గ్యారెంటీ!
2021లో 'జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ అండ్ థెరప్యూటిక్స్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. హెయిర్ పెర్ఫ్యూమ్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అందులోని కొన్ని రసాయనాలు జుట్టు కణాలను బలహీనపరిచి, జుట్టు రాలడాన్ని పెంచుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ జాన్ స్మిత్ పాల్గొన్నారు. హెయిర్ పెర్ఫ్యూమ్స్ అధికంగా వాడడం వల్ల అందులోని రసాయనాలను జుట్టు రాలే సమస్యను పెంచుతాయని ఆయన పేర్కొన్నారు.
కొన్ని సహజసిద్ధమైన ప్రత్యామ్నాయ మార్గాలు :
- హెయిర్ ఫెర్ఫ్యూమ్‌కు బదులుగా ఎసెన్షియల్ ఆయిల్స్ యూజ్ చేయడం మంచిదంటున్నారు నిపుణులు. ఇందుకోసం లావెండర్, రోజ్‌మేరీ లేదా చమోమిలే వంటి వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని దాన్ని కాస్త వాటర్‌లో కలుపుకొని జుట్టుపై స్ప్రేగా యూజ్ చేయండం మంచిదని చెబుతున్నారు. ఇవి వెంట్రుకలకు సహజమైన నూనెలను అందించడమే కాకుండా.. ఆహ్లాదభరితమైన సువాసనను కూడా అందిస్తాయంటున్నారు.
- అదేవిధంగా నారింజ లేదా నిమ్మ వంటి సిట్రస్ తొక్కలతో తయారు చేసిన నీటిని ఉపయోగించినా.. జుట్టు ఆరోగ్యానికి మేలు జరుగుతుందంటున్నారు.
- అయితే.. ఎలాంటి ఫెర్ఫ్యూమ్ అయినా ఎక్కువ మోతాదులో స్ప్రే చేయకపోవడమే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.