Eating Curd At Night : చాలా మందికి భోజనంలో ఎన్ని రకాల వంటకాలు, సైడ్ డిష్‌లు ఉన్నా సరే లాస్ట్‌కు కొద్దిగా పెరుగుతో తింటేనే భోజనం తిన్నామన్న తృప్తి ఉంటుంది. ఇక రోజువారీ ఆహారంలో పాలు, పాల పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు అందరికీ తెలిసినవే. అయితే సాధారణంగా చాలా మంది మధ్యాహ్నా భోజనంలో పెరుగును తీసుకుంటే.. మరికొందరు రాత్రి పూట తింటారు. అయితే రాత్రి సమయంలో పెరుగు తినొచ్చా..? లేదా..? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఈ ప్రశ్నకు ఆయుర్వేద నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం..
పెరుగులో పోషకాలు ఫుల్: పెరుగులో అనేక ఆరోగ్యప్రయోజనాలు దాగున్నాయి. కాబట్టి పాలు అంటే ఇష్టపడని వాళ్లు కనీసం పెరుగైనా డైట్ లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే.. ఇందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి మంచిది. ప్రస్తుతమున్న ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల.. మంచి బ్యాక్టీరియాని కోల్పోతున్నాం. కాబట్టి ఇది పుష్కలంగా లభించే.. పెరుగుని డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. అంతేకాకుండా పెరుగులో కండరాల పెరుగుదలకు అవసరమయ్యే ప్రొటీన్, ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన కాల్షియం, శక్తి ఉత్పత్తి, జీర్ణక్రియకు సహాయపడే విటమిన్ బి2, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్ బి12, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే పొటాషియం, లాక్టిక్ ఆమ్లం, ప్రోబయోటిక్స్ వంటివి చాలానే ఉన్నాయి.
రాత్రి సమయంలో పెరుగు తింటే ఏం జరుగుతుంది:
- రాత్రిపూట పెరుగు తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో కొవ్వు పెరిగేలా చేస్తుందని అంటున్నారు. అందుకే అధిక బరువుతో బాధపడుతున్నవారు పెరుగు తినకుండా ఉండాలని సూచిస్తున్నారు. వీలైతే, మజ్జిగ తాగొచ్చని తెలియజేస్తున్నారు. అలాగే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారు పెరుగుకు దూరంగా ఉండటమే మంచిదని అంటున్నారు.
- జలుబు, దగ్గుతో బాధపడేవాళ్లు, అలర్జీ ఉన్న వాళ్లు మాత్రం రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీనిని పలు అధ్యయనాలు కూడా ధృవీకరించాయి. ఎందుకంటే.. పెరుగు కఫంకి కారణమవుతుందని.. అందువల్ల రాత్రిపూట పెరుగు తీసుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.
- జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉన్నవారు రాత్రిపూట పెరుగు తినకూడదు. అలాగే తరచుగా అసిడిటీ, అజీర్ణం లేదా యాసిడ్ రిఫ్లక్స్‌తో బాధపడుతుంటే, మీ జీర్ణక్రియ నెమ్మదిగా ఉన్నప్పుడు పెరుగు తినడం మానేయాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో అసలు తినొద్దని సూచిస్తున్నారు.
షుగర్ ఉన్నవారు పెరుగు, సాల్ట్ తీసుకుంటే ఏమవుతుంది? - ఆయుర్వేద నిపుణులేమంటున్నారు?
పెరుగు Vs మజ్జిగ - ఏది ఆరోగ్యానికి మంచిది?
What Is Probiotic : ప్రోబయోటిక్స్ అంటే ఏమిటి?.. వీటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?