ETV Bharat / health

బీర్ తాగడం వల్ల బరువు పెరుగుతారా? - పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి! - Side Effects Of Beer - SIDE EFFECTS OF BEER

Side Effects Of Beer : ఈరోజుల్లో 'ఆల్కహాల్ సేవించడం' ఎంజాయ్​మెంట్​కి పర్యాయపదంగా, కల్చర్​లో ఒక భాగంగా మారిపోయింది. ముఖ్యంగా నేటి యువత బీరు తాగడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే చాలా మందికి వచ్చే డౌట్​ ఏంటంటే.. బీరు తాగితే బరువు పెరుగుతారా? మరి దీనికి నిపుణుల సమాధానమేంటో ఈ స్టోరీలో చూద్దాం..

Can Drinking Beer Cause Weight Gain
Side Effects Of Beer (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 25, 2024, 9:48 AM IST

Can Drinking Beer Cause Weight Gain? : బీరు.. నేటి జనరేషన్ యువత ఎక్కువగా ఇష్టపడే ఆల్కహాలిక్ పానీయాల్లో ఒకటి. ఇంటికి బంధువు వచ్చినా.. ఫ్రెండ్ కలిసినా.. ఆనందంలో ఉన్నా.. విషాదంలో ఉన్నా.. ఇలా సందర్భమేదైనా బీరు పొంగాల్సిందే. అయితే, చాలా మందికి బీరు(Beer) తాగితే బరువు పెరుగుతారా అనే సందేహం వస్తుంది. మరి ఇందులో నిజమెంత? దీనిపై వైద్య నిపుణులు ఏం అంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

'బీరు తాగితే బరువు పెరుగుతారా?' అనే ప్రశ్నకు వైద్య నిపుణులు ఈ విధంగా సమాధానం ఇస్తున్నారు. అన్ని ఆల్కహాలిక్ పానీయాల మాదిరిగానే బీర్లలో కేలరీలు ఉంటాయంటున్నారు. ముఖ్యంగా కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఆల్కహాల్ కంటెంట్ ఉంటాయి. అయితే, బీర్లలో ఆల్కహాల్ కంటెంట్ అనేది దానిలో వాడే పదార్థాలు, బ్రూయింగ్ ప్రక్రియ వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. దీన్ని బట్టి బీర్​లో కేలరీల శాతం మారుతూ ఉంటుందని సూచిస్తున్నారు.

సాధారణంగా 355ml ఉండే బీర్​లో దాదాపు 150 కేలరీలు ఉండవచ్చని చెబుతున్నారు. అయితే, ఇది క్రాఫ్ట్ బీర్లు, స్టౌట్‌లలో మరింత ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుందంటున్నారు. కాబట్టి, బీర్ మితంగా తాగితే ప్రమాదం లేదంటున్నారు నిపుణులు. అలాగే మితమైన బీర్ వినియోగం నేరుగా బరువు పెరగడానికి దారితీయకపోవచ్చంటున్నారు. అలాకాకుండా బీర్ అధికంగా తీసుకుంటే మాత్రం ఆరోగ్యానికి మంచి కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరగడానికి దోహదం చేస్తుంది. ఫలితంగా ఇది కాలక్రమేణా బరువు పెరగడానికి దారి తీస్తుందని చెబుతున్నారు.

బీరు తాగితే కిడ్నీ స్టోన్స్ బయటకు వచ్చేస్తాయా? - ఇందులో నిజమెంత? - నిపుణుల సమాధానమిదే!

అంతేకాకుండా.. బీర్​తో సహా అధిక ఆల్కహాల్ వినియోగం ఊబకాయం ప్రమాదాన్ని పెంచుతుందని పలు పరిశోధనల్లో కూడా వెల్లడైంది. ​ఎందుకంటే.. ఆల్కహాల్ అనేది శరీరంలో వివిధ జీవక్రియ ప్రక్రియలకు అంతరాయం కలిగించి బరువు పెరగడానికి దారితీస్తుందట. ముఖ్యంగా ఇది బెల్లీ ప్యాట్ పెరగడానికి కారణమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే.. బీర్​తో సహా అన్ని ఆల్కహాలిక్ పానీయాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు.

2024లో "జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ"లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. అధికంగా బీరు తాగే వ్యక్తులు.. తాగని వారి కంటే బరువు పెరగడానికి ఎక్కువ అవకాశం ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కెనడాలోని మౌంట్ సినాయ్ ఆసుపత్రిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ డాక్టర్ ఎమ్మా హోప్‌క్రాఫ్ట్ పాల్గొన్నారు. బీరు తాగడం వల్ల అందులోని అధిక కేలరీలు బరువు పెరగడానికి కారణమవుతాయని వారు పేర్కొన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మందు తాగాక వాంతులు అయ్యేది ఇందుకే! - పరిశోధనలో ఆశ్చర్యపోయే విషయాలు వెల్లడి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.