ETV Bharat / health

అలర్ట్ : ఇలా చేయకపోతే - వక్షోజాలు సాగిపోయే అవకాశం ఎక్కువట! - Sagging Breasts Causes

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 5, 2024, 10:34 AM IST

Reason Of Sagging Breasts : వయసు పైబడుతున్న కొద్దీ మహిళల శరీరంలో ఎన్నో మార్పులు వస్తుంటాయి. ఈ మార్పులలో రొమ్ములు సాగిపోవడం కూడా ఒకటి. అయితే.. ఇలా వక్షోజాలు జారిపోవడానికి కారణాలు ఏంటో చాలా మందికి తెలియదు. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా?

Sagging Breasts
Reason Of Sagging Breasts (ETV Bharat)

Sagging Breasts Causes : మహిళలందరూ తమ వక్షోజాలు మంచి ఆకృతిలో, బిగుతుగా ఉండాలని కోరుకుంటారు. కానీ, కొంతమందిలో చిన్నవయసులోనే రొమ్ములు సాగిపోతుంటాయి. అయితే, బ్రెస్ట్ సాగిపోవడానికి కారణాలు ఏంటో ఎక్కువ మందికి తెలియదు. ఇలా బ్రెస్ట్​ సాగడానికి కారణాలు ఏంటి? సాగకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో హైదరాబాద్​కు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్​ డాక్టర్​ సాహిత్య చెబుతున్నారు ఆ వివరాలు మీ కోసం..

రొమ్ములు సాగడం ఏ వయసులో ప్రారంభమవుతుందో కరెక్ట్​గా చెప్పలేమని డాక్టర్ చెబుతున్నారు. కొంతమందిలో 20 ఏళ్ల వయసులోనే అలా జరగవచ్చని.. మరికొంతమందిలో 40 ఏళ్లు వచ్చినా బిగువు సడలకపోవచ్చని అంటున్నారు. దీనికి చాలా కారణాలు ఉంటాయని చెబుతున్నారు.

రొమ్ములు సాగిపోవడానికి ప్రధాన కారణాలు :

  • వయసు పైబడుతున్నకొద్దీ రొమ్ములు జారిపోవడమనేది సహజంగానే జరుగుతుంది. అయితే, ఊబకాయం వల్ల రొమ్ముల సైజ్​ పెరిగి అవి జారిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • అధిక బరువుతోపాటు చిన్నప్పటి నుంచి రొమ్ములు పెద్దవిగా ఉన్నవారిలో కూడా త్వరగా సాగిపోతుంటాయి.
  • రొమ్ములు పెద్దగా ఉన్నవారు ఎక్సర్​సైజ్​లు చేసేటప్పుడు బ్రా వేసుకోకపోవడం వల్ల అవి సాగిపోయే అవకాశం ఉంటుంది.
  • కాన్పుల సంఖ్య పెరిగేకొద్దీ సహజంగానే రొమ్ములు సాగిపోతుంటాయి.
  • కొంతమందిలో వంశపారంపర్యంగా కూడా రొమ్ములు సాగిపోతాయి.
  • గుండ్రంగా, చిన్నగా ఉన్న రొమ్ముల ఆకృతి ఎక్కువ కాలం నిలిచి ఉంటుంది. అలా కాకుండా పెద్దవిగా, ఇరుకుగా ఉన్న రొమ్ములు త్వరగా జారిపోతాయి.
  • కొంత మంది సాగిపోయినా రొమ్ములు తిరిగి బిగుతుగా మారతాయని ఏవేవో క్రీమ్​లు, ట్యాబ్లెట్స్​ వాడుతుంటారు. కానీ, ఒక్కసారి రొమ్ములు సాగిపోయిన తర్వాత అవి బిగుతుగా మారే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని డాక్టర్​ సాహిత్య అంటున్నారు.

బిగుతుగా ఉండడానికి ఇలా చేయండి :

  • రొమ్ములు జారిపోవడానికి చాలా కారణాలు ఉండడం వల్ల దాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా సాధ్యమైనంత వరకు సాగిపోకుండా కాపాడుకోవచ్చు.
  • ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండి.. దాని స్థితిస్థాపకతను కోల్పోదు.
  • అలాగే ఆరోగ్యకరమైన బరువును కొనసాగించినట్లైతే రొమ్ముల ఆకృతిని కాపాడుకోవచ్చు.
  • కొంతమంది బ్రా వేసుకోవడం వల్ల రొమ్ములు సాగిపోవని అనుకుంటుంటారు. కానీ, ఇది కేవలం అపోహ మాత్రమే. బ్రా వేసుకోవడం వల్ల రొమ్ములు జారిపోయినట్లు కనిపించకుండా కొంతమేరకు దాచవచ్చు. కానీ, జారిపోకుండా చేయడం కుదరదని వైద్యులు చెబుతున్నారు.

ఉదయాన్నే వ్యాయామాలు చేసే మహిళలు తప్పకుండా బ్రా లేదా బ్రెస్ట్​ సపోర్టర్లను ధరించాలి. అలాగే అధికబరువున్న వారు ఒక్కసారిగా బరువు తగ్గడం చేయకూడదు. సడన్​గా బరువు పెరిగినా లేదా తగ్గినా కూడా రొమ్ములు జారిపోయే అవకాశం ఉంటుంది. - డాక్టర్​ సాహిత్య

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

రొమ్ము క్యాన్సర్ బారిన పడొద్దంటే - ఇవి తినాల్సిందే!

అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా? తిన్నాక ఈ డ్రింక్స్​ తాగితే ఈజీగా వెయిట్​లాస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.