ETV Bharat / health

రోజ్​ వాటర్​ను డైలీ వాడుతున్నారా? ఎన్ని ప్రయోజనాలో తెలుసా? - BENEFITS OF ROSE WATER

Rose Water Benefits For Skin : మామూలుగా మీరు ముఖానికి రోజ్ వాటర్ రాసుకుంటూ ఉంటారు. దీన్ని తరచూ వాడటం వల్ల చర్మంలో వచ్చే మార్పులు ఏంటి? టోనర్ల నుంచి వంటకాల వరకూ రోజ్ వాటర్ చేసే అద్భుతాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Rose Water Benefits For Skin
Rose Water Benefits For Skin (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 2:47 PM IST

Rose Water Benefits For Skin : చర్మ సంరక్షణ కోసం తాపత్రయపడే వారికి ప్రకృతి ఇచ్చిన బహుమతి రోజ్ వాటర్. చర్మ నాణ్యతను పెంచగలగే సామర్థ్యం దీంట్లో అధిక మొత్తంలో ఉంటుంది. సున్నితమైన గులాబీ రేకుల నుంచి తయారుచేసే రోజ్ వాటర్ సహజ సౌందర్యాన్ని పెంపొందించి చర్మం యవ్వనంగా, ప్రకాశవంతంగా తయారయేలా చేస్తుందని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. మార్కెట్లో దొరికే చాలా రకాల సౌందర్య సాధనాల్లో, సుగంధ ద్రవ్యాల్లోనూ రోజ్ వాటర్​కు ప్రాముఖ్యత ఎక్కువ. హైడ్రేటింగ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నందున ఇవి దద్దుర్లు, చికాకులు వంటి వాటికి సహజ నివారణగా పనిచేస్తుంది.

మంచి సువాసన కలిగి ఉండే రోజ్ వాటర్ ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి వాటిని దూరం చేసి మానసిక స్థితిని కూడా మెరుగ్గా మార్చుతుంది. అంతేకాదు రెండు చుక్కల రోజ్ వాటర్ మీ వంటకాలకు, పానీయాలకు చక్కటి రుచిని అందించగలవు. ముఖ్యంగా స్వీట్లు, రీఫ్రెషింగ్ డ్రింక్స్​లో దీన్ని వాడితే చక్కటి రుచి, సువాసన అందుతాయి. ఇవే కాకుండా రోజ్ వాటర్​తో చర్మాన్నికి కలిగే అద్భుతమైన ప్రయోజనాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పీహెచ్ బ్యాలెన్స్!
రోజ్ వాటర్ సహజమైన టోనర్​గా పనిచేస్తుంది. చర్మ సంరక్షణకు సహాయపడే పీహెచ్ సమతుల్యతను నియంత్రణలో ఉంచుతుంది. చర్మ రంధ్రాలను బిగించి, మొటిమలను తగ్గించి, మృదువైన ఛాయను ప్రోత్సహిస్తుంది. చర్మంపై ఉండే అదనపు నూనెలు, మలినాలను తొలగించి మంచి శోషణ అందిస్తుంది.

దురద, వాపులను!
రోజ్ వాటర్​లో చర్మంపై వచ్చే వాపు, దురద వంటి వాటిని తగ్గించే లక్షణాలు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సున్నితంగా మార్చి, చికాకులకు దూరంగా ఉంచుతుంది. ముఖ్యంగా రోసేసియా, తామర వంటివి వచ్చినప్పుడు కలిగే ఎరుపు, దురద, వాపులను తగ్గిస్తాయి. చర్మాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్​గా ఉంచి, పునరుద్దరణను ప్రోత్సహిస్తుంది.

వృద్ధాప్య ఛాయలకు దూరంగా!
రోజ్ వాటర్ సహజమైన యాంటీ ఏజింగ్ సాధనంగా పనిచేస్తాయి. అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్​తో పోరాడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇది ఒత్తిడిని తగ్గించి, ముఖంపై గీతలు, ముడతలు, మచ్చలు వంటి వాటిని నయం చేస్తాయి. రోజ్ వాటర్​ను తరచుగా ఉపయోగించడం వల్ల యవ్వనమైన, శక్తివంతమైన ఛాయను పొందచ్చు.

హైడ్రేషన్
పొడిగా, నిర్జీవంగా కనిపించే చర్మం ఉన్నవారికి రోజ్ వాటర్ చక్కటి ఔషధంగా పనిచేస్తాయి. దీంట్లో హైడ్రేటింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి అవసరమైన తేమను అందించి ఆకర్షణీయంగా మార్చుతుంది. చర్మాన్ని మృదువుగా మార్చి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.

చర్మ కాంతి
రోజ్ వాటర్​లోని పునరుజ్జీవ లక్షణాలు చర్మానికి సహజమైన కాంతిని అందిస్తాయి. రక్త ప్రసరణలో సహాయపడి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. డల్ స్కిన్ ఉన్నవారు తరచుగా వాడటం వల్ల చర్మాంపై మృదువుగా ఉంటుంది. చర్మం ఎల్లప్పుడూ తాజాగా కనిపించేలా చేస్తుంది.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బాడీ టెంపరేచర్​ పెరిగిందా? హీట్​ స్ట్రోక్ కావచ్చు​! ఈ జాగ్రత్తలు పాటించకపోతే డేంజర్! - Heatstroke Warning Symptoms

'దేశంలో 25% మందికి ఊబకాయం సమస్య- ఆ వ్యాధులు వచ్చే ఛాన్స్- బీకేర్​ ఫుల్​!' - Obesity Causes OF Indians

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.