ETV Bharat / health

అలర్ట్ : ఆర్థరైటిస్​తో కంటి చూపు కోల్పోతారా? - నిపుణులు ఏమంటున్నారు! - Rheumatoid Arthritis Eye Symptoms - RHEUMATOID ARTHRITIS EYE SYMPTOMS

Rheumatoid Arthritis Eye Symptoms : కీళ్ల వాతం వ్యాధితో బాధపడే వారు ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. వీరికి కొద్ది దూరం నడవడం కూడా కష్టమవుతుంది. అయితే, దీర్ఘకాలికంగా ఈ వ్యాధితో బాధపడే వారు కంటి చూపునూ కోల్పోయే అవకాశం ఉందట!

Rheumatoid Arthritis Eye Symptoms
Rheumatoid Arthritis Eye Symptoms
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 31, 2024, 2:34 PM IST

Rheumatoid Arthritis Eye Symptoms : ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి వివిధ కారణాల వల్ల చాలా మంది రుమటాయిడ్ అర్థరైటిస్‌తో బాధడుతున్నారు. ఇది కండరాలకు సంబంధించిన ఒక వ్యాధి. ఈ సమస్య ఉన్న వారు కూర్చోవడం, నడవడం వంటి చిన్నచిన్న పనులకు కూడా కష్టపడుతుంటారు. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడ్డామంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. దీనికి పూర్తి చికిత్స ఇప్పటివరకూ అందుబాటులో లేదని అంటున్నారు. ఇది ఇలా ఉంటే, రుమాటాయిడ్‌ ఆర్థరైటిస్ వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. అలాగే వీరు వివిధ రకాల కంటి సమస్యలు ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అవి ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కీలు కీలులో నరకం.. ఇలా చేస్తే ఆర్థ్రయిటిస్‌ నుంచి ఉపశమనం!

పలు అధ్యయనాల ప్రకారం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న ప్రతి ఐదుగురిలో ఒకరికి వారి కంటి సమస్యలు ఉన్నట్లు తేలింది. వీరిలో ఎక్కువగా కనిపించే కంటి సమస్యలు

  • కంటి చూపు మసకబారడం
  • కళ్ళు ఎర్రగా మారడం
  • కళ్ళు పొడిగా, దురదగా ఉండటం
  • తీవ్రమైన కంటి నొప్పి
  • దీర్ఘకాలం ఇలాంటి లక్షణాలు కొనసాగితే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందట.
  • అందుకే ఈ వ్యాధి ఉన్న వారు తరచూ వైద్య పరీక్షలను చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పరిశోధన వివరాలు :

2018లో ప్రచురించిన 'జర్నల్ ఆఫ్ రుమటాలజీ' అధ్యయనం ప్రకారం.. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారు కంటి చూపు కోల్పోయే ప్రమాదం 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారట. ఈ పరిశోధనలో డాక్టర్. థామస్ డబ్ల్యూ. డేనియల్సన్ (Aarhus University, Denmark) పాల్గొన్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ ఉన్నవారిలో కంటి చూపు తగ్గినట్లు ఆయన పేర్కొన్నారు.

కీళ్లనొప్పులు ఉన్నవారు ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

  • నిత్యం ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఉండేలా చేసుకోవాలి.
  • విటమిన్‌ సి ఎక్కువగా ఉండే పండ్లను తినడం మంచిది. వీటివల్ల వాపు తగ్గుతుంది.
  • అలాగే ఓమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే సాల్మన్, ట్యూనా చేపలను తరచుగా తీసుకోవాలి. వీటి వల్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • వీరు డైలీ బాదం, వాల్‌నట్స్ వంటి వాటిని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
  • అలాగే తృణాధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల నొప్పుల నుంచి రిలీఫ్‌ పొందవచ్చు.
  • ప్రొటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పులను నిత్యం ఆహారంలో తీసుకోవాలి. ఇవి కీళ్లనొప్పులను తగ్గిస్తాయి.
  • కీళ్లవాతం వల్ల విపరీతమైన నొప్పులతో బాధపడేవారు ఆలివ్‌ నూనెతో మసాజ్‌ చేసుకోవడం వల్ల పెయిన్‌ తగ్గిపోతుందట.
  • అలాగే వీరు మంసాహారం ఎక్కువగా తినకూడదు. వీటి వల్ల వాపు ఇంకా పెరుగుతుంది.
  • ఇంకా చక్కెర, ఉప్పు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
  • షుగర్‌ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్ తాగకూడదు.
  • మద్యం సేవించడం వల్ల వాపు పెరుగుతుంది. కాబట్టి, మద్యం తాగడం తగ్గించాలని నిపుణులు పేర్కొన్నారు.

NOTE : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కీళ్లవాతంతో బాధపడుతున్నారా? - ఇలా చేస్తే ఫుల్ రిలీఫ్!

కీళ్లవాతాన్ని విటమిన్‌ డి తగ్గిస్తుందా ? నిపుణులు ఏమంటున్నారు ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.