ETV Bharat / health

సూపర్​ న్యూస్​: వర్షాకాలంలో జలుబు, తుమ్ములు తగ్గాలంటే - ఈ టిప్స్​ పాటించండి! - Home Remedies to Get Rid from Cold - HOME REMEDIES TO GET RID FROM COLD

Monsoon Health Tips : వర్షాకాలంలో ఎక్కువ మంది జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటి వారు ఇంట్లోనే కొన్ని సింపుల్‌ టిప్స్‌ పాటించడం వల్ల ఈ సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఇప్పుడు చూద్దాం.

Health Tips
Monsoon Health Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 1:06 PM IST

Home Remedies to Get Rid from Cold: వర్షాకాలంలో తరచు కురిసే జల్లులు, జోరు వానాలతో.. వాతావారణం ఆహ్లాదకరంగా, చల్లగా మారిపోతుంది. అయితే వాతావరణం మారగానే.. చాలా మంది జలుబు, తుమ్ములు, గొంతు నొప్పి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. వెంటనే డాక్టర్ల దగ్గరకు పరుగులు తీస్తారు. అయితే, ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా.. ఈ టిప్స్​ పాటిస్తే సేఫ్​గా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ఆ చిట్కాలు మీ కోసం..

తులసి ఆకులు, నల్ల మిరియాల పొడి : తులసి ఆకులు వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాబట్టి ఒక కప్పు నీళ్లలో కొన్ని తులసి ఆకులు, నల్ల మిరియాల పొడి వేసుకుని బాగా మరిగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ నీటిని తాగడం వల్ల జలుబు, తుమ్ములు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

శరీరం చెమట కంపు కొడుతోందా? - వాడాల్సింది సెంటు కాదు..!

గోరువెచ్చని పాలు: వర్షాకాలంలో జలుబు, తుమ్ములు వంటి ఇతర సమస్యలతో బాధపడుతుంటే.. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే సమస్యలు పరారవుతాయని అంటున్నారు. పసుపులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఈ లక్షణాలను తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.

ఆవిరి పట్టడం : ఎక్కువ మందికి వర్షంలో తడవగానే తుమ్ములు వస్తుంటాయి. ఆపై జలుబు స్టార్ట్​ అవుతుంది. కాబట్టి, జలుబు చేసినప్పుడు ఆందోళన చెందకుండా ఆవిరి పట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మరిగే నీటిలో చిటికెడు పసుపు వేసుకుని ఆవిరి పడితే మంచి ప్రయోజనం ఉంటుందని.. అలాగే తలనొప్పి కూడా తగ్గుతుందని అంటున్నారు.

2010లో చైనా జర్నల్​ ఆఫ్​ నర్సింగ్​లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం ఆవిరి పట్టడం వల్ల జలుబు, తుమ్ములు వంటివి తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని నాన్జింగ్​ మెడికల్​ యూనివర్సిటీలో శ్వాసకోశ వైద్య నిపుణుడు "డాక్టర్​ X. Wang" పాల్గొన్నారు.

వర్షాకాలంలో ఇంటి నిండా ఈగలు చిరాకు పెడుతున్నాయా? - ఇలా చేస్తే ఒక్కటి కూడా ఉండదు!

అల్లం రసం, తేనె : జలుబు, తుమ్ములు, గొంతు సంబంధిత సమస్యలతో బాధపడేవారు.. సరిపాళ్లలో అల్లం రసం, తేనె కలుపుకుని తాగడం వల్ల ఉపశమనం పొందవచ్చంటున్నారు. అల్లంలోని ఔషధ గుణాలు త్వరగా ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందని అంటున్నారు.

గోరువెచ్చని నీళ్లు : వర్షాకాలంలో చాలా మంది గొంతు నొప్పితో బాధపడుతుంటారు. ఇలాంటప్పుడు గోరువెచ్చని నీళ్లలో ఉప్పు వేసుకుని.. ఆ నీటితో పుక్కిలిస్తే.. గొంతు ఇన్ఫెక్షన్‌లు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

డ్రాగన్ ఫ్రూట్ మంచిదేనా? - తింటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

సూపర్ న్యూస్ : బరువు తగ్గాలంటే ఈ రొట్టె తినండి - కొవ్వును పిండేస్తుంది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.