ETV Bharat / health

మనుకా తేనెతో రొమ్ముక్యాన్సర్‌ చికిత్స- ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే..! - Manuka Honey Health Benefits

Manuka Honey Health Benefits : తేనెతో రొమ్ముక్యాన్సర్‌కు చికిత్స చేయడం ద్వారా సత్ఫలితాలు ఇస్తున్నాయంటున్నారు యూసీఎల్‌ఏ శాస్త్రవేత్తలు. రొమ్ముక్యాన్సర్‌ నివారణ, చికిత్సకు ఈ తేనె ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Honey Health Benefits
Honey Health Benefits (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Sep 23, 2024, 2:21 PM IST

Manuka Honey Health Benefits : మాములుగా అయితే తేనెటీగలు వివిధ రకాల పూల నుంచి మకరందాన్ని సేకరించి తేనెను తయారుచేస్తాయి. కానీ, మనుకా తేనె అలాకాదు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఆగ్నేయాసియా ప్రాంతంలో పెరిగే ఒక టీ ట్రీ (లెప్టోస్పెర్మమ్‌ స్కోపేరియం) పువ్వుల మకరందాన్ని మాత్రమే సేకరించి ఈ రకం తేనెను తయారుచేస్తాయి. ఇది కొంత జిడ్డుగా ఉంటుంది. అయితే, దీనికి రొమ్ముక్యాన్సర్​ను నివారించే ఔషధ గుణాలున్నాయంటున్నారు పరిశోధకులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

రొమ్ముక్యాన్సర్‌ నివారణకు తేనె : మనుకా తేనెలో యాంటీబ్యాక్టీరియా, యాంటీఆక్సిడెంట్‌ గుణాలను ఉన్నట్లు తాజాగా నిర్వహించిన అధ్యయనాల్లో వెల్లడైంది. అంటే ఇది బ్యాక్టీరియాను నిర్మూలించటంతో పాటుగా వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్‌)నూ కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్‌ వంటి జబ్బులకు వాపు ప్రక్రియే బీజం వేస్తుండటం గమనార్హం. తాజాగా మనుకా తేనె రొమ్ముక్యాన్సర్‌ నివారణ, చికిత్సకు తోడ్పడగలదని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలిస్‌ (యూసీఎల్‌ఏ) నిర్వహించిన ప్రాథమిక పరిశోధనల్లో తేటతెల్లమైంది. సంప్రదాయ కీమోథెరపీకి సహజ, తక్కువ విషతుల్యమైన ప్రత్యామ్నాయ చికిత్స రూపకల్పన దిశగా ఇది ఆశలు రేకెత్తిస్తోందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్‌ డయానా మార్క్వెజ్‌ గర్బన్‌ తెలిపారు. క్యాన్సర్‌ చికిత్సలో సహజ రసాయన మిశ్రమాల ప్రయోజనాలను పూర్తిగా అర్థం చేసుకోవటానికి మరింత పరిశోధనలు చేయాల్సిన అవసరముందని వెల్లడించారు. అయితే, ఈ అధ్యాయనం భవిష్యత్‌ పరిశోధనకు బలమైన పునాది వేసిందని మార్క్వెజ్‌ గర్బన్‌ అభిప్రాయపడ్డారు.

ఈఆర్‌ పాజిటివ్‌ రకమే ఎక్కువ : రొమ్ముక్యాన్సర్‌ బారిన పడుతున్నమహిళ్లలో 60% నుంచి 70% వరకూ ఈఆర్‌ పాజిటివ్‌ రకమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో క్యాన్సర్‌ కణాల్లోని గ్రాహకాలు ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ను సంగ్రహించుకొవడం ద్వారా, కణితి వృద్ధి చెందేలా చేస్తాయని వైద్యులు అంటున్నారు. ఇలాంటి రకం క్యాన్సర్‌ ఉన్నవారికి కణితి వృద్ధిని అడ్డుకోవటానికి వైద్యులు యాంటీ ఈస్ట్రోజన్‌ చికిత్స సూచిస్తుంటారు. అయితే, కొందరికి ఈ చికిత్స పనిచేయదు. దీనికి లొంగకుండా క్యాన్సర్‌ మొండిగా తయారవుతుందని వైద్యులు తెలిపారు. అలాంటి సమయంలో వారికి కీమోథెరపీ చేయక తప్పదంటున్నారు. దీంతో జుట్టు ఊడటం, నోట్లో పుండ్లు, ఆకలి తగ్గటం, అలసట, ఇన్‌ఫెక్షన్ల వంటి దుష్ప్రభావాలు తలెత్తుతుంటాయని పేర్కొంటున్నారు. మనుకా తేనెతో ఇలాంటి ఇబ్బందులు తప్పే అవకాశం ఉందని మార్క్వెజ్‌ గర్బన్‌ తెలిపారు.

ప్రయోగం ఎలా? : ఈస్ట్రోజన్‌ రిసెప్టర్‌ పాజిటివ్, ట్రిపుల్‌ నెగెటివ్‌ ( ఇందులో కణాలకు ఎలాంటి గ్రాహకాలూ ఉండవు ) అందుకోసమే పరిశోధకులు క్యాన్సర్‌ కణాలను ప్రయోగశాలలో వృద్ధి చేశారు. కొన్ని కణాలకు మనుకా తేనె, మనుకా తేనె పొడితో చికిత్సను అందించారు. మరికొన్నింటికి సంప్రదాయ చికిత్సలను కూడా పరిశీలించారు. అయితే, ట్రిపుల్‌ నెగెటివ్‌ క్యాన్సర్‌ కణాల్లో కణితిని అడ్డుకునే ప్రభావాలు అంతగా కనిపించలేదని పరిశోధకులు గుర్తించారు. యాంటీ ఈస్ట్రోజన్‌ చికిత్సలో విరివిగా వాడే టామోక్జిఫెన్‌ మందును మనుకా తేనెతో కలిపి వాడగా ఈఆర్‌ పాజిటివ్‌ రొమ్ముక్యాన్సర్‌ కణాల వ్యాప్తి గణనీయంగా తగ్గిపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. జాగ్రత్తగా ఆ కణాలను పరిశీలించగా తేనె మూలంగా రక్తంలో ఈస్ట్రోజన్‌ మోతాదులు, కణాల్లోని గ్రాహకాలు తగ్గినట్లు తెలుసుకున్నారు. అంతేకాదు, కణితి కణాలు తమకు తాముగా చనిపోయేలా ప్రేరేపితం కావటం వల్ల క్యాన్సర్‌ వృద్ధి చెందే ప్రక్రియ కూడా అస్తవ్యస్తమైందని తెలిపారు. అనంతరం ఎలుకల మీదా పరిశోధకులు అధ్యయనం చేశారు. మనుషుల ఈఆర్‌ పాజిటివ్‌ రొమ్ముకణాలను ఎలుకల్లో ప్రవేశపెట్టి, కణితి వృద్ధి చెందేలా చేశారు. తర్వాత కొన్నింటికి మనుకా తేనె తాగించారు. మామూలు ఎలుకలతో పోలిస్తే తేనె తాగిన వాటిల్లో కణితి వృద్ధి గణనీయంగా తగ్గుముఖం పట్టిందని పరిశోధకులు గుర్తించారు. ఆరోగ్య కణాలకు హాని చేయకుండా మానవ రొమ్ముక్యాన్సర్‌ కణితి వృద్ధి, వ్యాప్తి 84% వరకూ తగ్గినట్టు ఈ పరిశోధనల ద్వారా బయటపడింది.

ఎలాంటి ప్రయోజనం ఉంటుంది : మనుకా తేనె వంటి సహజ రసాయన మిశ్రమాలకు కణితిని నిలువరించే గుణమున్నట్టు పరిశోధకులు గుర్తించారు. హార్మోన్‌ రిసెప్టర్‌ పాజిటివ్‌ రొమ్ముక్యాన్సర్ల విషయంలో మరింత ప్రభావం చూపుతున్నట్టు అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయి. మున్ముందు అనుబంధ ఔషధం లేదా స్పష్టమైన ప్రత్యామ్నాయ చికిత్సగా మనుకా తేనెను అభివృద్ధి చేసే అవకాశముందని పరిశోధకులు భావిస్తున్నారు. క్యాన్సర్‌ కణాలతో పాటు ఆరోగ్యకరమైన కణాలనూ చంపే క్యాన్సర్‌ మందులకిది ప్రత్యామ్నాయం కాగలదని వైద్యులు ఆశిస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

మీ శరీరంపై ఇలాంటి కణతులు ఉన్నాయా? - వీటితో క్యాన్సర్​ ముప్పు తప్పదా! - Skin Tags Causes

మగాళ్లలో ప్రొస్టేట్ క్యాన్సర్​తో పెరుగుతున్న మరణాలు - రాకుండా ఈ గింజలు తినండి! - Best Seeds For Prostate Health

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.