ETV Bharat / health

పారాసిటమాల్ వేస్తున్నారా? అయితే, మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే! - PARACETAMOL SIDE EFFECTS ON HEALTH

-పారాసిటమాల్ వాడకంతో అనేక రోగాలు వస్తాయట! -నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడి

Paracetamol Side Effects on Health
Paracetamol Side Effects on Health (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Dec 17, 2024, 10:33 AM IST

Paracetamol Side Effects on Health: జ్వరం వచ్చిందా పారాసిటమాల్ వేసేయ్..! కాస్త తలనొప్పిగా ఉందా పారాసిటమాల్ వేసేయ్..! పెద్ద వాళ్లైతే కీళ్ల నొప్పులకు పారాసిటమాలు మాత్రనే ఎక్కువగా వాడుతుంటారు. ఇవే కాకుండా మనలో చాలా మంది ఒంట్లో కాస్త నలతగా ఉన్న పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసేస్తుంటారు. సర్వరోగ నివారిణిలా ప్రతిదానికి దీనినే ఉపయోగిస్తుంటారు. కొందరైతే ఇందుకు డాక్టర్ల ప్రిస్కెప్షన్ కూడా తీసుకోరు. నేరుగా మెడికల్ షాప్​నకు వెళ్లి పారాసిటమల్ మందులు తెచ్చుకుని వేసుకుంటారు. అచ్చం ఇలానే మీరు కూడా ఇలానే చీటికీ మాటికీ పారాసిటమాల్‌ వేసుకుంటున్నారా?

అయితే ఇకపై అలా చేయకుండా కాస్త జాగ్రత్తగా ఉండాలట. ముఖ్యంగా 65 ఏళ్లు పైబడ్డవారు మరింత అప్రమత్తంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పారాసిటమాల్ వాడకం వల్ల జీర్ణకోశం, గుండె, కిడ్నీ సమస్యల ముప్పు పెరగటానికి కారణమవుతున్నట్టు బ్రిటన్‌కు చెందిన నాటింగ్‌హామ్‌ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. "Long-term use of paracetamol and risk of kidney disease: a systematic review and meta-analysis" పేరిట బ్రిటీష్ మెడికల్ జర్నల్​లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. (రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మనలో చాలా మంది జ్వరానికి ప్రధానంగా పారాసిటమాల్‌నే వినియోగిస్తుంటారు. వృద్ధులు అయితే, కీళ్ల నొప్పులు తగ్గటానికీ వేసుకుంటుంటారు. ఇది సురక్షితమని, పెద్దగా దుష్ప్రభావాలేవీ ఉండవని అనుకుంటారు. కానీ తాజా అధ్యయన ఫలితాలు దీన్ని కొట్టిపారేస్తున్నాయి. పారాసిటమాల్‌ వాడకం వల్ల జీర్ణాశయ పుండ్ల నుంచి రక్తస్రావమయ్యే ముప్పు 24 శాతమ, పేగుల్లో రక్తస్రావమయ్యే ముప్పు 36 శాతం పెరుగుతున్నట్టు అధ్యయనంలో బయటపడింది. అలాగే కిడ్నీజబ్బులు 19 శాతం, గుండె వైఫల్యం 9 శాతం, అధిక రక్తపోటు 7 శాతం వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతున్నట్టు చెబుతోంది.

పారాసిటమాల్‌ కీళ్ల నొప్పిని అంతగా తగ్గించదని నిపుణులు చెబుతున్నారు. పారాసిటమాల్‌ ప్రభావం ఉన్నంతవరకే నొప్పి తగ్గుతుందని.. సమస్యను తగ్గించలేదని అంటున్నారు. కొద్దిగంటల్లో మందు ప్రభావం తగ్గగానే నొప్పి మళ్లీ మొదలవుతుందని వివరిస్తున్నారు. అందుకే కీళ్ల నొప్పులకు అసలు కారణమేంటన్నది తెలుసుకొని, అవసరమైన మందులు వాడితే మంచి ఫలితం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి వృద్ధుల్లో కీళ్లనొప్పుల వంటి వాటికి పారాసిటమాల్ దీర్ఘకాలం వాడటంలో జాగ్రత్తగా ఉండటం మంచిదని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెట్టొచ్చా? మూర్ఛపోతే నీటిని తాగించవచ్చా? శాశ్వత పరిష్కారం ఉందా?

మీకు మిలిటరీ స్లీప్ ట్రిక్ తెలుసా? ఇలా చేస్తే జస్ట్ రెండు నిమిషాల్లో గాఢంగా నిద్రపోతారట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.