ETV Bharat / health

ఛాయ్​ ఎంత సేపు మరిగిస్తున్నారు? - అంతకు మించితే ఆరోగ్యానికి ముప్పు తప్పదు! - Over Boiled Tea Side Effects - OVER BOILED TEA SIDE EFFECTS

Over Boiled Tea Side Effects : టీ తయారు చేయడం దాదాపుగా అందరికీ వస్తుంది. కానీ.. దాన్ని ఎంత సేపు మరిగించాలనేది మాత్రం చాలా మందికి తెలియదు! మెజారిటీ జనం చాలా ఎక్కువ సేపు చాయ్​ను పొయ్యిమీదనే ఉంచుతారు. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు!

Over Boiled Tea Not Good For Health
Over Boiled Tea Side Effects (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 30, 2024, 5:24 PM IST

Over Boiled Tea Not Good For Health : మీరు ఛాయ్​ చాలాసేపు మరిగించి తాగుతున్నారా? అయితే.. మీరు అలర్ట్ కావాల్సిందే అంటున్నారు ఆరోగ్యనిపుణులు. మరి, టీని ఎందుకు ఎక్కువసేపు మరిగించకూడదు? మరిగిస్తే ఏమవుతుంది? ఎంతసేపు మరిగించి తాగితే ఆరోగ్యానికి మంచిది? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

టీ ఎందుకు ఎక్కువగా మరిగించకూడదంటే?

టీని పాలతో కలిపి తాగడం వల్ల శరీరానికి లభించే ఎనర్జీ.. చాలాసేపు మరగబెట్టినప్పుడు నశిస్తుందట. అలాగే ఛాయ్​లో టానిన్లు అనే సహజ రసాయనాలు ఉంటాయి. టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల వాటి సాంద్రత పెరిగి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయంటున్నారు. దీనికారణంగా శరీరంలోకి చేరిన ఐరన్​ బాడీ గ్రహించలేకపోతుందట. అంతేకాదు.. మరికొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్​ కూడా వస్తాయట.

జీర్ణ సమస్యలు : టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల పెరిగిన టానిన్ల సాంద్రత జీర్ణ సమస్యలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అధిక టానిన్లు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి, వికారం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు రావొచ్చంటున్నారు.

2013లో "Nutritional Research" అనే జర్నల్​లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల జీర్ణ సమస్యలు, ఐరన్ లోపానికి దారితీస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో బీజింగ్‌లోని చైనా వైద్య విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ యువాన్ పాల్గొన్నారు. ఎక్కువసేపు టీ మరిగించడం వల్ల ఏర్పడే టానిన్లు శరీరంలో ఐరన్ శోషణను అడ్డుకుంటాయని, జీర్ణ సమస్యలు కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.

బీ అలర్ట్​: భోజనానికి ముందు, తర్వాత చాయ్​ తాగుతున్నారా?

క్యాన్సర్ ప్రమాదాన్నీ పెంచుతుందట : కొన్ని అధ్యయనాలు టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్ ప్రమాదమూ పెరుగుతుందని సూచిస్తున్నాయి. ఎందుకంటే.. ఛాయ్​ని ఎక్కువసేపు మరిగించడం వల్ల ఏర్పడే కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకాలను ప్రోత్సహిస్తాయట.

నిద్రలేమి : ఛాయ్​లో కెఫీన్ ఉంటుంది. అయితే.. టీ ఎక్కువ సేపు మరిగించినప్పుడు కెఫీన్ చేదు రుచి పెరుగుతుంది. ఫలితంగా అధిక కెఫీన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి, ఆందోళన, గుండె దడ వంటి సమస్యలు రావొచ్చంటున్నారు.

పోషకాల నష్టం : టీని ఎక్కువసేపు మరిగించడం వల్ల పాలలోని కాల్షియం, విటమిన్లు, విటమిన్ బి, బి12, సి వంటివి నశిస్తాయంటున్నారు.

యాంటీఆక్సిడెంట్ల నష్టం : ఛాయ్​లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించడంలో సహాయపడతాయి. ఎక్కువ సేపు మరిగించినప్పుడు ఇవి కూడా నాశనమవుతాయంటున్నారు నిపుణులు.

ఎంత సమయం మరిగించాలంటే? : పాలతో టీ తయారు చేసుకునేవారు ఎట్టిపరిస్థితుల్లోనూ 3 నుంచి 5 నిమిషాలకు మించకుండా మరిగించాలట! మూడు నిమిషాలు మాత్రమే సరిపోతుందని కూడా చెబుతున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

నెల రోజుల పాటు కాఫీ, టీ తాగకపోతే - మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.