Symptoms of Omega 3 Deficiency : శరీరానికి అతి ముఖ్యమైన, అత్యవసరమైన పోషకాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఒకటి. ఇవి మన శరీరంలోని జీవక్రియలు సక్రమంగా పనిచేయటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేకాదు.. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు(Omega 3 Fatty Acids) తగిన మొత్తంలో తీసుకోవడం చాలా అవసరం. అలాగే రక్తం గడ్డ కట్టే ప్రక్రియ.. రక్తనాళాల గోడల సంకోచ, వ్యాకోచాలు.. వాపు ప్రక్రియను నియంత్రించే హార్మోన్ల తయారీలోనూ తొలి వేదికగా ఉపయోగపడేవి ఇవే.
ఇలా.. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు చేసే మేలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి మీ డైలీ డైట్లో ఈ కొవ్వు ఆమ్లాలు తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. అలాకాకుండా మీ శరీరంలో ఇవి తగ్గితే వెంటనే బాడీలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయంటున్నారు. ఆ లక్షణాల ఆధారంగా మీరు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లోపంతో బాధపడుతున్నట్లు అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ, ఆ లక్షణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మీరు తరచుగా డిప్రెషన్ సమస్యతో సతమతమవుతుంటే మీలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు తక్కువగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే.. కొన్ని మానసిక సమస్యలు ఇబ్బందిపెట్టవచ్చంటున్నారు. ఇలాంటి సమస్యలు తరచుగా వేధిస్తుంటే.. మీ డైట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ ఎక్కువగా చేర్చుకోవడం ద్వారా వీటి నుంచి ఉపశమనం పొందే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు.
- 2020లో 'JAMA నెట్‌వర్క్ ఓపెన్' అనే జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినే వ్యక్తులు డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం తక్కువ అని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హోవార్డ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్. రాబర్ట్ న్యూటన్ పాల్గొన్నారు. డైలీ డైట్లో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ తగిన మొత్తంలో తీసుకోవడం ద్వారా డిప్రెషన్, ఒత్తిడి వంటి మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
సమ్మర్‌లో చెరకు రసం తాగుతున్నారా ? మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే! - Sugarcane Juice Benefits
- మీలో ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం ఉన్నట్లైతే మీ చర్మంపై కొన్ని సంకేతాలను గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇవి లోపిస్తే చర్మం పొడిబారడం, మొటిమలు, ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయంటున్నారు. అలాగే.. జుట్టు ఆరోగ్యం కూడా డ్యామేజ్ అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
- ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు. అదే.. మీరు దీర్ఘకాలంలో పొడి కళ్లు, ఇతర కంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే అది ఒమేగా - 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపం కారణంగా గుర్తించాలంటున్నారు నిపుణులు.
- ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది నిద్రలేమి, ఒత్తిడి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే, శరీరంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు లోపించినా ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు.
- కాబట్టి.. మీలో పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే డైలీ డైట్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ తగిన మొత్తంలో ఉండేలా చూసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చంటున్నారు నిపుణులు.
వీటిల్లో ఒమేగా యాసిడ్స్ పుష్కలం : ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు చేపలు, ఆలివ్ నూనె, ఫ్లాక్ సీడ్స్ (అవిసె గింజలు), వంట నూనెలు, తాజా ఆకుకూరలు వంటి ఆహారాల్లో చాలా ఎక్కువగా ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే చియా సీడ్స్, వాల్నట్లు, సోయాబీన్స్, పన్నీర్ వంటి వాటిల్లో కూడా ఈ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పీసీఓఎస్‌తో బాధపడుతున్నారా? - ఇలా చేశారంటే అంతా సెట్! - Food Guide for Pcos Women