Never Add Cold Water To Boiling Dal : సంప్రదాయ భారతీయ వంటకాల్లో పప్పు ఒకటి. ఈ పప్పుకు దాదాపుగా ప్రతి ఒక్కరూ ఫ్యానే అంటే అతిశయోక్తి కాదు. అంతలా పప్పు వంటకాన్ని జనాలు ఇష్టపడుతారు. అయితే.. పప్పును చాలా రకాలుగా వండుతారని అందరికీ తెలిసిందే. పప్పు ఉడికించే ముందు నీళ్లు పోసి ఉడికిస్తారు. అయితే.. దాదాపుగా అందరూ చల్లటి నీళ్లనే పోస్తుంటారు. కానీ.. ఇలా కూల్ వాటర్ పోయొద్దని నిపుణులు చెబుతున్నారు.
పోషకాల గని..
పప్పును పోషకాల గనిగా చెప్పుకోవచ్చు. ఇందులో అధికంగా ప్రొటీన్ ఉంటుంది. ప్రొటీన్‌తోపాటు ఫైబర్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ బి, ఫోలేట్ వంటి పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోజంతా మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులో యాంటీఆక్సిడెంట్లు, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. శాకాహారం తినే వారు పప్పు తినడం వల్ల శరీరానికి మంచి ప్రొటీన్ అందుతుంది. అలాగే ఈ వంటకంలో కొవ్వు పదార్థం ఉండదు, క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
ఒక్కో చోట ఒక్కోరకంగా :
దేశంలోని వివిధ ప్రాంతాలలో ఒక్కో విధంగా పప్పును తయారు చేస్తారు. గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో పప్పును వండేటప్పుడు అందులో చక్కెర కలుపుతారు. దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో పప్పును ఘాటుగా, కారంగా తినడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. పప్పు కూరల్లో చాలా రకాలుంటాయి. కొంత మంది ఆకు కూరలతో పప్పును తయారు చేసుకుంటే.. మరికొంత మంది టమాటాలతో ప్రిపేర్ చేసిన పప్పును ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
చల్లటి నీళ్లు పోస్తే ఏమవుతుంది?
పప్పు వండేటప్పుడు అందులో చల్లటి నీళ్లు పోయడం వల్ల ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీనివల్ల పప్పు ఉడకడానికి ఎక్కువ సమయం పడుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా.. కూల్ వాటర్ యాడ్ చేయడం వల్ల నురగ ఏర్పడి, పప్పు రుచి కూడా కాస్త తగ్గుతుందని తెలియజేస్తున్నారు. అందుకే.. వేడి నీటిని యాడ్ చేయాలని సూచిస్తున్నారు. దీనివల్ల పప్పు తొందరగా ఉడుకుతుందని చెబుతున్నారు. రుచికూడా తగ్గకుండా ఉంటుందని సూచిస్తున్నారు. సో.. మీరు ఈ సారి పప్పు వండేటప్పుడు తప్పకుండా ఈ టిప్ పాటించండి.
కూరలో కారం, ఉప్పు ఎక్కువైతే మీరేం చేస్తారు? - ఇలా ఈజీగా లెవల్ చేయొచ్చు!
ఈ 12 వస్తువులను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు - పెడితే ఏమవుతుందో తెలుసా?
అల్లం త్వరగా పాడవుతుందా? - ఇలా స్టోర్ చేసుకుంటే చాలా కాలం ఫ్రెష్‌గా ఉండడం పక్కా!