Neem Face Pack Benefits : చేదుగా ఉండే ఈ వేపను ఔషధాల మూలిక అంటుంటారు. ఆయుర్వేదంలో వేప చెట్టు మొదలు నుంచి ఆకుల వరకూ ప్రతి దానికి ప్రాధాన్యత ఉంది. వేపను సహజ కీటక నాశినిగా చెబుతుంటారు. ఇందులోని పోషకాలు శరీరంలోని చాలా సమస్యలను నయం చేసేందుకు సహాయపడతాయి. ముఖ్యంగా వేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ వ్యాధులు, గాయాలు, పుళ్లు లాంటి సమస్యలను దరిచేరకుండా చేస్తాయి. అందుకే ఔషధాలు, కాస్మొటిక్స్ తయారీలో వేపకు ప్రాధన్యత ఎక్కువ. ఇన్ని ప్రయోజనాలున్న వేపాకును ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ గా వేసుకున్నారా? వేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
రోజూ మనం వాడుతున్న సబ్బుల్లో, నూనెల్లో వేపాకు ఉంటుందని మనం వింటుంటాం. వాటిపై చదువుతుంటాం.అందంగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు వాటిని తెచ్చుకుని వాడుతుంటారు. కానీ మన ఇంటి ముందో, వెనకో ఉండే ఈ ఆకులతో నేరుగా ఫేస్ ప్యాక్ వేసుకుంటే ఏం అవుతుందని మీకు ఎప్పుడైనా అనుకున్నారా. అలా వేసుకోవటం వల్ల చాలా లాభలు ఉన్నాయి.
లాభాలు
వేపాకు ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. నల్లటి మచ్చలు, చర్మంపై ఉంటే ఎర్రని, సన్నని గీతలు, ముడతలు కూడా తగ్గుతాయట. ముఖ్యంగా మొటిమల సమస్య ఉన్నవారికి వేపాకు ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు, మొటిమల కారణంగా వచ్చే దురత లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం. అలాగే మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే శక్తి వేపాకుకు ఉంది. ముఖంపై మురికిని తొలగించి వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతుంది.మీ చర్మం ఎప్పుడూ మృదువుగా, మెరిసేలా ఉండంలాంటే వేపాకు ప్యాక్ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
వేపాకు ఫేస్ ప్యాక్ తయారీ విధానం : ఈ ప్యాక్ కోసం ఓ చిన్న కప్పు వేప ఆకులు, అదే కప్పులో తులసి ఆకులు, నీళ్లు చాలు.
- వేప ఆకులు , తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలి.
- ఇప్పుడు ఆ ఆకులను నీళ్లు వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి.
మీరు తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అంతా చక్కగా రుద్దుకోవాలి. కంటి కింద కూడా. అలా 20నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని ఉంచుకుని తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
వేపతో పాటు తులసిని కూడా కలిపినందువలన మీ చర్మ ఆరోగ్యం మరింత మెరుగవుతుంది. కాకపోతే మీరు ఏ ప్యాక్ అయినా మొదట మోచేయికి వేసుకుని చూడటం ఉత్తమం. ఎందుకంటే ఎంత సహజమైనవి అయినా కొంతమందిలో అలర్జీ కలిగించే అవకాశాలున్నాయి.