Adults Physical Activity Report : భారత్లో దాదాపు 50 శాతం మంది పెద్దలు మాత్రమే 2022లో తగినంత స్థాయిలో శారీరక శ్రమ చేశారని ఓ అధ్యయనంలో తేలింది. దక్షిణాసియా ప్రాంతంలోని పురుషులతో (42 శాతం) పోలిస్తే, భారత్లో ఎక్కువ మంది మహిళలు (57 శాతం) తగినంత శారీరక శ్రమ చేయలేదని ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్ జర్నల్లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. భారతీయ మహిళలు దక్షిణాసియా పురుషులతో పోలిస్తే 14 శాతం తక్కువ శారీరక శ్రమ చేశారని పేర్కొంది.
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్దల్లో మూడింట ఒక వంతు మంది (31.3 శాతం) తగినంత శారీరక శ్రమ చేయలేదు. వారానికి కనీసం 150 నిమిషాల తేలికపాటి శారీరక శ్రమ కూడా చేయలేదని అధ్యయనంలో తేలింది. వారానికి 75 నిమిషాల కఠినమైన శ్రమ కూడా చేయలేదని వెల్లడైంది.
- 2010లో ప్రపంచవ్యాప్తంగా 26.4 శాతం మంది పెద్దలు తగినంత శారీరక శ్రమ చేయలేదు. అప్పటితో పోలిస్తే 2022లో శారీరక శ్రమ చేయనివారు మరో ఐదు శాతం పెరిగారు. ఇదే విధంగా కొనసాగితే శారీరక శ్రమ చేయని పెద్దల శాతం మరో 15 శాతం పెరుగుతుంది.
- భారత్లోని పెద్దలు 2000లో 22 శాతం మంది తగినంత శారీరక శ్రమ చేశారు. 2010లో 34 శాతం మంది పెద్దలు తగినంత శారీరక శ్రమ చేయలేదు.
- ఇలాంటి పరిస్థితులే కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి శారీరక శ్రమ చేయని పెద్దలు 60 శాతానికి చేరుకునే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేశారు.
- ఈ అధ్యయనం కోసం 2000-2022 వరకు 197 దేశాల్లో ఉన్న 18 ఏళ్లకు పైబడిన వారిపై సర్వే చేసి డేటా సేకరించారు పరిశోధకులు.
- ప్రపంచవ్యాప్తంగా 60 ఏళ్లు పైబడిన పురుషులు, మహిళలు తగినంత శారీరక శ్రమ చేస్తున్నారని పరిశోధనలో తేలింది.
- తగినంత శారీరక శ్రమ చేయకపోవడం వల్ల మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధుల బారినపడే అవకాశం ఉందని పేర్కొంది.
- 2021లో భారత్లో మధుమేహంతో 101 మిలియన్ల మంది, రక్తపోటుతో 315 మిలియన్ల మంది బాధపడుతున్నారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కొన్నాళ్ల క్రితం అధ్యయనాన్ని విడుదల చేసింది. అలాగే 254 మిలియన్ల ఊబకాయం, 185 మిలియన్ల మంది చెడు కొలెస్ట్రాల్ కలిగి ఉన్నట్లు అందులో పేర్కొంది.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.