Natural Tips To Clean Greasy Vessels : ఇంట్లో వంట చేయడం ఒక టాస్క్ అయితే.. తిన్న గిన్నెలు కడగడం మరో పెద్ద టాస్క్. అందులో జిడ్డు పట్టిన పాత్రలు ఉంటే అది అతి పెద్ద టాస్క్. వీటిని కంప్లీట్ చేయలేక గృహిణులు నానా అవస్థలు పడుతుంటారు. రోటీ, దోశ, చపాతీలు చేసే ఐరన్ గిన్నెల జిడ్డును వదిలించలేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారు ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతోనే ఈజీగా వీటిని తళతళా మెరిసేలా చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఆ చిట్కాలు ఏంటో చూసేద్దాం రండి!
వెనిగర్ :
ఐర్‌న్ గిన్నెల జిడ్డును తొలగించడానికి వెనిగర్ బాగా పని చేస్తుంది. ఒక గిన్నెలో సమానంగా వాటర్, వెనిగర్ యాడ్ చేసి బాగా కలపాలి. తర్వాత జిడ్డుగా ఉన్న చపాతీ, దోశ పాన్‌లపై ఈ మిశ్రమాన్ని పోసి.. స్క్రబర్ సహాయంతో క్లీన్ చేయాలి. అంతే ఈజీగా జిడ్డు మరకలు తొలగిపోతాయి.
సింక్‌లో నీళ్లు నిలిచిపోయాయా ? ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లం సాల్వ్!
నిమ్మకాయతో :
నిమ్మకాయ వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో మనకు తెలిసిందే. అయితే.. నిమ్మకాయ ఐరన్ పాత్రల జిడ్డు తొలగించడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఒక గిన్నెలో కొద్దిగా వేడి నీళ్లు, నిమ్మరసం, డిటర్జెంట్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయాలి. తర్వాత జిడ్డు పాత్రలపై పోసి ఒక ఐదు నిమిషాల తర్వాత.. స్క్రబర్ సహాయంతో క్లీన్ చేస్తే జిడ్డు మొత్తం పోతుంది.
ఉప్పు, బేకింగ్ సోడాతో :
ఐరన్ పాత్రలను ఉపయోగించిన తర్వాత వాటి జిడ్డు తొలగించడానికి.. ముందుగా కొన్ని నీళ్లలో నాలుగు టేబుల్ స్పూన్‌ల బేకింగ్ సోడా, ఉప్పు వేసి మరిగించాలి. తర్వాత ఆ వేడి నీటిని నల్లగా మారిన పాత్రలో పోసి అరగంట సేపు ఉంచాలి. ఇప్పుడు స్క్రబర్‌తో పాత్రను క్లీన్ చేసే కొత్తదానిలా మెరిసిపోతుంది.
- ఐరన్ పాత్రలపై ఉన్న జిడ్డును తొలగించడానికి దానిపై నేరుగా వెనిగర్ పోయాలి. తర్వాత కొద్దిసేపటికి శుభ్రం చేస్తే జిడ్డు తొలగిపోయి మృదువుగా తయారవుతాయి.
- ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు సమానంగా తీసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా వెనిగర్ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జిడ్డుగా ఉన్న పాత్రపై మొత్తం అప్త్లె చేసి కొద్ది సేపు పక్కన పెట్టేయాలి. ఆ తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది వేడినీటితో శుభ్రం చేస్తే కొత్తదానిలా మెరుస్తుంది.
ఈ టిప్స్ పాటిస్తే - స్టెయిన్లెస్ స్టీల్ గృహోపకరణాలకు మెరుపు గ్యారంటీ!