దద్దుర్లు : శరీరంలో అలర్జీ వస్తే.. అది దద్దుర్ల రూపంలో కనిపిస్తుంది. శరీరం అధిక స్థాయిలో హిస్టమైన్ను ఉత్పత్తి చేస్తున్నప్పుడు దద్దుర్లు కనిపిస్తాయి. అప్పుడు సాధారణంగా యాంటి హిస్టమైన్ మందులు తీసుకోవడం వల్ల దురద తగ్గుతుంది. అయితే ఇవి చాలా కాలం పాటు ఉంటే మాత్రం వైద్యుడిని కలవాలని చెబుతున్నారు నిపుణులు.
రోసేసియా : ఇది ముఖంపై ఎరుపు, దద్దుర్ల రూపంలో కనిపించే దీర్ఘకాలిక చర్మ సమస్య. ముఖ్యంగా ముక్కు, బుగ్గలు, నుదుటిపై ప్రభావం చూపుతుంది. ఇది వచ్చిందంటే త్వరగా తగ్గదు. వైద్యుల సూచనల మేరకు ప్రిస్క్రిప్షన్ క్రీమ్‌లు, యాంటీబయాటిక్‌లు, ఇంటెన్స్ పల్సెడ్ లైట్ థెరపీ వంటి కొన్ని చికిత్సల ద్వారా తగ్గించుకునే ప్రయత్నం చేయొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
సోరియాసిస్ : ఇది రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే ఒక రకమైన చర్మ సంబంధిత వ్యాధి. ఈ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చర్మంపై వెండి పొలుసుల మచ్చలు కనిపిస్తాయి. సాధారణంగా ఇది నెత్తి, మోచేతులు, మోకాళ్లపై వస్తుంది. దీని కారణంగా చర్మం మందంగా మారడం, తెలుపు, వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే అలర్ట్ అయ్యి వైద్యుడిని సంప్రదించడం మంచిది అంటున్నారు నిపుణులు.
మీ స్కిన్ స్మూత్‌నెస్ పోయిందా? లిప్స్ డ్రై అయ్యాయా? ఈ టిప్స్ మీకోసమే!
మెలనోమా : ఇది ఒక చర్మ సంబంధిత క్యాన్సర్. సాధారణంగా ఇది పుట్టు మచ్చల నుంచి పుడుతుంది. కాబట్టి మీకు కొత్తగా పుట్టుమచ్చలు వస్తున్నా.. లేదా ఉన్న పుట్టుమచ్చలలో ఏదైనా మార్పు గమనించినా.. వెంటనే అలర్ట్ అయి చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే అది ఒకవేళ క్యాన్సర్ అయితే.. ప్రారంభ దశలోనే డాక్టర్ దాన్ని తొలగిస్తారు.
కాంటాక్ట్ డెర్మటైటిస్ : మీకు పడని పదార్థాలు తిన్నప్పుడు ఈ చర్మ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి దీనిని నివారించాలంటే ముఖ్యంగా మీకు ఏ పదార్థం తింటే అలర్జీ వస్తుందో తెలుసుకోవాలి. దానికి దూరంగా ఉండాలి.
బొల్లి : స్కిన్ మీద సహజంగా ఉండే రంగు పోవడం, తెల్ల మచ్చలు ఏర్పడడాన్ని బొల్లి లేదా విటిలిగో అంటారు. ముఖ్యంగా మెలనిన్ లేకపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. దీనికి ఎటువంటి నివారణా లేదు. కానీ, సూర్యుని నుంచి మీ చర్మాన్ని తగిన విధంగా రక్షించడం ద్వారా ఈ ప్రభావాన్ని చాలా వరకు తగ్గించవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మొటిమలు : సాధారణంగా ముఖం, మెడ, ఛాతీ, వీపుపై చర్మంపై బ్లాక్ హెడ్స్, మొటిమలు వస్తుంటాయి. చిన్న కేసులను యాంటీ బాక్టీరియల్ ఫేస్ వాష్‌తో చికిత్స చేయవచ్చు. కానీ, తీవ్రమైన కేసులకు రెటినోల్, అడాపలీన్ వంటి బలమైన మందులు అవసరమవుతాయంటున్నారు నిపుణులు.
ఇవేకాకుండా ఎగ్జిమా, లాటెక్స్ అలర్జీ, తట్టు, అమ్మోరు, రింగ్వార్మ్, మెలస్మా, బేసల్ సెల్ కార్సినోమా, పొలుసుల కణ క్యాన్సర్, ఇంపెటిగో, గజ్జి, హైపర్ హైడ్రోసిస్, సెల్యులైటిస్ వంటి మరికొన్ని చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నాయి. వీటిని కూడా త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే వేగంగా ఉపశమనం పొందవచ్చంటున్నారు. లేదంటే చర్మం మరింతగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఎండాకాలంలో స్కిన్ ట్యాన్ అవకుండా ఏం చేయాలి? డీహైడ్రేషన్ నుంచి కాపాడుకోవడమెలా?