ETV Bharat / health

హెన్నా పెట్టే ముందు జుట్టు కడుగుతున్నారా?- ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే! - henna powder

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 5, 2024, 3:26 PM IST

Henna Powder : జుట్టు ఆరోగ్యం కోసం హెన్నా వాడకం సర్వసాధారణమైంది. తెల్ల జుట్టును కవర్ చేయడానికి, జుట్టు వత్తుగా పెరగడానికి ఎలాంటి రసాయనాలు వాడని హెన్నా ఉపయోగిస్తున్నారు. మహిళలు ఇళ్లలో గోరింటాకుతో హెన్నా తయారు చేసుకుని తలకు పట్టించడం తెలిసిందే. అయితే హెన్నా వాడకంలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు సూచిస్తున్నారు.

henna_powder_benefits
henna_powder_benefits (henna_powder_benefits)

Henna Powder : ప్రస్తుతం జుట్టు సంబంధిత సమస్యలతో ఎంతో మంది బాధపడుతున్నారు. మహిళలు, పురుషులు అనే భేదం లేకుండా దాదాపు అన్ని వయస్సుల వారు జుట్టు రాలిపోవడం, తెల్ల జుట్టు తదితర రుగ్మతలతో ఇబ్బంది పడుతునన్నారు. ఈ నేపథ్యంలో వారంతా జుట్టుకు రాసే నూనెలు మార్చడంతో పాటు ఆయుర్వేద పద్ధతులను ఫాలో అవుతున్నారు. అలాంటి వారందరికి హెన్నా అద్భుతమైన మార్గంలా కనిపిస్తోంది. గోరింట ఆకులతో తయారు చేసే హెన్నా జుట్టు ఆరోగ్యానికి ఎంతగానో సహకరిస్తుంది.

చాలా మంది కురులు సహజంగా నలుపు, ముదురు ఎరుపు రంగులోకి మారేందుకు హెన్నా పెడుతుంటారు, అయితే, హెన్నా వాడటంలో పొరపాట్లు చేయడం వల్ల జుట్టు రాలిపోతుంది.

ఉదయం కాకుండా రాత్రి పూట జుట్టుకు నూనె పెడుతున్నారా? - ఏం జరుగుతుందో తెలుసుకోండి? - Benefits of Oiling Hair At Night

ఈ పద్ధతులు పాటిస్తే కురులు పట్టులా మెరుస్తాయని నిపుణులు చెప్తున్నారు.

  • హెన్నా ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెట్​లో దొరికేవన్నీ నిజమైన, నాణ్యమైన హెన్నా కాదని తెలుసుకోవాలి. కంపెనీ, దాని గాఢతను, ఎక్స్​పైరీ డేట్​ పరిశీలించిన తర్వాతే ఉపయోగించాలి.
  • హెన్నా వినియోగించేందుకు ముందుగా తలను శుభ్రం చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాతే తలకు పట్టించాలి. అప్పుడే వెంట్రుకలకు చక్కగా పడుతుంది.
  • కొంతమంది తలస్నానం చేయకుండానే కురులకు హెన్నా పెట్టేస్తారు. తలపై ఉండే బ్యాక్టీరియాకు హెన్నా చేరితే జుట్టు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • ముందుగా టీ లేదా కాఫీ డికాషన్​ సిద్ధం చేసుకోవాలి. అందులో మెహందీ పౌడర్​ ఓ కప్పు కలుపుకోవాలి. కొంచెం సేపటి తర్వాత ఆ మిశ్రమాన్ని తలకు పట్టించాలి.
  • మెహందీ పౌడర్​లో మందార ఆకుల పొడిని కలిపి తలకు పట్టిస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ మిశ్రమంలో కోడిగుడ్డు తెల్ల సొన వేసి కలుపుకొని తలకు పెట్టుకుంటే కురులు నిగనిగలాడుతాయి.
  • గోరింటాకు తలకు పెట్టిన తర్వాత షాంపూ పెట్టి కడిగేస్తుంటారు. కానీ, అది ఏ మాత్రం మంచిది కాదు. అలా చేయడం వల్ల చర్మ, జుట్టు సమస్యలు వస్తాయి. హెన్నా ఆరిన తర్వాత చల్లని నీటితో షాంపూ లేకుండా జుట్టును శుభ్రం చేసుకోవాలి.
  • మెంతులు, పెరుగు, మందార పొడుల్లో ఒకదాన్ని హెన్నాతో కలుపుకొని పెట్టుకుంటే రంగు బాగుంటుంది. కురులు, అందంగా, మృదువుగా ఉంటాయి.
  • మెహందీ పౌడర్​ను నేరుగా తలకు పట్టించడంతో చుండ్రు పెరుగుతుంది. పేలు కూడా పడతాయి. అందుకే మెహందీ పౌడర్​కు ఏదైనా మిశ్రమాన్ని జత చేసి వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • కొద్దిగా బీట్​రూట్​ రసం తీసుకొని దానిలో సరిపడేంత హెన్నా పొడి, చెంచా చొప్పున ఆలివ్ ఆయిన్, నిమ్మరసం, అర చెంచా శనగపిండి కలుపుకోవాలి.
  • ఆ హెన్నాను తలకు పట్టించి అర్ధగంట అలాగే ఉంచాలి. ఇలా చేయడంతో జుట్టుకు రంగుతో పాటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఇవే గాకుండా జుట్టు రాలే సమస్యలపై ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.సందీప్​ పలు సూచనలు చేశారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

వర్షాకాలంలో జుట్టు చిక్కులు పడుతూ చిరాగ్గా ఉంటోందా? - ఇలా చేస్తే ఈజీగా సిల్కీ హెయిర్‌ మీ సొంతం! - Hair Care Tips

అద్భుతం: ఈ పౌడర్​ రోజూ ఒక్క చెంచా తీసుకుంటే - వెన్నునొప్పి మొదలు ఈ సమస్యలన్నీ పటాపంచల్​! - Homemade Nut Powder for Good Health

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.