Loofah Side Effects: చాలామంది సబ్బు లేదా బాడీవాష్ను బాడీకి అప్లై చేసుకొని లూఫాతో రుద్దుకొని మరీ స్నానం చేస్తుంటారు. అయితే.. లూఫాను ఉపయోగించడం సురక్షితమేనా అంటే.. అంత మంచిది కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. లూఫాను ఉపయోగించడం వల్ల అది మీ చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది. దీనివల్ల సాధారణంగా మీ చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. కానీ.. చాలా గట్టిగా స్క్రబ్బింగ్ చేయడం వల్ల బాహ్యచర్మం కూడా దెబ్బతింటుందట. దాని వలన రాపిడి, చికాకుతోపాటు చర్మం ఎర్రబడుతుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే.. చర్మం మేనిఛాయ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
అందువల్ల.. మీరు లూఫాను ఉపయోగిస్తున్నట్లయితే, దాని పరిశుభ్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. లేదంటే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లూఫా వాడే చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే.. తరచుగా లూఫాతో ఒళ్లు రుద్దుకోవడం, పని పూర్తయ్యాక దాన్ని బాత్రూమ్లోనే పైపైన క్లీన్ చేసి అక్కడే ఏదో ఒక చోట పెడుతుంటారు.
అయితే.. అప్పటికే తడిగా ఉన్న లూఫాను తేమగా ఉన్న ప్రదేశంలో ఉంచడం వల్ల దానిపై బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మళ్లీ వాటిని తిరిగి యూజ్ చేయడం మూలంగా.. మొటిమలు, ఇతర సౌందర్య సమస్యలతోపాటు కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుందంటున్నారు. అలాగే.. లూఫాను ఎక్కడైనా దెబ్బతగిలిన చోట లేదా ఓపెన్ కట్ ఉన్న చోట ఉపయోగించినట్లయితే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
బీ అలర్ట్ - ఈ ఆహారాలను ఎక్కువగా ఉడికిస్తున్నారా? - క్యాన్సర్ వచ్చే అవకాశం!
కాబట్టి మీరు లూఫాను ఉపయోగించాలనుకుంటే.. దాన్ని వాడిన ప్రతిసారీ వెంటనే శుభ్రపరుచుకోవాలని సూచిస్తున్నారు. తర్వాత పూర్తిగా ఆరిపోయేంత వరకు ఎండలో ఉంచడం మంచిది. లూఫాను ఎప్పుడూ బాత్రూమ్లో ఉంచవద్దంటున్నారు నిపుణులు. వారానికి ఒకసారి వెనిగర్ లేదా బ్లీచ్ కలిపిన నీటిలో వేసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆపై చల్లటి నీటితో కడిగి ఎండలో ఆరబెట్టాలి. అదేవిధంగా.. ఒకే లూఫాను నెలల తరబడి వాడినా సమస్యలు వస్తాయి. కాబట్టి నెలకోసారి లూఫాను మార్చాలని చెబుతున్నారు.
అదేవిధంగా శరీరాన్ని లూఫాతో ఎక్కువగా స్క్రబ్ చేయవద్దు. జననేంద్రియాలు, సమీప ప్రాంతంలో ఉపయోగించకుండా చూసుకోండి. అలాగే, ఇప్పుడే మీ చర్మాన్ని షేవ్ చేసుకున్నట్లయితే లూఫాను ఉపయోగించొద్దు. ఇన్ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక చివరగా మీరు లూఫా స్థానంలో.. సిలికాన్ బాత్ స్క్రబ్బర్లు లేదా వాష్‌క్లాత్ వంటి ఉత్పత్తులను ఉపయోగించడం బెటర్ అని సూచిస్తున్నారు. ఇవి కూడా వాడిన తర్వాత పూర్తిగా శుభ్రం చేయాలనే విషయం మర్చిపోవద్దని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
ఫస్ట్‌టైమ్ మేకప్ ట్రై చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించండి - సూపర్ బ్యూటీ మీ సొంతం!
క్షణాల్లో తయారయ్యే టిఫెన్స్ - ఈ 5 రకాల రుచులు టేస్ట్ చేశారా?