List Of Food Cats Cannot Eat : ఇంట్లో కుక్కలను, పిల్లులను పెంచుకోవడం ఈ మధ్య చాలా కామన్ అయింది. పెట్స్‌ను పెంచుకోవడం చాలా మంచి అలవాటు. కానీ పిల్లలను పెంచడం అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. ముఖ్యంగా దానికి పెట్టే ఫుడ్స్ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందట. పిల్లికి అస్సలు పెట్టకూడని కొన్ని ఆహరాలుంటాయట. వాస్తవానికి పిల్లులు చాలా స్మార్ట్‌గా వ్యవహరించే జంతువులు. కానీ ఫుడ్ విషయంలో మాత్రం ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకోలేవు. మనమే వాటిని పర్యవేక్షిస్తూ ఏది మంచి ఆహారం ఏది కాదో కనిపెట్టుకుని ఉండాలి. ప్రమాదకరమైన వాటి జోలికి పోనివ్వకుండానే ఉంటేనే మీ పెంపుడు పిల్లి సేఫ్‌గా ఉంటుంది.
చాక్లెట్స్
పిల్లులు సహా జంతువుల్లో వేటికి కూడా చాక్లెట్స్ అనేవి ఇవ్వకూడదు. వాటిల్లో ఉండే కెఫైన్, థియోబ్రోమైన్ పిల్లులకు చాలా ప్రమాదానికి గురి చేస్తాయి. వాటి శరీరానికి హాని కలుగజేస్తాయి.
ఆల్కహాల్
పిల్లులకు ఆల్కహాల్ పట్టించారా? ఇక సమాధి కట్టేసినట్లే. పొరబాటున రెండు సిప్పులు తాగినా సరే పిల్లికి ఇబ్బందులు తప్పవు. డయేరియా, వాంతులు లాంటి ఇతర సమస్యలు పట్టి పీడిస్తాయి.
పచ్చి గుడ్లు
ఉడకబెట్టని గుడ్లను కూడా తినకూడదు. వీటిని తినడం వల్ల వాటి శరీరాల్లో మార్పులు సంభవిస్తాయి. ఫుడ్ పాయిజనింగ్, చర్మ సమస్యలు వంటివి ఎదురవుతాయి.
ఎముకలు
కుక్కల్లా ఎముకలను తినగలిగిన బుద్ధి పిల్లికి లేదట. ఒకవేళ పిల్లి వేరే జంతువు ఎముకలను తిన్నదంటే దాని జీర్ణాశయ వ్యవస్థకు చిల్లు పడ్డట్లేనట. ఒకవేళ అదే జరిగితే మీరు ప్రేమగా పెంచుకునే పిల్లి ప్రాణాలు కోల్పోతుంది.
కుక్కల ఆహారం
పిల్లులకు పెట్టే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. కుక్కలు తినే ఆహారాన్నే పిల్లులకు పెట్టాలనుకుంటే పొరబాటు చేసినట్లే. ఆ ఆహారంలో ఉండే పోషకాలు పిల్లుల శరీరాలకు సరిగ్గా సరిపోవు.
పచ్చి చేపలు
చెరువుల్లో, కాలవుల్లో దొరికిన చేపలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటాం. వాటిని పెంపుడు పిల్లి తినేందుకు ప్రయత్నిస్తుంటుంది. పొరబాటున గొంతులో వేసుకుని తిందామని ప్రయత్నించినా శరీరంలో చెడు బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఒకానొక సందర్భంలో ఈ బ్యాక్టీరియా పిల్లి ప్రాణాలను కూడా బలి తీసుకోవచ్చు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.