Lemon In Bedroom Benefits : అత్యంత ఉపయోగకరమైన పండ్లలో నిమ్మకాయ ఒకటి. ఉదయాన్నే నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి కావలసన శక్తి అందుతుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు హానికరమైన టాక్సిన్లు, అంతర్నిర్మిత వ్యర్థాలను తొలగించడానికి నిమ్మరసం డీటాక్సిఫైయింగ్ ఫ్లష్‌గా పనిచేస్తుంది. అయితే నిమ్మకాయ కేవలం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో మాత్రమే కాదు, చాలా రకాల ఇంటి పనుల్లోనూ సహయపడుతుంది. ఇంట్లోని గిన్నెలతో పాటు పూర్తి వంటగదిని, బాత్రూమ్ను శుభ్రపరిచేందుకు నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుంది. దీని సువాసన వాటిని తాజాగా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. ఇవన్నీ అందరికే తెలిసినవే అనుకోకండి. ఇక్కడ తెలియని విషయం కూడా ఒకటి ఉంది.
నిమ్మకాయలోని ఉపయోగాల్లో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇది నిద్రను ప్రేరేపించే ఔషధంగా పనిచేస్తుందట. నిద్రలేమి సమస్యతో ఇబ్బంది పడేవారికి నిమ్మకాయలు నిస్సందేహంగా సహాయపడతాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. అవును మీరు వింటున్నది నిజమే. పడక గదిలో నిమ్మకాయ ఉంచుకోవడం నిద్రను ప్రేరేపించడంలో బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు చాలా విశ్రాంతిగా, మరుసటి రోజున మరింత యాక్టివ్‌గా ఉండేలా చేస్తుందట. ఇందుకోసం మీరు ఓ నిమ్మకాయను తీసుకుని నాలుగు భాగాలుగా కట్ చేసి గిన్నెలో వేసి మంచం పక్కనే ఉంచండి. ఇలా రాత్రంతా ఉంచడం వల్ల మీరు హాయిగా నిద్రపోవడమే కాదు చాలా విశ్రాంతిగా, తాజాగా ఫీలవడం ఖాయమని నిపుణులు చెబుతున్నాయి.
ప్రయోజనాలు :
- బెడ్రూమ్లో మంచం పక్కనే నిమ్మకాయ పెట్టుకోవడం వల్ల చక్కగా నిద్రపట్టడం మాత్రమే కాకుండా మరిన్ని లాభాలు కూడా ఉన్నాయట.
- నిమ్మకాయ చక్కటి క్రిమినాశిని, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఎన్నో రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది.
- నిమ్మకాయ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించడానికి దోహదపడుతుంది.
- నిమ్మ సువాసన సైనస్‌లను తెరవడానికి, వాటిని క్లియర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఆస్తమాతో బాధపడుతున్నవారికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
- నిమ్మకాయను కట్ చేసి మంచం పక్కన పెట్టడం వల్ల మీ హ్యాంగోవర్ ప్రభావం కూడా చాలా వరకూ తగ్గుతుంది.
- జులుబుతో ఇబ్బంది పడుతున్న వారికి నిమ్మ సువాసన మంచి ఔషధంగా పనిచేస్తుంది. శ్లేష్మాన్ని క్లియర్ చేయడానికి, శ్వాసను సులభతరం చేయడానికి ఇది మంచి చిట్కాగా చెప్పవచ్చు.
- గదితో గాలి నాణ్యతను మెరుగుపరిచే లక్షణాలు నిమ్మకాయలో మెండుగా ఉంటాయి.
- సహజ సువాసన లక్షణాలు కలిగిన నిమ్మకాయ చక్కటి దుర్గంధనాశినిగా పనిచేసి, గదిలోని చెడు వాసలను తొలగిస్తుంది.
- రాత్రి పూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టే దోమలు, ఇతర ఇబ్బందికర కీటకాలను నిమ్మలోని సిట్రస్ సువాసన తిప్పికొడుతుంది.